Monday Motivation : పరీక్షలు మాత్రమే మీ జీవితాన్ని నిర్ణయించవు.. గుర్తుంచుకోండి-monday motivation exams never decides your success fight with life ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Motivation : పరీక్షలు మాత్రమే మీ జీవితాన్ని నిర్ణయించవు.. గుర్తుంచుకోండి

Monday Motivation : పరీక్షలు మాత్రమే మీ జీవితాన్ని నిర్ణయించవు.. గుర్తుంచుకోండి

Anand Sai HT Telugu
Mar 18, 2024 05:00 AM IST

Monday Motivation : ఇది పరీక్షల కాలం. ఏ విద్యార్థి చూసినా టెన్షన్‌తో ఉంటారు. అయితే పరీక్షలు మాత్రమే మీ జీవితాన్ని నిర్ణయించలేవు. చాలా జీవితం మీ ముందు ఉంటుంది.

పరీక్షలపై మోటివేషన్
పరీక్షలపై మోటివేషన్ (Unsplash)

ఇటీవలి కాలంలో పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకునే పద్ధతి పెరిగిపోయింది. కానీ ఇప్పటి వరకు సక్సెస్ అయినవారిలో ఎక్కువ మంది పరీక్షల్లో ఫెయిల్ అయినవారే. ఒక్కసారి ఫెయిల్ అయితే మీ జీవితం ఏం నాశనం అయిపోదు. మళ్లీ రాయెుచ్చు. ఈజీగా పాస్ అయితే దాని విలువ మీకు తెలియదు. ఫెయిల్ అయితేనే మీ ఆలోచన విధానం మారుతుంది. జీవితంలో ఏం చేయాలనే నిర్ణయాలు తీసుకుంటారు. ఫెయిల్ అయినంత మాత్రన మీ జీవితం అక్కడే ఆగిపోదు.

పరీక్షల్లో ఫెయిల్ అయి.. జీవితంలో సక్సెస్ అయిన గొప్పవాళ్లు చాలా మంది ఉన్నారు. పరీక్షలు మీ జీవితానికి కొలమానం కాదు. అవి కేవలం మీ శక్తిని చూపించుకోడానికే. ఈసారి పరీక్షల్లో తప్పితే నెక్ట్స్ రాసుకోవచ్చు. అదే ఆవేశపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే జీవితం మళ్లీ తిరిగి రాదు. మిమ్మల్ని కన్నవాళ్ల కడుపుకోతను ఎవరూ తీర్చలేరు. అందుకే తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు.

జీవితంలో ఒత్తిడిని జయిస్తే విజేతలు మీరే అవుతారు. మీ చుట్టు ఉన్నవాళ్లతో పోటీ పడాలి. కానీ ఆ పోటీ మాత్రమే మీ జీవితాన్ని నిర్ణయించదు. సరైన సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలే మీ గొప్ప భవిష్యత్‌కు దారి చూపిస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలే మీకు అసలైన పరీక్ష. చదువుకునే సమయంలో వచ్చే పరీక్షలు కాదు.. జీవితంలో అంతకంటే పెద్ద పరీక్షలు ఎదుర్కోవలసి ఉంటుంది. అప్పుడు మీ జీవితం సరైన దిశలో వెళ్తుందో లేదో మీకు అర్థమవుతుంది.

పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రం మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు. ఇప్పుడున్న గొప్పవాళ్లలో చాలా మంది వారు చదువుకునే సమయంలో పరీక్షల్లో ఫెయిల్ అయినవారే. గెలిస్తే చప్పట్లు మాత్రమే వినిపిస్తాయి.. అదే ఓడిపోతే అనుభవాలు కనిపిస్తాయి. అందుకే ఫెయిల్ అయితే ఆనందపడండి.. ఏదో కోల్పోయామనుకుని అస్సలు బాధపడకండి. ఇవాళ కాకుంటే.. రేపైనా ఆ పరీక్షల్లో మీరు పాస్ అవుతారు. కానీ మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మీ చుట్టు పక్కన ఉన్నవారి మీద ప్రభావం పడుతుంది.

జీవితంలో చదువు అనేది కచ్చితంగా ఉండాలి. అయితే చదువుకునే సమయంలో పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం అనేది సాధారణం అని తెలిసి ఉండాలి. జీవితాన్ని నిర్ణయించేవి పరీక్షలు కాదు.. మీ గెలుపును నిర్ణయించేవి మీ ఆలోచనలే. మీరు జీవితంలో ఎదగాలంటే మీరు తీసుకునే నిర్ణయాలు గొప్పగా ఉండాలి. మీరే పదిమందికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉంటారు. చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్య ప్రయత్నాలు చేయకూడదు. మార్చిలో పరీక్ష తప్పితే.. సప్లీలు రాసుకోవచ్చు.. అదే ఒక్కసారి ఊపిరి తప్పిపోతే.. ఏ దేవుడు కూడా తిరిగి ఇవ్వలేడు.

పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో.. ప్రేమ విఫలం అయిందనో.. ఆత్మహత్య జోలికెళ్లొద్దు..

పరీక్షలు మళ్లీ వస్తాయి.. ప్రేమ మళ్లీ పుడుతుంది..

కానీ నీలాంటి వ్యక్తిని నీ తల్లిదండ్రులకు ఎవరూ తెచ్చి ఇవ్వలేరు..

మీ జీవితాన్ని నిర్ణయించేవి పరీక్షలు కాదు..

మీ విజయానికి పరీక్షలు కొలమానం కాదు..

మీ ఆలోచనలు మాత్రమే మీరేంటో నిర్ణయిస్తాయి..

ఓడిపోవడం అంటే గెలుపునకు దగ్గరగా వెళ్లి రావడమే..

మళ్లీ ప్రయత్నించు..

Whats_app_banner