Milk Mysore pak: మిల్క్ మైసూర్ పాక్‌ను స్వీట్ షాపుల్లో చేసినట్టు ఇంట్లో చేయవచ్చు, రెసిపీ ఇదిగో
Milk Mysore pak: మిల్క్ మైసూర్ పాక్ చూస్తేనే నోరూరిపోతుంది. దీన్ని స్వీట్ షాపుల్లో చేసినట్టు ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు. రెసిపీ ఇక్కడ ఇచ్చాము.. ఫాలో అయిపోండి.

మిల్క్ మైసూర్ పాక్ ప్రతి స్వీట్ షాపుల్లో దొరుకుతుంది. ఎంతోమంది ఫేవరెట్ స్వీట్ కూడా ఇదే. నోట్లో పెడితే చాలు కరిగిపోయేలా ఉండే ఈ స్వీటు ఆల్ టైం ఫేవరెట్. దీన్నీ కేవలం కొనుక్కొని తినక్కర్లేదు ఇంట్లో కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇక్కడ మేము మిల్క్ పౌడర్‌తో మిల్క్ మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో చెప్పాము. దీన్ని చేసే పద్ధతి చాలా సులువు. ఇక్కడ మేము చెప్పినట్టు రెసిపీని ఫాలో అయితే చాలు. సులువుగా చేసేయవచ్చు. ఇంట్లో వేడుకల సమయంలో మిల్క్ మైసూర్ పాక్ చేసేందుకు ప్రయత్నించండి.
మిల్క్ మైసూర్ పాక్ రెసిపీకి కావలసిన పదార్థాలు
మిల్క్ పౌడర్ - ఒక కప్పు
మైదా - రెండు స్పూన్లు
పంచదార - మూడు కప్పులు
నీళ్లు - ఒక కప్పు
నిమ్మరసం - పావు స్పూను
నెయ్యి - ఒక కప్పు
మిల్క్ మైసూర్ పాక్ రెసిపీ
1. మీకు మైసూర్ పాక్ చేసేందుకు ఒక గిన్నెలో మిల్క్ పౌడర్‌ను వేయాలి.
2. ఆ మిల్క్ పౌడర్‌లోనే రెండు స్పూన్ల మైదా, రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసి బాగా చేతితోనే కలిపి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి మూడు కప్పుల పంచదార, ఒక కప్పు నీరు వేసి బాగా కలుపుకోవాలి.
4. ఇది బాగా బుడగలు వచ్చేంతవరకు మరిగించాలి. మధ్యలో నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.
5. ఇప్పుడు మంటను చాలా వరకు తగ్గించి ముందుగా కలిపి పెట్టుకున్న పాలపొడిని మెల్లగా వేస్తూ ఉండలు కట్టకుండా గరిటతో కలుపుతూ ఉండాలి.
6. ఈ మిశ్రమం ఉండలు లేకుండా బాగా కలిసిపోయాక ఇప్పుడు కప్పు నెయ్యిని తీసుకొని గరిటతో వేస్తూ బాగా కలుపుతూ ఉండాలి.
7. అలా కప్పు నెయ్యిని ఐదు నుంచి ఆరుసార్లు గరిటతో వేసి బాగా కలుపుకోవాలి.
8. గాలి బుడగలు రావడం మొదలవుతాయి. అలా బాగా కలిపిన తర్వాత అది దగ్గరగా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి.
9. ఇప్పుడు ఒక గాజు కంటైనర్ను తీసుకొని కింద నెయ్యి రాయాలి.
10. ఆ కంటైనర్లో ఈ మిల్క్ మైసూర్ పాక్ మిశ్రమాన్ని వేసి చల్లార్చాలి.
11. నాలుగైదు గంటల పాటు అలా వదిలేయాలి. తర్వాత అది గట్టిపడుతుంది.
12. ఇప్పుడు దాన్ని మెల్లగా బయటకు తీసి ముక్కలుగా కోసుకుంటే మిల్క్ మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది.
13. ఇది నోరూరించేలా ఉంటుంది. ఒక్కసారి మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. అద్భుతంగా ఉండే స్వీట్ ఇది.
చాలా తక్కువ ఖర్చుతోనే మిల్క్ మైసూర్ పాక్ ను తయారు చేసుకోవచ్చు. అదే బయట మార్కెట్లో దీని ధర అధికంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో మిల్క్ మైసూర్ పాక్ చేసి చూడండి మీకు కచ్చితంగా నచ్చుతుంది.త