Millionaires Secret : ధనవంతులుగా నటించే బదులు.. ఈ విషయాలపై ఫోకస్ చేస్తే మీరూ అవుతారు రిచ్ కిడ్-millionaires secret these bad habits stops you from becoming rich how to become rich in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Millionaires Secret : ధనవంతులుగా నటించే బదులు.. ఈ విషయాలపై ఫోకస్ చేస్తే మీరూ అవుతారు రిచ్ కిడ్

Millionaires Secret : ధనవంతులుగా నటించే బదులు.. ఈ విషయాలపై ఫోకస్ చేస్తే మీరూ అవుతారు రిచ్ కిడ్

Anand Sai HT Telugu
Jun 22, 2024 08:18 AM IST

Millionaires Secret In Telugu : చాలా మంది మిలియనీర్ కావాలని కలలు కంటారు. కానీ కొంతమంది మాత్రమే డబ్బు సంపాదిస్తారు. ఎందుకంటే సంపాదించే సమయంలో చేసే నీ తప్పొప్పులే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. తమకు తెలియకుండానే చాలామంది తరచుగా చేసే కొన్ని తప్పులు ఉంటాయి.

ధనవంతులు అవ్వడానికి చిట్కాలు
ధనవంతులు అవ్వడానికి చిట్కాలు (Unsplash)

డబ్బులు ఎక్కువగా సంపాదించాలని అందరూ అనుకుంటారు. కానీ సంపాదన సమయంలో మనం చేసే చిన్న చిన్న తప్పులే మనల్ని ఇబ్బందిలోకి నెట్టేస్తాయి. తర్వాత ఈ అలవాట్లు వారిని అనేక సమస్యలలోకి తీసుకెళ్తాయి. డబ్బు విషయంలో అదే జరుగుతుంది. ధనవంతులుగా మారకుండా అలవాట్లు కొన్ని దాదాపు అందరికీ ఉంటాయి. మీరు ధనవంతులుగా మారకుండా నిరోధించే కొన్ని అలవాట్లు ఇక్కడ ఉన్నాయి.

డబ్బులు దాచొద్దు

చాలా మంది తమ పొదుపులను నగదు రూపంలో ఉంచుకుంటారు. అందుకే నోట్ల రద్దు సమయంలో చాలా మంది భయాందోళనలకు గురయ్యారు. అందరూ తమ ఇళ్ళను చాలా డబ్బుతో ఉండి.. వాటిని ఎలా మార్చాలో తెలియక బ్యాంకుల ముందు క్యూలో ఉన్నారు. మీ పొదుపును ఇంట్లో అల్మారా లేదా పెట్టెలో నగదుగా ఉంచడం తెలివైన పని కాదు. దాని వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాలక్రమేణా రూపాయి విలువ పడిపోతుందని చాలా మంది పట్టించుకోరు. మంచి పెట్టుబడులలో పెట్టకపోతే మీ పెట్టుబడి కాలక్రమేణా విలువ పెరుగుతుంది.

ఆర్థిక ప్రణాళిక

దాదాపు అందరూ ఆర్థిక ప్రణాళికలు వేయరు. ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోరు. భవిష్యత్తులో వచ్చే ఆదాయ, వ్యయాల అంచనా ఉండదు. మీకు లేదా కుటుంబ సభ్యులకు అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఏమి జరుగుతుందో ఊహించండి. ఆర్థిక ప్రణాళిక లేకపోవడం, ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోకపోవడం వల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు.

పెట్టుబడి త్వరగా పెట్టాలి

సామాన్యులు చాలా ఆలస్యంగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తారు. యువత తమ సంపాదన అంతా వినోదానికే వెచ్చిస్తున్నారు. ఇక్కడే చాలా మంది చేసే తప్పు ఇదే. ఉదాహరణకు ఒక యువకుడు 25 సంవత్సరాల వయస్సులో మ్యూచువల్ ఫండ్‌లో ప్రతి నెలా రూ. 100 పెట్టుబడి పెడితే, అతను పదవీ విరమణ చేసినప్పుడు కోటి రూపాయల ఫండ్ ఉంటుంది. కానీ మీరు పెట్టుబడిని ఆలస్యం చేస్తే మీకు డబ్బు ఎప్పటికీ ఉండదు. జీవితాంతం డబ్బు కోసం శ్రమించాల్సి ఉంటుంది.

బీమా కూడా అవసరమే

చాలా మంది బీమా అంటే డబ్బు వృథా అని అనుకుంటారు. కానీ వాస్తవంలో అలా కాదు. జీవిత బీమా, ఆరోగ్య బీమాలో పెట్టుబడి పెట్టడం వలన మీకు ఆర్థిక భద్రత మాత్రమే కాకుండా మనశ్శాంతి కూడా లభిస్తుంది. మీ కుటుంబం మీ ఆదాయంతో నడుస్తుంటే, మీరు కచ్చితంగా బీమా తీసుకోవాలి. ఎందుకంటే మీరు ప్రమాదవశాత్తూ మరణిస్తే మీ కుటుంబం హాయిగా జీవించేందుకు బీమా ద్వారా మంచి మొత్తం వస్తుంది.

ఒకే ఆస్తిలో పెట్టుబడి

పెట్టుబడి విషయంలో చాలా మంది తప్పు చేస్తుంటారు. మీ డబ్బును ఒకే ఆస్తిలో పెట్టుబడి పెట్టడం సరికాదు. మీ మొత్తం నిధులతో ఆస్తి లేదా బంగారం కొనడం అవివేకం. ఇది పెద్ద తప్పు. ఇది మీ డబ్బు పెరగకుండా నిరోధిస్తుంది. ప్రపంచంలో మాంద్యం ఉన్నప్పుడు మీ డబ్బు ఒకే చోట నిలిచిపోతుంది. మీ డబ్బు మొత్తాన్ని ఒకే చోట పెట్టుబడి పెట్టకండి.

ముందే ప్లాన్స్ వద్దు

చాలా మంది డబ్బు తమ చేతికి రాకముందే ఎక్కడ ఖర్చు పెట్టాలో ప్లాన్ చేసుకుంటారు. ఈ అలవాటు మూర్ఖత్వం. డబ్బును వృథా చేసే ఈ అలవాటును మార్చుకోవడం అంత సులభం కాదని గుర్తుంచుకోండి. భవిష్యత్తులో పొదుపు చేయడంలో మీరు చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు ధనవంతులు కావాలనుకుంటే, మీ జీతం ఆదా చేయడం నేర్చుకోండి. పొదుపు విషయానికి వస్తే, 50-30-20 నియమాన్ని అనుసరించండి. ఏ సందర్భంలోనైనా మీ జీతంలో కనీసం 20 శాతం ఆదా చేసుకోండి.

ధనవంతులుగా నటించే అలవాటు యువ తరంలో చాలా సాధారణం. ఇతరుల ముందు ధనవంతులుగా నటించడానికి, నిజంగా మీ దగ్గర ధనం ఉండటానికి చాలా తేడా ఉంది. ధనవంతులమని చూపించుకోవడానికి ఖరీదైన మద్యం తాగడం, అన్ని బ్రాండెడ్ మెటీరియల్స్ ఉపయోగించడం చేస్తారు. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో తినడం, షాపింగ్‌కు చాలా డబ్బు అనవసరంగా ఖర్చు చేస్తారు. ఈ విధంగా ధనవంతులుగా నటించే అలవాటు చాలా మందికి ఆర్థిక ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇది చివరికి మిమ్మల్ని అప్పుల్లో పడేస్తుంది.

WhatsApp channel