లంగా వోణీల్లో చేతినిండా గాజులతో సందడి చేసిన మిస్ వరల్డ్ అందగత్తెలు, చూసేందుకు రెండు కళ్లూ చాలవు-miss world beauties who made a splash with their bangles in their skirts ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  లంగా వోణీల్లో చేతినిండా గాజులతో సందడి చేసిన మిస్ వరల్డ్ అందగత్తెలు, చూసేందుకు రెండు కళ్లూ చాలవు

లంగా వోణీల్లో చేతినిండా గాజులతో సందడి చేసిన మిస్ వరల్డ్ అందగత్తెలు, చూసేందుకు రెండు కళ్లూ చాలవు

Haritha Chappa HT Telugu

మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తెలంగాణలోని ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శిస్తూ సందడి చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించిన దుస్తులను ధరించి అందరినీ ఆకట్టుకుంటున్నారు. వారు సంప్రదాయ లంగా వోణీల్లో ఎంతో అందంగా కనిపించారు

లంగా వోణీల్లో మిస్ వరల్డ్ అందగత్తెలు (Instagram/@missworld)

72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణాలో హైదరాబాద్ లో మే 31న జరగనున్నాయి. మిస్ వరల్డ్ 2025 ఫినాలే హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరగనుంది. ఈ ఏడాది మిస్ వరల్డ్ కు తెలంగాణ రాష్ట్రమే ఆతిథ్యం ఇస్తోంది. ఈ కార్యక్రమం సాంస్కృతిక పర్యటనలో భాగంగా అందాల పోటీదారులు తెలంగాణలోని ఓ ఆలయాన్ని సందర్శించి రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ఆస్వాదించారు.

మిస్ వరల్డ్ పోటీదారులు సాంప్రదాయ లంగా వోణీలు ధరించి హైదరాబాద్ కు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయ దేవుడు లక్ష్మీ నరసింహ స్వామి. ఈ ఆలయానికి వెళ్లేందుకు అందాల రాణులు నారాయణపేట చేనేత, గద్వాల లెహంగాలు ధరించారు.

ఈ సాంప్రదాయ దుస్తులు తెలంగాణ వస్త్ర వారసత్వానికి చిహ్నం. చేతికి గాజులు, మంగ్ టికా, బొట్టు, నెక్లెస్ లతో వీరిని అలంకరించారు. తల నుండి కాలి వరకు పూర్తి, సాంప్రదాయ భారతీయ రూపాన్ని వారికి ఇచ్చారు. వారిని చూస్తే కనుల పండువలా ఉంది.

ఆలయంలో ఈ అందగత్తెలకు సంపూర్ణ సాంస్కృతిక అనుభవాన్ని అందించారు. అక్కడకు చేరుకోగానే సంప్రదాయ దీపారాధన కార్యక్రమంలో, దీపం వెలిగించే శుభకార్యంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ పుణ్యక్షేత్రాలను సందర్శించారు. లైవ్ భరతనాట్య ప్రదర్శనను వీక్షించడంతో పాటు దర్శనం, పూజా కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఇది పూర్తి సాంస్కృతిక కార్యక్రమంగా జరిగింది. ప్రతి కంటెస్టెంట్ కు నరసింహ స్వామి విగ్రహాన్ని బహూకరించారు.

మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్, సీఈఓ జూలియా మోర్లే మాట్లాడుతూ యాదాద్రి పర్యటన తమ పోటీదారులకు భారత ఆధ్యాత్మిక వారసత్వాన్ని తెలియజేసిందన్నారు. స్థానిక సంప్రదాయాలతో మమేకమవడం వారి సాంస్కృతిక అవగాహనను విస్తృతం చేస్తుంది.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సందర్శన సాంస్కృతిక వైవిధ్యాన్ని, ప్రశంసలను పురస్కరించుకుని మిస్ వరల్డ్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.