డచెస్ ఆఫ్ ససెక్స్ మెగాన్ మార్కెల్ అనూహ్యంగా పారిస్ ఫ్యాషన్ వీక్‌లో అడుగుపెట్టారు. బాలెన్సియాగా (Balenciaga) బ్రాండ్‌కు కొత్తగా క్రియేటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన పియర్‌పాలో పిసియోలీ (Pierpaolo Piccioli) తొలి డిజైనర్ రన్‌వే షోకు ఆమె హాజరయ్యారు. ఈ వేదికతోనే ఆమె పారిస్ ఫ్యాషన్ వీక్‌లో తొలిసారిగా అడుగుపెట్టడం విశేషం.
'ది హార్ట్‌బీట్' (The Heartbeat) పేరుతో పియర్‌పాలో పిసియోలీ రూపొందించిన తొలి కలెక్షన్.. అక్టోబర్ 4న స్ప్రింగ్/సమ్మర్ 2026 సీజన్ కోసం ప్రదర్శితమైంది. ఈ షో ఫ్రంట్ రోలో మెగాన్ మార్కెల్‌తో పాటు పీపీ క్రిట్, అన్నా హాత్వే, సిమోన్ ఆష్లే వంటి అంతర్జాతీయ సెలబ్రిటీలు కూర్చున్నారు.
మెగాన్ మార్కెల్ బాలెన్సియాగా తొలి ప్రదర్శన కోసం పియర్‌పాలో పిసియోలీ డిజైన్ చేసిన ఐవరీ (లేత తెలుపు) రంగు ప్రత్యేక దుస్తులను ఎంచుకున్నారు. ఆ దుస్తుల్లో ఆమె హుందాగా, అత్యంత సొగసుగా కనిపించారు.
దుస్తులు: తెల్లటి సిల్కీ మెటీరియల్‌తో చేసిన బటన్-డౌన్ షర్ట్, దానికి తగ్గట్టుగా ప్యాంటు ధరించారు. దానిపై తెల్లటి కేప్‌ను 'స్టాల్' (పొడవైన శాలువా) మాదిరిగా భుజాలపై వేసుకున్నారు. ఇది పూర్తిగా బాలెన్సియాగా సంస్థ రూపొందించిన డ్రెస్.
యాక్సెసరీస్, స్టైలింగ్: ఈ ఎన్‌సెంబుల్‌కు బ్లాక్ కలర్ హై హీల్స్, చిన్న డైమండ్ చెవిపోగులను, నలుపు రంగు క్లచ్‌ను తీసుకున్నారు.
హెయిర్, మేకప్: హెయిర్ స్టైల్ చాలా సింపుల్‌గా, పదునుగా ఉండే స్లిక్డ్-బ్యాక్ బన్ (జుట్టు మొత్తాన్ని వెనక్కి దువ్వి ముడి వేయడం)ను ఎంచుకున్నారు. మేకప్‌లో ఫెదర్డ్ బ్రౌస్, డ్యూయీ బేస్ (తేమతో కూడిన మెరుపు), బ్లష్డ్ చీక్స్ (గులాబీ బుగ్గలు), గ్లాసీ పింక్ లిప్స్ (మెరిసే పెదవులు) హైలైట్ అయ్యాయి.
ప్రత్యేకం: షో మధ్యలో మెగాన్.. 'వోగ్' మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ అన్నా వింటూర్‌ను కలుసుకున్నారు. "మీరు చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు" అని అన్నా వింటూర్ ఆమె లుక్‌ను మెచ్చుకోవడం విశేషం.
తరువాత, పారిస్‌లోని తమ హోటల్ నుంచి డిన్నర్‌కు బయలుదేరుతున్నప్పుడు మెగాన్ రెండో లుక్‌లో కనిపించారు. ఇది కూడా పియర్‌పాలో పిసియోలీ కస్టమ్ డిజైన్ చేసినదే.
దుస్తులు: స్లీవ్‌లెస్ ఉన్న నలుపు రంగు, చీలమండల వరకు ఉన్న గౌను ధరించారు. ఈ డ్రెస్‌లో డ్రేప్డ్ నెక్ లైన్ (చుట్టూ ముడతలు పడిన గొంతు భాగం), బ్యాక్‌లెస్ డిజైన్, ముందు వైపు కేప్ లాంటి డీటైల్స్, శరీరానికి అతుక్కున్నట్లు ఉండే స్లిమ్-ఫిటెడ్ సిల్హౌట్ ప్రత్యేకంగా ఆకర్షించాయి.
యాక్సెసరీస్, స్టైలింగ్: ఈ లుక్‌కు బ్రాస్‌లెట్, ఒక లగ్జరీ వాచ్, బ్లాక్ హైహీల్స్, చిన్న డైమండ్ స్టడ్స్‌ను యాక్సెసరీస్‌గా పెట్టుకున్నారు.
హెయిర్, మేకప్: ఈసారి ఆమె జుట్టును స్లీక్ టాప్ నాట్ (పైకి ముడి వేసిన స్టైల్) వేసుకున్నారు. బ్లష్డ్ చీక్స్, మెరిసే హైలైటర్, ఫెదర్డ్ బ్రౌస్, మ్యూటెడ్ పింక్ గ్లాసీ లిప్స్‌తో తనదైన 'మినిమల్ మేకప్' స్టైల్‌ను కొనసాగించారు.
ఫ్యాషన్ ప్రపంచంలో హఠాత్తుగా మెగాన్ మార్కెల్ ఇచ్చిన ఈ ఎంట్రీ, ఆమె ఎంచుకున్న స్టైలిష్ లుక్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.