Mixer grinder vs Blender: మిక్సీ VS బ్లెండర్... ఈ రెండిట్లో ఏది కొనుక్కుంటే బెటర్?
Mixer grinder vs Blender: ప్రతి ఇంట్లోనూ మిక్సీ కచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఈమధ్య బ్లెండర్ అనే పదం కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ఈ రెండింటిలో ఏది ఇంట్లో ఉంటే బెటరో తెలుసుకుందాం.
Mixer grinder vs Blender: ప్రతి కిచెన్లో కచ్చితంగా ఉండాల్సిన ఎలక్ట్రానిక్ వస్తువుగా మారిపోయింది మిక్సీ. ఇది ఉంటే చాలు... పొడి దగ్గర నుంచి పచ్చళ్ళ వరకు అన్నింటిని చేసేసుకోవచ్చు. కొంతమంది ఇడ్లీ పిండి కోసం గ్రైండర్లను కూడా వాడుతున్నారు. అయితే చిన్నగా ఉండే మిక్సీని మాత్రం గ్రైండర్ బీట్ చేయలేకపోయింది. ఈ మధ్యన బ్లెండర్ అనే పదం కూడా ఎక్కువగా వినిపిస్తోంది. చూడడానికి మిక్సీలాగే ఉంటుంది. కాకపోతే కాస్త తక్కువ ప్లేస్‌ను ఆక్రమిస్తుంది. మిక్సీ లేదా బ్లెండర్లో ఏది ఇంట్లో ఉంటే బెటర్ అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు.
మిక్సీ ఎందుకు?
మిక్సీ ప్రధానంగా మసాలా దినుసులు, ధాన్యాలు, కాయ ధాన్యాలు వంటి వాటిని పొడి చేయడానికి ఉపయోగపడుతుంది. దీనిలో చాలా కఠినమైన బ్లేడ్లు ఉంటాయి. కొన్ని నిమిషాల్లోనే దేనినైనా ఇది పొడిలా మార్చేస్తాయి. కాబట్టి మిక్సీ ఇంట్లో ఉంటే చాలు అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు.
బ్లెండర్ ఎందుకు
ఇక బ్లెండర్ విషయానికొస్తే స్మూతీలు, షేక్స్, సూపులు, సాస్‌లు, ప్యూరీలు వంటి తడి పదార్థాలను మెత్తగా చేయడానికి బ్లెండర్ ఉపయోగపడుతుంది. పండ్లు, కూరగాయల జ్యూసులు తీయడానికి ఇది మంచి ఉపకరణం. ఇందులో వాడే బ్లేడ్లు మృదువుగా ఉంటాయి. ఆహారాలను గుజ్జు చేయడంలో ఇది ముందుంటాయి.
మిక్సీ లేదా బ్లెండర్... ఈ రెండింటిలో ప్రధాన తేడా వాటి డిజైన్. ఒకటి పొడి చేయడానికి బాగా పని చేస్తే, ఇక రెండోది ఫ్యూరీలు వంటివి చేయడానికి ఉపయోగపడుతుంది.
తెలుగిళ్లల్లో బ్లెండర్ కంటే మిక్సీ వాడకమే ఎక్కువగా ఉంటుంది. మసాలా పొడి దగ్గర నుంచి టమోటో పచ్చడి వరకు అన్నింటినీ మిక్సీలో చేసేసుకోవచ్చు. బ్లెండర్లో గట్టి పదార్థాలను పొడిగా మార్చలేము. కేవలం మెత్తగా ఉన్న వాటిని మాత్రమే గుజ్జులా చేయడానికి బ్లెండర్ ఉపయోగపడుతుంది. కాబట్టి ప్యూరీలు, స్మూతీలు, మిల్క్ షేక్‌లు చేసుకునేవారు బ్లెండర్ ని కొనుక్కోవడం మంచిది. అదే ఇంట్లో పచ్చళ్ళు, దోసెల పిండి, చట్నీలు చేసుకునేందుకు మిక్సీని వాడడం మంచిది. మోటార్ పవర్ కూడా మిక్సీకి అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన మోటార్లను కలిగి ఉంటాయి. ఎలాంటి పదార్థాలను వేసినా పిండి చేసేస్తాయి. కానీ బ్లెండర్లు సాధారణ మోటార్లతోనే వస్తాయి. పండ్ల జ్యూసులు వంటి వాటికీ బ్లెండర్ ఉత్తమ ఎంపిక.
ఇంట్లో మీ అవసరాన్ని బట్టి ఈ రెండింటిలో ఏది కొనుక్కోవాలో ఎంచుకోవడం మంచిది. మిక్సీలో ఈ స్మూతీలు, పండ్ల రసాలు చేయడానికి కూడా ఒక జార్‌ను ఇస్తున్నారు. అలాంటి మిక్సీని తీసుకుంటే ఇక ప్రత్యేకంగా బ్లెండర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ బ్లెండర్ ఇంట్లో ఉన్నా కూడా మిక్సీని కచ్చితంగా కొనుక్కోవాల్సిందే. కొన్ని రకాల పొడులను బ్లెండర్‌లో చేయలేము.
టాపిక్