Healthy Weight Gain : బరువు పెరగాలంటే నెయ్యిలో ఈ పదార్థాలను కలిపి తినండి.. కొద్ది రోజుల్లోనే రిజల్ట్ కనిపిస్తుంది!
Healthy Weight Gain: బరువు ఎక్కువగా ఉండటం ఎంత పెద్ద సమస్యో.. ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉండటం కూడా అంతే సమస్య. తక్కువ బరువుతో సతమతమయ్యే వాళ్లు వేగంగా బరువు పెరగాలనుకుంటే ఖచ్చితంగా మీ డైట్‌లో నెయ్యి ఉండాల్సిందే.
బరువు తగ్గడం కష్టమని భావించే వాళ్లకు బరువు పెరగడం కూడా అంతే కష్టమని తెలియకపోవచ్చు. చాలా మంది బరువు తగ్గేందుకు నానాతంటాలు పడుతుంటారు. సరైన సమయంలో ఆరోగ్యకరమైన, పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకున్న తర్వాత కూడా శరీరంలో ఎటువంటి మార్పు లేకుండా సన్నగానే ఉంటారు. అటువంటి పరిస్థితిలో, ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి నెయ్యి తినడం మంచిదని నిపుణుల సలహా. వాస్తవానికి, నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి రెండూ బరువు పెరిగేందుకు సహకరించి లాభదాయకంగా ఉంచుతాయి. కానీ నెయ్యి తిన్న తర్వాత కూడా కొంతమందికి బరువులో చెప్పుకోదగ్గ మెరుగుదల కనిపించదు. లేదా చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, బరువు పెరగడానికి నెయ్యిని సరిగ్గా తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి బరువు పెరగడానికి నెయ్యి ఎలా తినాలో తెలుసుకుందాం.
పాలతో పాటుగా నెయ్యి
మీ శరీర బరువును వేగంగా పెంచుకోవాలనుకుంటే, పాలు తాగే సమయంలో అదే గ్లాసులో ఒక చెంచా దేశీ నెయ్యిని కలుపుకుని త్రాగాలి. పాలు, నెయ్యి కాంబినేషన్ ఆరోగ్యకరమైన బరువు పెరగడంతో పాటు ఇతర వాటికి ప్రయోజనకరంగా ఉంటుంది. పాలు, నెయ్యి తాగడం ద్వారా శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. బరువు పెరగడానికి గేదె పాలతో తయారుచేసిన నెయ్యి మంచిదని భావిస్తారు. మీ ఎంపిక కూడా అదే అయితే బరువు పెరగడంలో వేగవంతమైన మార్పులు చూడవచ్చు.
ఆహారంలో కలుపుకోవడం
బరువు పెరగడానికి మీ ఆహారంలో (వేడి అన్నంలో) చెంచా నెయ్యి వేసి పప్పులు లేదా కూరగాయలతో కలిపి తినండి. వాస్తవానికి, అన్నం, నెయ్యి రెండింటినీ కలిపి తినడం ద్వారా శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వు, పిండి పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీరు వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటే, మీరు చాలా త్వరగా ప్రయోజనం పొందుతారు.
బెల్లంతో కలిపి తీసుకోవడం
మీ శరీరం సన్నగా, మరీ బలహీనంగా ఉంటే, దీంతో పాటుగా మీరు మీ ఆహారంలో బెల్లం కూడా చేర్చవచ్చు. శరీరంలో కొవ్వు పెరగడానికి నెయ్యి, బెల్లం మిశ్రమం కూడా మంచి ఆప్షన్. ఇది శరీరంలో కొవ్వును పెంచడమే కాకుండా కండరాల ఎదుగుదలకు సరిపడా కొవ్వును అందజేస్తుంది. ఇందుకోసం దేశీ బెల్లం పొడిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు దానికి సమాన పరిమాణంలో నెయ్యి కలుపుకుని రోజూ క్రమం తప్పకుండా తినండి. ఈ రుచికరమైన మిశ్రమంతో అతికొద్ది రోజుల్లోనే అద్భుతాలను చవిచూడొచ్చు.
నెయ్యి ఎంత మొత్తంలో తీసుకోవాలి
మీకు పప్పులు తినే అలవాటుంటే అందులోనూ, కాల్చిన బ్రెడ్ మీద, కూరల్లోనూ నెయ్యిని కలుపుకుని తినవచ్చు. ఇది ఆహారపు రుచిని పెంచడంతో పాటు మీ ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా మారుతుంది. బరువు పెరగాలంటే రోజూ పరిమిత మొత్తంలో నెయ్యి తినండి. ఒక సాధారణ వ్యక్తి రోజుకు ఒకటి లేదా రెండు టీస్పూన్ల నెయ్యి తింటే సరిపోతుంది. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, నెయ్యి అలవాటు చేసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.
సంబంధిత కథనం