Meaning of Moles: మీ ముఖంలో వివిధ చోట్ల ఉండే పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వాన్ని చెబుతాయి-moles at different places on your face tell about your personality ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Meaning Of Moles: మీ ముఖంలో వివిధ చోట్ల ఉండే పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వాన్ని చెబుతాయి

Meaning of Moles: మీ ముఖంలో వివిధ చోట్ల ఉండే పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వాన్ని చెబుతాయి

Haritha Chappa HT Telugu

Meaning of Moles: పుట్టుమచ్చలు వర్ణ ద్రవ్యం ఉత్పత్తి చేసే కణాలు. ఇది చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ప్రతి మనిషికి ఎన్నో కొన్ని పుట్టుమచ్చలు ఉండడం సహజం. ముఖంపై ఉండే పుట్టుమచ్చలకు అర్ధాలేమిటో తెలుసుకోండి.

పుట్టుమచ్చల అర్థాలు

Meaning of Moles: పుట్టుమచ్చ అనేది వర్ణ ద్రవ్యం కణాలు ఒకే చోట పోగు పడటం వల్ల ఏర్పడేవి. ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. రకరకాల ఆకారాలలో, పరిమాణాలలో ఉండవచ్చు. కొందరికి ముఖంపై ఇలాంటి పుట్టుమచ్చలు వస్తాయి. ముఖ భాగాలపై వచ్చే పుట్టుమచ్చలు వ్యక్తిత్వ లక్షణాలను కూడా చెబుతాయి. మీకు ముఖంపై పుట్టుమచ్చ ఉంటే అది ఎలాంటి లక్షణాలను మీ జీవితానికి అందిస్తుందో తెలుసుకోండి.

తల పైన పుట్టుమచ్చ ఉంటే మీకు అది అదృష్టాన్ని తెచ్చిపడుతుంది. మీరు జీవితంలో అన్ని సమయాలలో కూడా సంతోషంగా ఉంటారు. శుభప్రదంగా జీవిస్తారు. బట్టతల వస్తేనే ఈ పుట్టుమచ్చను చూడగలరు. జుట్టు ఉన్నప్పుడు తలపై ఉన్న పుట్టుమచ్చలు సరిగా కనబడవు. చెడు రోజుల్లో కూడా తల పైన ఉండే పుట్టుమచ్చ మిమ్మల్ని దురదృష్టం నుండి కాపాడుతుంది.

నుదుటి మీద ఉండే పుట్టుమచ్చ బలహీనమైన అనుబంధాలను సూచిస్తుంది. అంటే మీ ప్రియమైన వారికి దూరంగా జీవించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆడవారికి మీ ప్రేమ జీవితంలో సంబంధాలకు ఎదురుదెబ్బ తగ్గుతుంది. కానీ సంపద పరంగా మాత్రం కలిసివస్తుంది.

చెంప మీద పుట్టుమచ్చ

చెంప మీద పుట్టుమచ్చ ఉంటే మీరు చాలా పాజిటివ్ గా ఉంటారు. అలాగే పెద్ద లక్ష్యాలను కలిగి ఉంటారు. కానీ ఇతరులతో కలిసి జీవించడానికి ఇష్టపడరు. మీ ప్రేమ జీవితం చాలా అందంగా ఉంటుంది.

గడ్డం మీద పుట్టుమచ్చ

గడ్డం మీద పుట్టుమచ్చ ఉంటే బ్యూటీ స్పాట్ గా పిలుచుకుంటారు. అక్కడ పుట్టు మచ్చ ఉన్న వ్యక్తుల్లో స్థిరత్వం అధికంగా ఉంటుంది. వారు ఆప్యాయంగా ఉంటారు. స్వతహాగానే వారు శ్రద్ధగా ఉంటారు. కొన్ని సమయాల్లో మాత్రం వారు క్రూరంగా ప్రవర్తించే అవకాశం ఉంది.