మంచి ఫలితాలు రావాలంటే.. కంఫర్ట్ జోన్​ నుంచి బయటకు రండి.. -monday motivation on comfort zone issues and great things in life ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Monday Motivation On Comfort Zone Issues And Great Things In Life

మంచి ఫలితాలు రావాలంటే.. కంఫర్ట్ జోన్​ నుంచి బయటకు రండి..

HT Telugu Desk HT Telugu
Apr 18, 2022 07:30 AM IST

జీవితంలో గొప్పగా ఏదైనా సాధించాలనుకుంటే.. దాని కోసం మీరు పూర్తిగా ప్రయత్నించాల్సి ఉంది. ఒక్కోసారి ఏదైనా సాధించాలనుకున్నప్పుడు.. లేదా నచ్చినది దక్కించుకోవాలనుకున్నప్పుడు.. మీరు మీ కంఫర్ట్ జోన్‌ను దాటి బయటకు రావాల్సి ఉంటుంది. మీకు అలవాటైన పనిని, లేదా కంఫర్ట్ జోన్​లో ఉంటే.. మీరు ఎప్పుడు మీ డ్రీమ్​ను ఫుల్​ ఫిల్​ చేసుకోలేరు. దేనినైనా సాధించాలనుకుంటే.. మీరు ఏమి చేయగలరని అనుకుంటున్నారో దానికి మించి ప్రయత్నించాలి.

కంఫర్ట్ జోన్​ నుంచి బయటకు రండి..
కంఫర్ట్ జోన్​ నుంచి బయటకు రండి..

Monday Motivation | ప్రతి ఒక్కరికి తమ జీవితంలో ఏదొకటి సాధించాలనే కోరిక ఉంటుంది. కానీ వాటిని పొందాలనుకునే క్రమంలో కొందరు తమ కంఫర్ట్ జోన్​ను వదలడానికి అస్సలు ఇష్టపడరు. తమ కంఫర్ట్ జోన్​ వదిలేస్తే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందేమోనని భయంతో వెనకడుగు వేస్తారు. కోరిక ఉన్నా.. కంఫర్ట్ జోన్‌లోనే ఉంటే.. గొప్పగా ఏమీ చేయలేరనే విషయాన్ని గుర్తించుకోవాలి. విజయం అనేది మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కంటే.. మరింత మంచి స్థానాన్ని ఇస్తుంది. కాబట్టి మనం అనుకున్నదానికంటే.. ఎక్కువగా మన సామర్థ్యాలు, నైపుణ్యాలను విస్తరించాలి. అప్పుడే మన లక్ష్యాలను సాధిస్తాము.

ఒక్కటే గుర్తుపెట్టుకోండి.. మీరు కంఫర్ట్ జోన్​లోనే ఉండాలని అనుకున్నప్పుడు.. ఎప్పటికీ మీరు కోరుకున్నవాటిలో పురోగతి సాధించలేరు. విజయం సాధించాలి అనుకున్నప్పుడు లేదా.. ఏదైనా పొందాలనుకున్నప్పుడు మీ శక్తికి మించి ప్రయత్నిస్తే.. అవి మీ సొంతమవుతాయి. ఏదైనా గొప్ప పని చేయాలని నిర్ణయించుకున్న క్షణం.. మీరు మీ కంఫర్ట్ జోన్​ నుంచి మీరు కచ్చితంగా బయటపడాలి. ఈ మార్పు గురించి భయపడవద్దు. బదులుగా రాబోయే గొప్ప ఫలితాల గురించి ఆలోచించి సంతోషంగా ఉండండి. మీ కంఫర్ట్ జోన్ వదిలినప్పుడే కొత్త జీవితం ప్రారంభమవుతుందని అనే విషయాన్ని గుర్తుంచుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్