ధ్యానం చేయాలంటే ఏకాగ్రత చాలా ముఖ్యం. మన చుట్టూ ఉన్న ప్రదేశం దానిపై బాగా ప్రభావం చూపుతుంది. అది మనల్ని ధ్యానంలోకి లాగవచ్చు లేదా దృష్టి మళ్లించవచ్చు. అందుకే రోజూ ధ్యానం చేయడానికి ఒక ప్రత్యేకమైన చోటు ఏర్పరుచుకోవడం చాలా అవసరం. బాగా ఆలోచించి డిజైన్ చేసిన ధ్యాన స్థలం మనసుకు ప్రశాంతతనిచ్చి, క్రమం తప్పకుండా ధ్యానం చేసేలా ప్రోత్సహిస్తుంది.
మానవి హోమ్స్ వ్యవస్థాపకులు వివేక్ అగర్వాల్, అమన్ బన్సల్, అభిషేక్ అగర్వాల్ రోజూ మనం ప్రశాంతంగా ధ్యానం చేసుకునే చోటును ఎలా డిజైన్ చేయాలో నాలుగు ముఖ్యమైన చిట్కాలను HT లైఫ్‌స్టైల్‌తో పంచుకున్నారు.
బ్రష్ చేసిన లోహం, అల్లిన వెదురు, సహజ కలప వంటివి నిజమైన, సహజమైన అనుభూతిని ఇస్తాయి. ఈ వస్తువులు తాకడానికి బాగుంటాయి, కాలక్రమేణా మరింత అందంగా మారతాయి. వీటికి ఎక్కువ నిర్వహణ అవసరం లేదు. పైగా వాడిన కొద్దీ మరింత సౌకర్యంగా ఉంటాయి.
లేత గోధుమ రంగులు, ఎక్రూ (ముడి పట్టు రంగు), మట్టి రంగు, లేత బూడిద రంగు వంటివి కళ్ళకు ప్రశాంతతనిస్తాయి. ఈ రంగులు మరీ పలచగా కాకుండా, అనవసరమైన ఆకర్షణ లేకుండా ఉంటాయి. అవి ఆ ప్రదేశానికి నిలకడగా, ప్రశాంతంగా ఉండే అనుభూతిని ఇస్తాయి.
బాగా ఆలోచించి రూపొందించిన ధ్యాన స్థలాలు ఏదో మొక్కుబడిగా చేసినవి కావు. అవి ఇంటి మొత్తం డిజైన్‌లో భాగంగా, మిగతా గదులకు ఇచ్చినంత శ్రద్ధతో నిర్మితమవుతాయి. ఈ ప్రదేశాలు ఇంటి నుండి వేరుగా కనిపించకుండా, దానిలో కలిసిపోయేలా డిజైన్ చేసి ఉంటాయి.
ఎక్కువ అలంకరణలు పెట్టడం లేదా మ్యాగజైన్‌లలో చూసినట్టుగా స్టైల్ చేయడం వల్ల ప్రశాంతత దెబ్బతింటుంది. ఆధ్యాత్మికతకు అలంకరణ అవసరం లేదు. ఒక స్థలం నిజాయితీగా, సహజంగా ఉన్నప్పుడే మనసు అక్కడ నిలబడుతుంది.
టాపిక్