Monday Motivation : వాచ్‍మెన్ టూ బిజినెస్‍మెన్.. అతడు ముంబయికి మెల్లగా ఎలాగోలా బతికెయ్యటానికి రాలేదు
Monday Motivation : మనలో చాలామంది ప్రస్తుతం ఉన్న స్థానం గురించే ఆలోచిస్తారు. ఇక అక్కడే ఉండిపోతారు. కానీ చేరాల్సిన గమ్యాన్ని సరిగా నిర్దేశించుకుంటే.. ఉన్నత స్థానం వైపు చూస్తారు. ఓ వ్యక్తి అలానే ఎదిగాడు. ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిగా ఉన్నాడు.
Monday Motivation : మనలో చాలామంది ప్రస్తుతం ఉన్న స్థానం గురించే ఆలోచిస్తారు. ఇక అక్కడే ఉండిపోతారు. కానీ చేరాల్సిన గమ్యాన్ని సరిగా నిర్దేశించుకుంటే.. ఉన్నత స్థానం వైపు చూస్తారు. ఓ వ్యక్తి అలానే ఎదిగాడు. ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిగా ఉన్నాడు.
కఠోర శ్రమ, నిర్ధిష్ట లక్ష్యం ఉంటే విజయం సాధించవచ్చనడానికి కొన్ని ఉదాహరణాలు కనిపిస్తుంటాయి. స్టార్టప్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వడం అనుకున్నంత ఈజీ కాదు. ఇన్నోవేషన్ ప్రారంభించిన వారిలో కొంతమంది మాత్రమే విజయం సాధిస్తారు. స్టార్టప్‌ల ఆలోచన వినూత్నంగా, సరికొత్తగా ఉంటే సులభంగా విజయం సాధిస్తారని చాలామంది చూపించారు.
ఇలాంటి వినూత్నమైన ఆలోచన చేసిన వ్యక్తి గురించి ఈ రోజు తెలుసుకుందాం. అతని పేరు దిగ్విజయ్ పాండే. కార్ట్జ్ ఫ్రెష్ , స్టార్టప్ CEO, వ్యవస్థాపకుడు. తన సక్సెస్ స్టోరీ చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. జూలై 2005 ముంబయిలో సవాలుతో కూడుకున్న నెల. ఎందుకంటే అప్పుడు ఘోరమైన వరద అక్కడి ప్రజల జీవితాలను నాశనం చేసింది. ఆ సమయంలో పద్దెనిమిదేళ్ల కుర్రాడు దిగ్విజయ్ పాండే కూడా అక్కడే ఉన్నాడు. బీహార్‌లోని ఓ కుగ్రామంలో పుట్టిన అతడు ముంబైకి వచ్చాడు.
ముంబైలో అతనికి ఒక పెద్ద కల ఉంది. అయితే, ముంబయికి లక్షలాది మంది కలలతో వస్తారు. కానీ దిగ్విజయ్ రూట్ మాత్రం వేరే. దిగ్విజయ్ సింగ్ మొదటి ఉద్యోగం వాచ్‌మెన్. దీంతోపాటు పుస్తక విక్రేతగా కూడా పనిచేశాడు. తర్వాత మారుతీ షోరూమ్‌లో సేల్స్‌మెన్‌గా కూడా పనిచేశాడు. తర్వాత 2014లో మెర్సిడెస్ బెంజ్ షోరూమ్‌లో ఉద్యోగం వచ్చింది. కష్టపడి మెర్సిడెస్-బెంజ్‌లో సేల్స్ హెడ్‌గా మారాడు.
అయితే ఇది మాత్రం దిగ్విజయ్ కల కాదు. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. మనలో కూడా కొందరికి అలాంటి కల ఉంటుంది. కానీ విఫలమవుతామనే భయంతో అలాంటి ప్రయత్నం చేయకుండా ఉంటాం. కానీ, దిగ్విజయ్ పాండే అలా చేయలేదు. కూరగాయలు అమ్మడం ప్రారంభించాడు. అయ్యో ఇంత పెద్ద మెర్సిడెస్ బెంజ్ కంపెనీలో ఉద్యోగం మానేసి కూరగాయల దుకాణం పెట్టుకున్నాడా అని అనుకోకండి. ఇది కూరగాయలను విక్రయించే ఆన్‌లైన్ స్టోర్.
దిగ్విజయ్ పాండే తన 34వ ఏట కార్ట్జ్ ఫ్రెష్ అనే స్టార్టప్‌ని ప్రారంభించాడు. అతను తన ఫ్లాట్ బాల్కనీ నుండి ఈ కొత్త స్టార్టప్‌ను మెుదలుపెట్టాడు. మొదట్లో ఇది కూరగాయలు విక్రయించే ఆన్‌లైన్ సైట్. తర్వాత కూరగాయలు కోసి కస్టమర్లకు డెలివరీ చేయాలనే కొత్త ఆలోచన వచ్చింది. ఇప్పుడు కూరగాయలను కట్ చేసి కస్టమర్లకు అందించే ప్రముఖ స్టార్టప్‌గా ఎదిగింది.
కూరగాయలు కోయడం కష్టమని వినియోగదారుల నుంచి స్పందన వచ్చింది. ఇదే తన ఐడియాగా మార్చుకున్నాడు దిగ్విజయ్. కరోనా సమయంలో కోవిడ్ గైడ్ లైన్స్ ప్రకారం శుభ్రమైన కూరగాయలను సరఫరా చేసేవారు. ఇప్పుడు అతని వ్యాపారం బాగానే సాగుతున్నట్లు తెలుస్తోంది. వెబ్‌సైట్, యాప్ ద్వారానే కాకుండా వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పించారు.
అందరూ చూసిన వాటిని చూడండి.. కానీ ఎవరూ ఆలోచించని విధంగా ఆలోచించండి.. విభిన్న ఆలోచనలే విజయానికి మెట్లు.. ఇదే దిగ్విజయ్ పాండే జీవితం నేర్పిస్తున్న పాఠం.
అందరు చూసేది చూడు.. కానీ భిన్నంగా ఆలోచించు..