Banana peel: అరటితొక్కలు విసిరేసే కన్నా ఇలా వాడితే చర్మం మెరిసిపోవడం ఖాయం-massaging the face with banana peels will reduce acne and itching banana peels for glowing skin ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Banana Peel: అరటితొక్కలు విసిరేసే కన్నా ఇలా వాడితే చర్మం మెరిసిపోవడం ఖాయం

Banana peel: అరటితొక్కలు విసిరేసే కన్నా ఇలా వాడితే చర్మం మెరిసిపోవడం ఖాయం

Haritha Chappa HT Telugu
Jan 28, 2025 06:30 PM IST

Banana peel: అరటితొక్కలను పడేసేకన్నా వాటిని చర్మ సౌందర్యానికి వినియోగించవచ్చు. ముఖంపై ఉన్న మచ్చలను, మొటిమలను తొలగించడానికి వీటిని ఉపయోగించవచ్చు. ముఖంపై గీతలు, ముడతలను తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి.

అరటి తొక్కలతో అందం
అరటి తొక్కలతో అందం (Shutterstock)

అరటిపండును తిన్న తరువాత అరటి తొక్కను పడేస్తారు అంతా. అరటి తొక్క మీ అందాన్ని పెంచుతుంది. అరటి పండులోనే కాదు అరటి తొక్కల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. అరటి తొక్కలలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, చక్కెర, ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, విటమిన్ ఎ, కాల్షియం, ఇనుముతో వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేందుకు, మచ్చ లేకుండా చేసేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. అరటి తొక్కలను ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే అమేజింగ్ బెనిఫిట్స్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

yearly horoscope entry point

అరటి తొక్కల్లోని గుణాలు

అరటి తొక్కల్లో స్కిన్ హీలింగ్ లక్షణాలు ఎక్కువ. ఈ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని డ్యామేజ్ చేసే ఫ్రీరాడికల్స్ నుండి చర్మాన్ని రక్షిస్తాయి. ఈ తొక్కలను చర్మానికి అప్లై చేయడం వల్ల ఎండ దెబ్బతినకుండా కూడా రక్షణ లభిస్తుంది.

మొటిమలను తగ్గిస్తాయి

అరటితొక్కలను ఉపయెగించడం వల్ల ముఖం మచ్చలను తగ్గిస్తుంది. పిగ్మెంటేషన్ నిరోధించడానికి సహాయపడుతుంది. అరటిపండు తొక్కలను చేతితోనే మొటిమలపై రుద్దడం వల్ల బొబ్బలు, మొటిమల ఎరుపు తొలగిపోవడమే కాకుండా దురద నుంచి ఉపశమనం లభిస్తుంది. అరటి తొక్కలలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇవి మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి.

వృద్ధాప్యంలో ముడతల సమస్య నుంచి ఉపశమనం పొందడానికి అరటి తొక్క నివారణ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అరటి తొక్కలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం స్థితిస్థాపకతను నిర్వహించడానికి, సన్నని గీతల సమస్యను తగ్గించడానికి సహాయపడతాయి. ఈ రెమెడీ చేయడానికి అరటి తొక్కను ముఖంపై ఉన్న సన్నని గీతలపై కొద్దిసేపు తేలికగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ముఖంపై ఉన్న గీతలు చాలా వరకు తగ్గిపోతాయి.

దురద తగ్గుతుంది

చర్మంపై దురద , చికాకు, అలెర్జీల వంటి సమస్య ఉంటే వెంటనే అరటితొక్కను రుద్దితే ఎంతో మంచిది. సమస్య ఎక్కడ ఉందో అక్కడ అరటి తొక్కతో తరచూ మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఎంతో కొంత వెంటనే ఉపశమనం కలుగుతుంది.

కళ్ల కింద డార్క్ సర్కిల్స్ సమస్యను తగ్గించడానికి అరటి తొక్కలు కూడా సహాయపడతాయి. అరటి తొక్కల్లో ఉండే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు డార్క్ సర్కిల్స్ ను దూరం చేస్తాయి. కాబట్టి అరటి తొక్కలను కళ్లకింద తేలికగా మసాజ్ చేసేందుకు పయత్నించండి. మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner