Monday Motivation: ఆ విషయంలో ఆలోచనలకు అడ్డుకట్ట వేయొద్దు.. ఇలా ముందుకు సాగితేనే..-monday motivation think big about your goals ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Motivation: ఆ విషయంలో ఆలోచనలకు అడ్డుకట్ట వేయొద్దు.. ఇలా ముందుకు సాగితేనే..

Monday Motivation: ఆ విషయంలో ఆలోచనలకు అడ్డుకట్ట వేయొద్దు.. ఇలా ముందుకు సాగితేనే..

Monday Motivation: జీవితంలో చాలా మంది లక్ష్యాలతో ముందుకు సాగుతూ ఉంటారు. వాటిని సాధించాలని తపిస్తుంటారు. అయితే, లక్ష్యాల విషయంలో కొందరి ఆలోచన మాత్రం సరిగా ఉండదు. ఈ విషయంలో పరిమితులు విధించుకోకూడదు.

Monday Motivation: ఆ విషయంలో ఆలోచనలకు అడ్డుకట్ట వేయొద్దు.. ఇలా ముందుకు సాగితేనే..

జీవితంలో ఎదుగుదల ఉండాలంటే ప్రతీ ఒక్కరు లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఆ దిశగా పని చేస్తూ ముందుకు సాగాలి. ఉద్యోగులైనా, వ్యాపారులైనా, విద్యార్థులైనా.. ఏ రంగంలో ఉన్న వారైనా కచ్చితంగా గోల్స్ పెట్టుకోవాలి. చాలా మంది లక్ష్యాలను నిర్దేశించుకున్నా.. పెద్ద ఆలోచించేందుకు తటపటాయిస్తారు. మన వల్ల అవుతుందా అని జంకుతుంటారు. అయితే, లక్ష్యాల విషయంలో ఆలోచనలకు అడ్డుకట్ట వేయకూడదు. పెద్దగా ఆలోచించాలనే చాలా మంది పెద్దలు కూడా చెబుతారు. నిర్దేశించుకున్న లక్ష్యాల విషయంలో ఎలా ఆలోచిస్తే, వ్యవహరిస్తే పురోగతి ఉంటుందంటే..

ఆలోచనలు పెద్దగా ఉండాలి

లక్ష్యాల విషయంలో ఆలోచనలు ఎప్పటికీ భారీగా ఉండాలి. అప్పుడే వాటిని విలువైన గోల్స్‌గా పట్టుదలతో తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆలోచనలు రియలస్టిక్‍గా, సరైనవిగా కూడా అయి ఉండాలి. ఇప్పటి పరిస్థిలతో పోలిస్తే ఆ లక్ష్యాలు చాలా దూరంగా ఉన్నట్టు అనిపించినా సరే పెద్దగానే ఆలోచించాలి. ప్రయత్నాన్ని చిన్నగా మొదలుపెట్టినా.. ఆ భారీ లక్ష్యాన్ని చేరుకుంటామనే నమ్మకాన్ని స్వయంగా కలిగించుకోవాలి. పెద్ద ధ్యేయాలు ఉన్నప్పుడే జీవితం ఆసక్తికరంగా, అర్థవంతంగా సాగుతుంది.

ఆసక్తిగా ఉండాలి

లక్ష్యాల విషయంలో భారీ ఆలోచనలు పెట్టుకుంటేనే సరిపోదు.. వాటిని ఎలా సాధించాలనే ఆసక్తి ఆరంభం నుంచే ఉండాలి. ఎలా అచీవ్ చేయాలనే విషయంపై ముందు నుంచే పరిశోధన చేసి అర్థం చేసుకోవాలి. ముందుకు సాగేందుకు ప్రణాళికను రూపొందించుకోవాలి. లక్ష్యాన్ని ఎప్పటికి చేరగలమో అంచనా వేసుకోవాలి.

సవాళ్లకు ముందుండాలి

జీవితంలో ఎదగాలంటే సవాళ్లు ఎదురైనప్పుడు ముందుండాలి. లక్ష్యాన్ని చేరాలంటే ఛాలెంజ్‍లు ఎదురైనప్పుడు వెనక్కి వెళ్లకూడదు. వాటిని అధిగమిస్తేనే మరింత నమ్మకం పెరుగుతుంది. మున్ముందు ఎలా సాగాలో అర్థమవుతుంది.

మీ చుట్టూ అలాంటి వారే ఉండేలా..

మీలా గొప్పగా ఆలోచించే వారినే ఎప్పుడూ పక్కన ఉండేలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వారి నుంచి కూడా స్ఫూర్తి పొందే అవకాశం ఉంటుంది. నీ వల్ల కాదులే అని అనే వారు చుట్టూ ఉంటే ఏదో ఓ దశలో నిరుత్సాహం కలిగే అవకాశాలు ఉంటాయి. అందుకే వీలైనంత వరకు జీవితంలో లక్ష్యంతో ముందుకు సాగుతున్న వారితోనే ఎక్కువగా టచ్‍లో ఉండేందుకు ప్రయత్నించండి. వారితో ఆలోచనలను పంచుకోండి.

ఎదురుదెబ్బల నుంచి నేర్చుకోవాలి

భారీ లక్ష్యాలను సాధించే క్రమంలో ఒక్కోసారి ఎదురుదెబ్బలు, ఓటములు ఎదురుకావొచ్చు. ఇలాంటి సమయాల్లోనే ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మధ్యలో ఎదురుదెబ్బలు తగలడం వల్ల భవిష్యత్తులో ఏం చేయాలో ఓ క్లారిటీ వస్తుంది. మళ్లీ అలాంటివి ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొంటామని నమ్మకం పెరుగుతుంది.

సంబంధిత కథనం