Khus Khus Benefits: గ్లాసుడు పాలలో చిటికెడు గసగసాలు కలిపి ప్రతిరోజూ తాగండి, మార్పును మీరే గమనించండి
Khus Khus Benefist: ప్రతిరోజూ పాలు తాగడం అనేది ఆరోగ్యానికి మేలు చేసే ప్రక్రియ. అయితే కేవలం పాలు మాత్రమే కాకుండా చిటికెడు గసగసాలు వేసి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
Khus Khus Benefist: అధిక బరువు ఎంతో మందిని ఆందోళనకు గురిచేస్తుంది. పిల్లలు కూడా బరువు పెరిగిపోవడం అనేది ఆధునిక కాలంలో ఎక్కువైపోయింది. మరి కొంతమంది ఎంతగా బరువు పెరుగుదామని ప్రయత్నిస్తున్నా కూడా తక్కువ బరువుతోనే ఉంటారు. పిల్లలు కూడా సన్నగా ఉంటారు. అది కూడా మంచి పద్ధతి కాదు. ఎవరైతే బరువు పెరగాలనుకుంటున్నారో వారు ప్రతి రోజూ గ్లాసుడు పాలలో చిటికెడు గసగసాల పొడి వేసుకొని తాగితే మంచిది. ప్రతిరోజూ ఇలా తాగడం వల్ల బరువు ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గసగసాలలో కేలరీలు చాలా ఎక్కువ. కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ రెండూ కలిసి బరువు పెరగడానికి సహాయపడతాయి.
బరువు పెరగడం కోసం కాకపోయినా, సాధారణంగా ప్రతిరోజూ పాలల్లో చిటికెడు గసగసాల పొడి వేసి తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యలు వంటివి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలు రావు. గసగసాలలో ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ వంటి జీర్ణ సంబంధిత సమస్యల నుండి బయట పడేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. వీటినీ ప్రతిరోజు తినడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది.
గసగసాల్లోని పోషకాలు
గసగసాలు పోషకాలతో నిండి ఉంటాయి. వీటిని అతిగా మాత్రం తినకూడదు. అతిగా తింటే అలర్జీలు, మలబద్ధకం, వికారం వంటి సమస్యలు రావచ్చు. బరువు పెరిగేందుకు ప్రయత్నించేవారు గసగసాలను నీటిలో అయిదారు గంటల పాటు నానబెట్టాలి. నానబెట్టిన ఆ గసగసాలను మెత్తగా రుబ్బుకోవాలి. వేడివేడి పాలల్లోని ఈ గసగసాల పేస్టుని వేయాలి. తర్వాత రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా నాలుగు వారాలు చేస్తే చాలు సన్నగా ఉన్నవారు సరైన బరువుకు చేరుకుంటారు. రోజూ పేస్టు చేసుకోవడం కష్టం అనుకునే వాళ్ళు గసగసాలను పొడిలా చేసుకుని దాచిపెట్టుకోవాలి. ఆ పొడిని వేడి పాలలో వేసి తాగితే మంచిది. ఇది నిద్ర కూడా బాగా పట్టేలా చేస్తుంది.