Ghee Water: గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి ఖాళీ పొట్టతో ఒక వారం రోజులు తాగి చూడండి, మీలో కలిగే మార్పులు ఇవే-mix ghee in warm water and drink it on an empty stomach for a week and see the changes that will happen in you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ghee Water: గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి ఖాళీ పొట్టతో ఒక వారం రోజులు తాగి చూడండి, మీలో కలిగే మార్పులు ఇవే

Ghee Water: గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి ఖాళీ పొట్టతో ఒక వారం రోజులు తాగి చూడండి, మీలో కలిగే మార్పులు ఇవే

Haritha Chappa HT Telugu

Ghee Water: ఉదయాన్నే ఖాళీ పొట్టతో తినే ఆహారం ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు గోరువెచ్చని నెయ్యిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తాగడం వల్ల అందం నుంచి ఆరోగ్యం వరకు ఊహించని ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయి.

నెయ్యి కలిపిన నీటితో ఉపయోగాలు (Pixabay)

ఉదయం గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభించాలని ఎంతోమంది ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఇది మీ పొట్టను శుభ్రపరుస్తుందని చెబుతారు. అంతేకాదు రోజంతా మీరు తిన్న ఆహారం ద్వారా పేరుకుపోయిన విషాలను, వ్యర్ధాలను బయటకు పంపించేందుకు సహాయపడుతుందని అంటారు. ఈ గోరువెచ్చని నీరు తాగడం వల్ల మీ జీవక్రియ మెరుగవడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని చెబుతారు. అది చాలా వరకు నిజం. అయితే గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను రెట్టింపు చేయాలంటే ఆ నీటిలో ఒక స్పూను నెయ్యిని కలపండి. ఇలా వారం రోజులు పాటు తాగి చూడండి. మీలో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు.

ఖాళీ పొట్టతో నెయ్యి కలిపిన నీరు తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరగడం మొదలవుతుంది. నిల్వచేసిన కొవ్వును కాల్చడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఇలా గోరువెచ్చని నెయ్యి నీటిని తాగేందుకు ప్రయత్నించండి.

చర్మం మెరుస్తుంది

గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. ఎందుకంటే నెయ్యిలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మానికి పోషణనిస్తుంది. చర్మం మెరవడం మొదలవుతుంది. కాబట్టి అందంగా ఉండేందుకు కూడా ఈ నెయ్యి నీరు ఎంతో ఉపయోగపడతాయి.

గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల మెదడుకు కూడా ఎంతో ఆరోగ్యం. ఇది మీ జ్ఞాపకశక్తికి పదును పెడుతుంది. బ్రెయిన్ కు అద్భుతమైన టానిక్ లాగా ఉపయోగపడుతుంది. జ్ఞాపకశక్తికి పెంచుతుంది. కాబట్టి పిల్లలకు దీని తాగించడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

గుండె ఆరోగ్యానికి

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా నెయ్యి కలిపిన నీరు ఎంతో సహాయపడతాయి. నెయ్యిలో ఉండే కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండె సమస్యలు ఉన్నవారు ఒక వారం రోజులు పాటు ఇలా గోరువెచ్చని నీటిలో ఒక స్పూను నెయ్యి కలుపుకుని తాగేందుకు ప్రయత్నించండి. మీకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే జుట్టు సమస్యలు ఉన్నవారు కూడా దీని తాగడం వల్ల జుట్టులో పెరుగుదలను మీరు చూస్తారు. జుట్టు కూడా బలంగా ఆరోగ్యంగా మారుతుంది.

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా నెయ్యి కలిపిన నీరు ఎంతో సహాయపడుతుంది. ఇది మీ కంటి చూపును బలంగా మారుస్తుంది. కండరాలు ఎముకలు బలంగా మారుతాయి. మీరు కొంతమంది కాంతిని చూసేందుకు ఇబ్బంది పెడతారు. అలాంటివారు ఇలా గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఎంతో ఆరోగ్యం.

గోరువెచ్చని నీటిలో మరిగించిన నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. నెయ్యి గడ్డకట్టే ఉన్న స్థితిలో వేయకూడదు. నెయ్యిని నూనెలాగా జారుతున్నట్టు ఉంటేనే వేయాలి. అప్పుడు దాన్ని తాగాలి. ఇక ఆ రోజుల్లో నెయ్యి తినాల్సిన అవసరం లేదు. ఒక స్పూను నెయ్యి తాగడం తినడం వల్ల మీరు బరువు కూడా పెరగరు. ఆ భయాన్ని కూడా తీసివేయండి. ఒక నెయ్యి ఒక స్పూన్ నెయ్యి మీకు అన్ని విధాల ఆరోగ్యాన్ని అందిస్తుంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం