లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరి శరీరంలో పుట్టుమచ్చలు కనిపిస్తాయి. పుట్టుమచ్చలు సాధారణంగా శరీరంలో ఒక భాగం. ఒక వ్యక్తి తన జీవితకాలంలో 10 నుంచి 40 పుట్టుమచ్చలను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది కాలానుగుణంగా మారవచ్చు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో స్త్రీలలో పుట్టుమచ్చల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీని వెనుక హార్మోన్ల మార్పులు కూడా ఒక కారణం.
పుట్టు మచ్చలు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే స్థితికి చేరుకుంటాయి. ఇది ఆరోగ్యానికి ఎలా సవాళ్లను కలిగిస్తుందో చాలా మందికి తెలియదు. పుట్టుమచ్చ పెరిగితే కొందరు సాధారణంగా తీసుకుంటారు. కానీ అది మన ఆరోగ్యాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో గుర్తించలేం. పుట్టుమచ్చలు నలుపు లేదా గోధుమ రంగులో ఉంటాయి. చిన్ననాటి నుండి 25 సంవత్సరాల వయస్సు వరకు స్త్రీ పురుషులు ఇద్దరిలో పుట్టుమచ్చలు సంభవించవచ్చు. అయితే పుట్టు మచ్చలు పెరుగుతూ ఉంటే మాత్రం ఈజీగా తీసుకోవద్దు.
పుట్టుమచ్చలు చిన్న వయసులో మెుదలవుతాయి. పుట్టుమచ్చల సంఖ్య వాటి పెరుగుదలను బట్టి మారుతుంది. సాధారణ చిన్నవిగా, వృత్తాకారంలో ఉంటాయి. కానీ కొన్ని పుట్టుమచ్చలు నిర్దిష్ట ఆకృతిని కలిగి ఉండవు, ఆకారం, రంగులో మార్పు ఉంటే.. ఈ విషయాలను సీరియస్‌గా తీసుకోవాలి.
చర్మంపై పుట్టుమచ్చల రంగు, ఆకృతిలో ఉన్న మార్పుపై చాలా శ్రద్ధ వహించాలి. ఆకారంలో క్రమరహితంగా మార్పు ఉంటే ఆలోచించాలి. 6 మిమీ ఎక్కువగా ఉండి.. రంగులో మార్పులు ఉంటే మంచిది కాదు. ప్రతిరోజూ పరిమాణంలో పెరుగుతూ, పుట్టు మచ్చ విడిపోవడం ప్రమాదాలకు కారణమవుతుంది. అటువంటి పుట్టుమచ్చలు ఉంటే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించవచ్చు.
అలా ఉంటే డెర్మటాలజిస్ట్‌ని రెగ్యులర్ చెక్-అప్‌లను చేయించాలి. ముఖ్యంగా మహిళల్లో స్కిన్ క్యాన్సర్ సర్వసాధారణం. చర్మంలో వచ్చే మార్పులను ముందుగా గుర్తించడం వల్ల వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది. చర్మ మార్పులు త్వరగా నయం కావాలంటే వెంటనే వైద్యులను సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో చర్మ సంరక్షణ చాలా అవసరం. సూర్యకాంతి ఎక్కువగా ఉండే సమయాల్లో కూడా బయటకు వెళ్లకుండా ఉండండి. మీ చర్మాన్ని రక్షించే దుస్తులను ధరించండి.
పుట్టుమచ్చల సమస్యతో డాక్టర్‌ని కలవడానికి ఎప్పుడూ వెనుకాడకండి. ఎందుకంటే ఇది ప్రారంభ దశలో చికిత్స చేయకపోతే తీవ్రమైన మార్పులు, చర్మ క్యాన్సర్ వంటి పరిస్థితులు ఉంటాయి. క్రమం తప్పకుండా స్కిన్ చెకప్ చేయించండి. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. వివిధ రకాల పుట్టుమచ్చలు, వాటి పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా అవసరం.