Monday Motivation: మీ జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటున్నారా? రాత్రి 7 గంటల తర్వాత ఈ పనులు చేయండి-monday motivation want to change your life do these things after 7 pm ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Motivation: మీ జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటున్నారా? రాత్రి 7 గంటల తర్వాత ఈ పనులు చేయండి

Monday Motivation: మీ జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటున్నారా? రాత్రి 7 గంటల తర్వాత ఈ పనులు చేయండి

Haritha Chappa HT Telugu
Jun 17, 2024 05:00 AM IST

Monday Motivation: మీ జీవితాన్ని సన్మార్గంలో నడిచేలా చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు చేసే పనులే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. మీ జీవితం బాగుండాలంటే కొన్ని రకాల పనులు అలవాట్లు చేసుకోవడం మంచిది.

మోటివేషనల్ స్టోరీ
మోటివేషనల్ స్టోరీ (Pexels)

Monday Motivation: ప్రతి ఒక్కరి జీవితం మొదట వారి చేతుల్లోనే ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే విచ్చలవిడిగా వదిలేస్తారో... అప్పుడే చేజారిపోతుంది. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఏ పనులు చేయాలన్నది మీరు ముందే ప్రణాళిక వేసుకొని ఉంటే జీవితం అదుపు తప్పకుండా సన్మార్గంలో నడుస్తుంది. ముఖ్యంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగం చేసుకున్నా, సాయంత్రం ఏడు తర్వాత మాత్రం కొన్ని పనులు చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది మీకు ఎంతో ప్రశాంతత జీవితంతో ముందుకెళ్లాలన్నా ఆశను పెంచుతుంది.

త్వరగా భోజనం

భోజనం ఆలస్యంగా తినకండి. ఇది శారీరక, మానసిక ఆరోగ్యం పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. వీలైనంతవరకు 7:30 కల్లా భోజనాన్ని ముగించండి. భోజనం చేసిన వెంటనే నిద్రపోకండి. కనీసం రెండు గంటల సమయాన్ని గ్యాప్ గా తీసుకోండి. ఆ రెండు గంటల సమయంలో మీకు నచ్చిన పనులను చేయండి. ప్రశాంతంగా కూర్చుని శ్వాస తీసుకోండి. నవ్వించే సినిమాలు చూడండి. ఇది మీలో ఎండార్ఫిన్లు విడుదలవడానికి కారణం అవుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యం చాలా ఆనందంగా గడుస్తుంది.

ఒకసారి ఉదయం నుంచి మీరు చేసిన మంచి పనులను గుర్తు చేసుకోండి. అది చిన్నదైనా పెద్దదైనా జాగ్రత్తగా గుర్తించడం చాలా అవసరం. డిన్నర్ చేస్తున్నప్పుడు మీ కుటుంబంతో కలిసి స్వేచ్ఛగా మాట్లాడండి. నవ్వండి. వారు చేసే పనులను మెచ్చుకోండి. వారి కోసం కొంత సమయాన్ని కేటాయించండి. ఇది కుటుంబంలో బంధాలను బలపరుస్తుంది. దీనివల్ల ఇల్లు స్వర్గంలా మారుతుంది.

డిజిటల్ డిస్‌కనెక్ట్

రాత్రి 7 గంటల తర్వాత ఫోన్లు వాడడం పూర్తిగా మానేయండి. అలాగే ఇన్స్టా గ్రామ్ చెక్ చేయడం, యూట్యూబ్ లో ఫాలోవర్స్ ఎంతమంది వచ్చారో చెక్ చేయడం వంటి పనులు మానేయండి. ఈ డిజిటల్ ప్రపంచంలో మీరు మిమ్మల్ని మీరే డిస్ కనెక్ట్ అవుతున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు, సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే మీరు అనుబంధాలకు, కుటుంబానికి అంత దగ్గరవుతారు. రాత్రి 7 తర్వాత ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు చేతిలో ఉండకుండా జాగ్రత్త పడండి. ఇది మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. సహజంగా నిద్రపట్టే సామర్థ్యాన్ని పెంచుతుంది.

నిద్రపోయే ముందు చేయాల్సిన మరో ముఖ్యమైన పని మీ మరుసటి రోజు ఏ పనులు చేయాలో ఆలోచించుకోవడం. దానికోసం ప్లాన్ చేసుకోవడం, రోజును అత్యంత ఉత్పాదకమైన రోజుగా మార్చుకోవడానికి మీరు ముందే సిద్ధపడాలి. ఆ రోజు ఏ ఏ పనులు చేయాలో ఓసారి మనసులో అనుకోండి. హౌస్ వైఫ్స్ అయితే పిల్లలకు, భర్తకు ఏం వండి పెట్టాలో, కొత్తగా ఏం నేర్చుకోవాలి అనేది ఆలోచించండి.

రాత్రి 7 తర్వాత భోజనం చేశాక కనీసం ఓ పావుగంటసేపు నడవడానికి ప్రయత్నించండి. వీలైతే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వీధుల్లో అలా వాకింగ్‌కి వెళ్లి రండి. రాత్రిపూట ఆరు బయట వినిపించే శబ్దాలు, దృశ్యాలు అద్భుతంగా అనిపిస్తాయి. ఇది మీకు ఎంతో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే నిద్రా నాణ్యతను పెంచుతుంది.

నిద్రపోయే ముందు మీ పడకగదిని, ఇంటిని పరిశుభ్రంగా మార్చుకుని అప్పుడు పడుకోండి. ముఖ్యంగా పడకగది ఎంత పరిశుభ్రంగా ఉంటే నిద్ర అంత బాగా పడుతుంది. చిందర వందరగా ఉండే గదులు, మీ మెదడును కూడా చిందరవందర ఆలోచనలతో నింపేస్తాయి. కాబట్టి మీ చుట్టూ ఉండే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మీ మెదడు కూడా అంతే పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి ఇల్లును మీరు క్లీన్ గా పెట్టుకోవడానికి ప్రయత్నించండి.

WhatsApp channel