Masala Egg Paratha: బ్రేక్ ఫాస్ట్‌లో మసాలా ఎగ్ పరాటా, రెసిపీ చాలా సులువు
Masala Egg Paratha: బ్రేక్ ఫాస్ట్‌లో ఒకసారి మసాలా ఎగ్ పరాటా చేసుకొని చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పరాటా చేయడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. రెసిపీ కూడా చాలా ఈజీ .

Masala Egg Paratha: ఇప్పుడు ఒకేలాంటి బ్రేక్ ఫాస్ట్‌లో బోర్ కొడితే ఓసారి కొత్తగా మసాలా ఎగ్ పరాటా చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక్కటి తింటే చాలు పొట్ట నిండిపోతుంది. దీంతో జతగా ఎలాంటి కూర కూడా అవసరం లేదు. దీనిలో ఉపయోగించినవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. కాబట్టి ఎన్నో పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. మసాలా ఎగ్ పరాటా రెసిపీ కేవలం 20 నిమిషాల్లో పూర్తి చేయచ్చు. ఇది ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం.
మసాలా ఎగ్ పరాటా రెసిపీకి కావాల్సిన పదార్థాలు
గుడ్లు - రెండు
గోధుమపిండి - ఒక కప్పు
కొత్తిమీర - ఒక కట్ట
మిరియాల పొడి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
బటర్ - ఒక స్పూను
మసాలా ఎగ్ పరాటా రెసిపీ
1. ఒక గిన్నెలో నీళ్లు వేసి గుడ్లను ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు మరో గిన్నెలో ఉడికించిన గుడ్డును సన్నగా తురిమి మిరియాల పొడి, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి చేతితోనే కలుపుకోవాలి.
3. ఇప్పుడు గోధుమ పిండిని పరాటా కోసం కలిపి పక్కన పెట్టుకోవాలి. దానిమీద మూత పెట్టి పావుగంట వదిలేయాలి.
4. తర్వాత చపాతీ పిండి లోంచి కొంత భాగాన్ని తీసి పరాటాను ఒత్తుకోవాలి.
5. మధ్యలో గుడ్డు మిశ్రమాన్ని వేసి చపాతీని మడత పెట్టేసి మళ్ళీ పరాటాలాగా ఒత్తుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి లేదా బటర్ రాసి ఈ పరాటాను వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
7. అంతే టేస్టీ మసాలా ఎగ్ పరాటా రెడీ అయినట్టే.
8. దీన్ని తిన్నారంటే మళ్ళీ మళ్లీ తినాలనిపించేలా ఉంటుంది. ఒక్కసారి దీన్ని చేసుకొని చూడండి. మీకు నచ్చడం ఖాయం.
ఈ రెసిపీలో మన ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలనే అధికంగా వాడాము. కాబట్టి ఆరోగ్యానికి ఎంతో చాలా మంచిది. కొత్తిమీర, మిరియాల పొడి, గుడ్డు మనకు ఎన్నో పోషకాలను అందిస్తాయి. ఇక బటర్, గోధుమపిండి కూడా ఆరోగ్యానికి మేలే చేస్తాయి. వారంలో కనీసం ఒక్కసారైనా ఈ మసాలా ఎగ్ పరాటా ప్రయత్నించండి. మీకు నచ్చడం ఖాయం. పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. ఈ మసాలా ఎగ్ పరాటాతో పాటు చికెన్ కర్రీ కూడా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి కర్రీ లేకపోయినా కూడా ఈ మసాలా ఎగ్ పరాటాను తినేయవచ్చు.
టాపిక్