Mind Reading Tips : ఎదుటివారు మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు టిప్స్
Mind Reading Tips In Telugu : ఎదుటివారు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అయితే వారి ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తేనే మైండ్ రీడింగ్ అనేది సాధ్యమవుతుంది.
ఇతరుల మనస్సులను చదవాలని అందరూ అనుకుంటారు. ఎదుటివ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడబ్బా అంటూ మనం ఆలోచనల్లో పడతాం. కానీ మనిషి మనసులోని రహస్యాలను బయటకు తీసుకురావడం అంత సులభం కాదు. ఇది సులభంగా లభించే నైపుణ్యం కాదు. మంత్రం లేదా మాయ ద్వారా కూడా మనసును చదవలేరు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా మనిషి మనసులోకి చొచ్చుకుపోయే సాంకేతికత లేదు. బహుశా రాదు కూడా.
మనస్తత్వవేత్తలు కూడా రోగుల మనస్సులో ఏముందో తెలుసుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తారు. కానీ మన చుట్టూ ఉన్నవారి ఆలోచనలు, భావాలను వెలుగులోకి తెచ్చే మార్గాలు కూడా ఉన్నాయి. మనస్తత్వశాస్త్రంలో పేర్కొన్న పద్ధతులు ఏంటో చూద్దాం.
శరీర కదలికలు
మీరు అర్థం చేసుకోవాలనుకునే వ్యక్తి భయం, శరీర కదలికలపై ఫోకస్ చేయండి. ఇది వారి మానసిక స్థితి గురించి చాలా క్లూలను ఇస్తుంది. విసుగు, ఆసక్తి లేకపోవడం సాధారణంగా ఒక వ్యక్తి ఆందోళన వెనక ఉంటుంది. ఒత్తిడి లేదా ఆందోళన, కొన్నిసార్లు అలాంటి ప్రవర్తనల ద్వారా సూచించవచ్చు. దీని నుండి వారి అంతర్గత భావాలను చదవవచ్చు.
తల ఊపడం
సంభాషణ సమయంలో అవతలి వ్యక్తి ఎంత తరచుగా తల ఊపుతున్నాడో చెక్ చేయండి. వారు విపరీతంగా తల ఊపితే.. అంతర్గత ఆందోళన, అభద్రతను దాచడానికి ప్రయత్నిస్తున్నారు. ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడోనని తలలు ఊపుతూ ఉండవచ్చు. కానీ అప్పుడప్పుడూ తల ఊపితే మాత్రం శ్రద్ధగా కూర్చొని చెప్పినదానికి అంగీకరిస్తున్నట్లు అనుకోవచ్చు. కానీ ఎక్కువ తల ఊపడం మాత్రం కావాలనే చేస్తున్నాడని అర్థం. మనసు ఎక్కడో ఉంటుంది.
పాదలు కదపడం
మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి పాదాలు కూడా వారి మనస్సులో ఏముందో తెలియజేస్తాయి. అదేవిధంగా మీరు ఏదైనా విషయం ఎదుటివారికి చెబుతుంటే వారి పాదాలు చూడండి. పాదాలు మాట్లాడేవారి వైపు నిటారుగా ఉంటే వారు శ్రద్ధగా, ఆసక్తితో వింటున్నారని సూచిస్తుంది. అయితే పాదం మరేదైనా దిశలో ఉంటే ఆ విషయంలో ఆసక్తి లేదని అర్థం.
కను రెప్పలు వేయడం
కను రెప్పలు వేసే వేగం ఇతరుల భావోద్వేగ స్థితికి సూచన. ఒక వ్యక్తి సాధారణంగా నిమిషానికి ఆరు నుండి ఎనిమిది సార్లు రెప్ప వేస్తాడు. కానీ అంతకంటే ఎక్కువగా కన్ను రెప్ప వేస్తే, అది ఆందోళన, లేదా భయాన్ని సూచిస్తుంది. ఇది వారి అంతర్గత ఆలోచనలు, ఉద్దేశాలు వేరేలా ఉన్నాయని సూచిస్తుంది.
స్వరం మార్చడం
స్వరం మార్చడం ద్వారా ఒక వ్యక్తి మనస్సును కూడా అర్థం చేసుకోవచ్చు. వ్యక్తులు వారి మనోభావాలు, భావోద్వేగాలను బట్టి స్వరాలను మారుస్తారు. ధ్వని ఆకస్మికంగా.. లోపల నుంచి వాయిస్ బయటకు రాకుండా ఉంటే అది భయం, ఉత్సాహంగా, చలాకీగా మాట్లాడితే అది మోసాన్ని సూచిస్తుంది.
కంటి చూపు
కళ్లు కథ చెబుతాయన్నది చాలా నిజం. కళ్ళు మనలో ఉన్నదాని గురించి చాలా ఆధారాలు ఇవ్వగలవు. ఒకరి కంటి చూపులో మార్పులను గుర్తించండి. కళ్ళు విశ్వాసం, చిత్తశుద్ధి గురించి స్పష్టమైన సంకేతాలను ఇస్తాయి. ఎవరైనా మాట్లాడుతుంటే నేరుగా వారి కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తే.. విశ్వాసం, నిజాయితీకి సంకేతం. కానీ ఎదుటివారు మాట్లాడుతుంటే.. అటు ఇటు చూస్తే మాత్రం భయానికి, అబద్ధానికి సంకేతం.
ఒకరి మనస్సును చదవడం అనేది రహస్య కోడ్‌ను అర్థంచేసుకోవడానికి ప్రయత్నించడం లాంటిది. కొన్ని మానసిక మార్గాల ద్వారా మరొక వ్యక్తి ఆలోచనలు, భావాలు, భావోద్వేగాల గురించి కనుగొనడం సాధ్యమవుతుంది. అయితే పూర్తిగా మనసులో ఏం అనుకుంటాడో మాత్రం చెప్పడం కష్టం.
టాపిక్