Mayonnaise Side Effects: మయొనైజ్ వల్ల ఆరోగ్యానికి ఎన్ని నష్టాలు ఉంటాయో చెప్పిన డైటిషియన్.. దీర్ఘకాలిక సమస్యలు కూడా..
Mayonnaise Side effects: మయొనైజ్ తినడం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. ప్రస్తుతం ఈ విషయం హాట్‍టాపిక్‍గా ఉంది. మయొనైజ్ వల్ల స్వల్ప కాలికంగా, దీర్ఘకాలికంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఓ డైటిషియన్ వివరించారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
కొన్నేళ్లుగా మయొనైజ్ వాడకం బాగా పెరిగిపోయింది. ఫ్రెంచ్ ఫ్రైస్, కబాబ్‍లు, మోమోలు, చిప్స్ ఇలా చాలా రకాల స్నాక్స్‌లో మయొనైజ్‍ను నంచుకొని తింటున్నారు. కొన్ని వంటల్లోనూ వాడుతున్నారు. అయితే, కొంతకాలంగా మయొనైజ్ హాట్‍టాపిక్‍గా మారింది. హైదరాబాద్‍లో మోమోస్‍లో వేసిన మయొనైజ్ కారణంగా ఓ మహిళ మృతి చెందారు. దీంతో గుడ్డుతో తయారు చేసే మయొనైజ్‍ను తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసింది. అయితే, మయొనైజ్ అతిగా తినడం వల్ల స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చాలా తలెత్తుతాయని ఓ డైటిషియన్ వెల్లడించారు. ఆ వివరాలివే..
ఆరోగ్యంపై మయొనైజ్ ప్రభావం గురించి హెచ్‍టీ లైఫ్‍స్టైల్‍తో ఢిల్లీ ద్వారకలోని మణిపాల్ ఆసుపత్రి న్యూట్రిషన్, డైటెటిక్స్ కన్సల్టెంట్ డైటిషియన్ విశాలీ వర్మ మాట్లాడారు. “ఎగ్‍తో తయారు చేసే దానితో పాటు రకరకాలైన మయొనైజ్ అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా దొరికే ఎగ్ బేస్డ్ మయొనైజ్‍ను గుడ్డు సొన, నూనె, వెనిగర్/నిమ్మరసంతో తయారు చేస్తారు. క్రీమీ టెక్స్చర్ ఉండేలా చేస్తారు. అయితే, దాన్ని సరిగా నిల్వ చేయాల్సి ఉంటుంది. సరిగా నిల్వ చేయని మయొనైజ్ తింటే అనారోగ్యానికి చేటు కలుగుతుంది” అని వైశాలి వెల్లడించారు. అలాగే, మయొనైజ్ ఎక్కువగా తింటే కలిగే నష్టాలు వివరించారు. అవేవంటే..
మయొనైజ్ వల్ల సల్పకాలిక నష్టాలు
మయొనైజ్ ఎక్కువగా తినడం వల్ల వెంటనే కూడా ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. తక్కువ కాలంలోనే ఆరోగ్యం సమస్యలు తలెత్తే రిస్క్ ఉంటుంది.
- ఫుడ్ పాయిజనింగ్: గుడ్లతో ఇంట్లో తయారు చేసే మయొనైజ్‍తో ఫుడ్ పాయిజనింగ్ రిస్క్ ఉంటుంది. పచ్చి గుడ్డులోని సాల్మోనెల్లా బ్యాక్టిరీయా వల్ల ఈ ప్రభావం ఉంటుంది. ఆహారం కల్తీ కావొచ్చు. మార్కెట్లో దొరికే మయొనైజ్‍లను పాయిశ్చరైజ్డ్ గుడ్లతో తయారు చేస్తారు. అయితే, సరిగా నిల్వ చేయని కారణంగా వాటిలోనూ బ్యాక్టిరియా పెరుగుతుంది. దీంతో ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం ఉంటుంది. దీనివల్ల వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి.
- జీర్ణక్రియకు ఇబ్బంది: మయొనైజ్‍లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది తింటే జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది. కడుపులో మంట, వికారం సమస్యలు ఎదురవుతాయి.
- అలర్జిక్ రియాక్షన్లు: కొందరికి ఎగ్ ఎలర్జీ, సెన్సిటివిటీలు ఉంటాయి. అలాంటి వారికి మయొనైజ్ తిన్నవెంటనే దురద లాంటి అలర్జిటిక్ రియాక్షన్లు వచ్చేస్తాయి.
దీర్ఘకాలిక రిస్క్‌లు
మయొనైజ్ ఎక్కువగా తినడం వల్ల దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యల రిస్క్ కూడా ఉంటుంది.
- గుండె వ్యాధుల ప్రమాదం: మయొనైజ్‍లో ఎక్కువగా సాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్ కారకాలు ఉంటాయి. అందుకే ఇది ఎక్కువగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగేలా చేస్తాయి. దీనివల్ల గుండె వ్యాధులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.
- బరువు పెరగడం: మయొనైజ్‍లో క్యాలరీలు, ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని అతిగా తీసుకుంటే బరువు పెరేలా చేస్తుంది.
- బ్లడ్ ప్రెజర్: మయొనైజ్ తింటే బ్లడ్ ప్రెజర్ పెరిగే రిస్క్ ఎక్కువ. దీంట్లో అత్యధికంగా ఉండే ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు ఇందుకు దోహదం చేస్తాయి. హైబీపీ ప్రమాదం మయొనైజ్‍తో ఉంటుంది.
మయొనైజ్ బదులు.. గ్రీక్ యగర్ట్, హమ్మస్ లాంటివి వాడొచ్చు. వీటివల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.
టాపిక్