Mealmaker Pulao: కూరగాయలు లేకపోతే మీల్ మేకర్ పులావ్ ట్రై చేయండి, రెసిపీ చాలా సులువు-mealmaker pulao recipe in telugu know how to make it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mealmaker Pulao: కూరగాయలు లేకపోతే మీల్ మేకర్ పులావ్ ట్రై చేయండి, రెసిపీ చాలా సులువు

Mealmaker Pulao: కూరగాయలు లేకపోతే మీల్ మేకర్ పులావ్ ట్రై చేయండి, రెసిపీ చాలా సులువు

Haritha Chappa HT Telugu

Mealmaker Pulao: శాకాహారులు ఎక్కువగా మీల్ మేకర్ ను తింటూ ఉంటారు. దీంతో చేసే పులావ్ చాలా రుచిగా ఉంటుంది.

మీల్ మేకర్ పులావ్ రెసిపీ (Dindigul Food Court)

Mealmaker Pulao: మీల్ మేకర్, సోయా చంక్స్... రెండూ ఒక్కటే. సోయా బీన్స్ తో వీటిని తయారుచేస్తారు. వీటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. సోయా చంక్స్ తో చేసే పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు వీటితో పులావ్ చేసేయండి. రుచి అదిరిపోతుంది. పోషకాలు కూడా పుష్కలంగా అందుతాయి. పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీగా ఇది ఉపయోగపడుతుంది.

మీల్ మేకర్ పులావ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

మీల్ మేకర్ - 100 గ్రాములు

బాస్మతి బియ్యం - పావు కిలో

దాల్చిన చెక్క - ఒక చిన్న ముక్క

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

యాలకులు - మూడు

ఉప్పు - రుచికి సరిపడా

నెయ్యి - నాలుగు స్పూన్లు

లవంగాలు - అయిదు

బిర్యానీ ఆకులు - రెండు

పుదీనా తరుగు - మూడు స్పూన్లు

కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు

పచ్చిమిర్చి - నాలుగు

ఉల్లిపాయ - ఒకటి

మీల్ మేకర్ పులావ్ రెసిపీ

1. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఒక గిన్నెలో వేసి నానబెట్టుకోవాలి.

2. మీల్ మేకర్ ను కూడా పది నిమిషాల ముందే నానబెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టి నూనె, నెయ్యి వేయాలి.

4. అవి వేడెక్కాక దాల్చిన చెక్క, లవంగం, యాలకులు వేసి వేయించాలి.

5. బిర్యానీ ఆకులు, నిలువుగా కోసిన ఉల్లిపాయలు, నిలువుగా పచ్చిమిర్చి వేసి వేయించాలి.

6. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్టును వేసి వేయించాలి.

7. ఆ మిశ్రమంలోనే కొత్తిమీర తరుగు, బిర్యానీ తరుగు వేసి వేయించాలి.

8. వాటిలోనే నీటిలో నానబెట్టిన మీల్ మేకర్‌ను బాగా పిండి కుక్కర్లో వేయాలి.

9. ముందుగా నానెబట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి కలపాలి.

10. బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి రెండు విజిల్స్ వచ్చే దాకా ఉడికించాలి.

11. ఆవిరి పోయాక కుక్కర్ మూత తీయాలి. అంతే మీల్ మేకర్ పులావ్ రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.