ఎల్లలులేని సంతోషాలను బహూకరించే ఉత్సవం.. క్రిస్మస్ రాకతో నలుదిక్కులా ఉల్లాసం!-merry christmas celebrate the joy of the festive season ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఎల్లలులేని సంతోషాలను బహూకరించే ఉత్సవం.. క్రిస్మస్ రాకతో నలుదిక్కులా ఉల్లాసం!

ఎల్లలులేని సంతోషాలను బహూకరించే ఉత్సవం.. క్రిస్మస్ రాకతో నలుదిక్కులా ఉల్లాసం!

Manda Vikas HT Telugu
Feb 28, 2022 06:04 PM IST

క్రిస్మస్ అంటే కుటుంబంతో, ఆత్మీయులతో మంచి సమయాన్ని గడపడం, అందరి పట్ల కృతజ్ఞత, ప్రేమను కలిగి ఉండటం, ప్రజలతో మీ సంతోషాలను పంచుకోవడం. అన్నింటికీ మించి విశ్వ రక్షకుడైన యేసుక్రీస్తు జన్మను స్మరించుకోవడం. ఇవి క్రిస్మస్ యొక్క ప్రధాన ఉద్దేశ్యాలు. క్రిస్మస్‌ను సంతోషాలను బహూకరించే సీజన్‌గా చెప్తారు. ఈ సీజన్‌లో ఒకరికొకరు బహుమతులను పంచుకుంటారు.

<p>Xmas Celebrations</p>
Xmas Celebrations (HT Photo)

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జరుపుకునే పండగ, ప్రపంచపు ప్రతిమూలలో ఆనందాన్ని పంచే పండగ ఏదైనా ఉందంటే అది కచ్చితంగా 'క్రిస్మస్' అయి ఉంటుంది. యేసుక్రీస్తు (Jesus Christ) జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతీ ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకుంటారు. ఇది క్రైస్తవులు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ. కేవలం క్రైస్తవులే కాక ఇతర వర్గాల వారూ క్రిస్మస్ వేడుకల్లో పాలుపంచుకుంటారు. అందుకే ప్రపంచంలోని అనేక దేశాల్లో క్రిస్మస్‌ను క్రైస్తవ సమాఖ్య సెలవు దినంగా ప్రకటించింది.

క్రిస్మస్ ఈవ్..

క్రిస్మస్ వేడుకలు ఒకరోజు ముందుగా అంటే డిసెంబర్ 24 నుంచే ప్రారంభమవుతాయి, ఈరోజును 'క్రిస్మస్ ఈవ్' అని పిలుస్తారు. అయితే అంతకు కొన్ని రోజుల ముందునుంచే క్రిస్మస్ శోభ ప్రతిచోటా కనిపిస్తుంది. నక్షత్రాల ఆకృతిలో రంగు రంగుల లైట్లతో అలంకరణలు, బహుమతులతో ఆకర్శణీయంగా వేలాడే క్రిస్మస్ చెట్లు, జింగిల్ బెల్స్ అంటూ లయబద్ధంగా పాడే కెరోల్ పాటలు, సంతోషాలను మోసుకొచ్చే శాంతా క్లాజ్ తాత ఇలా ఎటు చూసినా ఉల్లాసభరితమైన వాతావరణం కనిపిస్తుంది.

క్రిస్మస్ అంటే కుటుంబంతో, ఆత్మీయులతో మంచి సమయాన్ని గడపడం, అందరి పట్ల కృతజ్ఞత, ప్రేమను కలిగి ఉండటం, ప్రజలతో మీ సంతోషాలను పంచుకోవడం. అన్నింటికీ మించి విశ్వ రక్షకుడైన యేసుక్రీస్తు జన్మను స్మరించుకోవడం. ఇవి క్రిస్మస్ యొక్క ప్రధాన ఉద్దేశ్యాలు. క్రిస్మస్‌ను సంతోషాలను బహూకరించే సీజన్‌గా చెప్తారు. ఈ సీజన్‌లో ఒకరికొకరు బహుమతులను పంచుకుంటారు. అలా బహుమతులిచ్చి ఒకరి సంతోషానికి కారణమవుతారు. కాబట్టే హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అందుకే క్రిస్మస్ అందరికీ ఎంతో ఇష్టమైన పండగగా నిలిచింది.

చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు..

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని, జీసస్ ను అనుసరించే వారంతా కొత్తబట్టలు వేసుకొని, చక్కగా ముస్తాబై చర్చిలకు వెళ్లి ప్రార్థనలు నిర్వహిస్తారు. ఇండ్లలో క్రిస్మస్ నేపథ్యాన్ని సూచించే అలంకరణలు చేస్తారు. కేరోల్స్ పాడుతూ మిత్రులను, శ్రేయోభిలాషులను కలుస్తారు. మిఠాయిలు, బహుమతులు పంచుకుంటారు. తమ ఆత్మీయులతో కలిసి ఆనందంగా ప్రత్యేకమైన క్రిస్మస్ డిన్నర్ చేస్తారు. క్రీస్తు జననాన్ని స్మరించుకుంటూ అర్ధరాత్రి వరకు చర్చిలలో జరిగే ప్రత్యేక మాస్‌ కార్యక్రమాలకు హాజరవుతారు.

|#+|

Whats_app_banner

సంబంధిత కథనం