Monday Motivation : కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలే.. మంచి ఫలితాలిస్తాయి..
Monday Motivation : మన జీవితంలో ఎప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకోము. మనం కరెక్ట్ అనుకుని ఫాలో అవుతాము కానీ.. అవి మనకి చేదు అనుభవాలు ఇస్తాయి. అలాగే మన జీవితంలో తీసుకునే కొన్ని తప్పు నిర్ణయాలు మనకి మంచి ఫలితాలు ఇస్తాయి.
Monday Motivation : జీవితంలో మంచి, చెడు రెండూ ఉంటాయి. కొన్ని సార్లు అవి వాటికి పూర్తిగా విరుద్ధమైన ఫలితాలు ఇస్తాయి. మనం కొన్నిసార్లు మంచి అనుకుని చాలా పాజిటివ్‌గా ఉంటాము. కానీ అది మనం ఊహించని ఫలితాలు ఇస్తుంది. ఎంతగా అంటే ఆ దెబ్బ నుంచి తేరుకోలేము కూడా. అలాగే.. కొన్నిసార్లు తప్పక లేదా.. కోపంలోనో తీసుకునే నిర్ణయాలు.. ఆశలు పెట్టుకోలేని ఓ నిర్ణయం.. మీకు ఊహించని మంచి ఫలితాలు ఇస్తుంది. అలా వచ్చింది ఏదైనా బోనస్‌నే.
అంటారుగా ఒక్కోసారి అదృష్టం కలిసి వస్తుందని. అలాగే కొన్ని సార్లు అరటిపండు తిన్నా.. పన్ను విరుగుతుందని. అలాగే.. మనకి ఎక్కడో లక్ రాసిపెట్టి ఉన్నా.. లేదా ఎప్పుడూ మన కోరిక వినని దేవుడు మనకి ఏమి కావాలో తెలుసుకుని ఇవ్వొచ్చు. లేదా ప్రకృతి మనకి సహకరించవచ్చు. కుదిరితే చెడు నిర్ణయాలు తీసుకోకండి. కానీ తీసుకుంటే ఏదో చెడు మాత్రమే జరుగుతుందని భయపడకండి. మనం ఎంత పాజిటివ్‌గా ఉంటే.. మనకి అంత మంచి జరుగుతుంది.
అలా అని మనం బ్యాడ్ ఐడియాలు తీసుకుంటే మంచి జరుగుతుందనుకోవడం మూర్ఖత్వమే. అప్పుడప్పుడు మాత్రమే లక్ కలిసి వస్తుంది. లేదంటే మనకి ప్రతి బ్యాడ్ ఐడియా బ్యాండ్ బాజా భారాత్ చేస్తుంది. కాబ్టటి ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆచితూచి.. ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చేసే ప్రతి పనిలో మీ ఎఫర్ట్స్ పెట్టండి. అవి మిమ్మల్ని కచ్చితంగా మిమ్మల్ని మంచి స్థానంలో నిలబెడతాయి. ప్రతి రోజూ మనది కాకపోవచ్చు. కానీ ఏదొక రోజు మనదే అవుతుంది. ప్రతి సారి మన శత్రువులే కాదు.. మనం కూడా విజయాన్ని సాధిస్తాము.
నిర్ణయాలు సరైనవి తీసుకుంటే సరిపోతుందా? లేదు కాస్త ఓపిక, సహనం కూడా ఉండాలి. మనం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. మనలోని ఓపిక, సహనమే కాస్త మెరుగైన ఫలితాలు ఇస్తుంది. మనం ఏదో తప్పు చేస్తున్నామని కంగారు పడిపోయి.. తప్పు మీద తప్పు చేయకుండా ఉండడమే మంచిది. ఒకవేళ తప్పు చేస్తున్నామని గట్ ఫీలింగ్ ఉంటే.. వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలో ఆలోచించి సరిదిద్దుకోండి. కంగారు పడిపోయి తప్పు మీద తప్పు చేస్తే.. ఫలితాలు చాలా ఘోరంగా ఉంటాయి. జీవితంలో మంచి జరిగినా.. చెడు జరిగినా పాజిటివ్‌గా ఉండండి. అదే మీకు మంచి చేస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్