Eco friendly ganesh decor: పర్యావరణ హితంగా, తక్కువ ఖర్చుతో వినాయకుణి అలంకరణ మార్గాలు
Eco friendly ganesh decor: ఈ పర్యావరణ అనుకూల, సృజనాత్మక అలంకరణ ఆలోచనలను మీ ఉత్సవాలలో భాగం చేయండి. పర్యావరణ హితంగా గణేష్ చతుర్థి జరుపుకోండి.
వినాయక చవితి రోజు పర్యావరణహితంగా అలంకరణ చేయడానికి అనేక మార్గాలున్నాయి. మట్టి వినాయకుణ్ని ప్రతీష్టించినప్పుడు అలంకరణ కూడా అలాగే ఉండాలి కదా. ఆ మార్గాలు చూడండి.
1. సహజ వస్తువులు
బ్యాంబూ తో చేసిన మ్యాట్స్, వెదురు చాపలు, అల్లిన బుట్టలు వంటి సహజ వస్తువులు అలంకరణలో చేర్చండి. మీ మండపం కోసం, పాత ఫర్నిచర్ వాడండి. పాత బుట్టలు, గుల్లలు, తాళ్లు వాడి గ్రామీణ స్టైల్ డెకార్ చేసేయొచ్చు.
2. ఫ్యాబ్రిక్స్
పాత చీరలు, దుపట్టాలు లేదా కర్టెన్లను తిరిగి ఉపయోగించడం ద్వారా మీ అలంకరణను మంచి రంగులు జోడించొచ్చు. పర్యావరణ హితంతో పాటూ అందం కూడా.
3. మొక్కలు
కుండీలో పెంచుతున్న మొక్కలు, ఇండోర్ చెట్లను చేర్చడం ద్వారా ప్రకృతి స్పర్శతో మీ వేడుక అందాన్ని పెంచండి. పచ్చని, తాజా వాతావరణాన్ని అందిస్తాయీ మార్గాలు.
4. లైటింగ్
వేలాడే లాంతర్లు లేదా ఫెయిరీ లైట్లను ఒక గాజు జాడీలో వేసి గణపతి పక్కన పెట్టండి. దీంతో అలంకరణ లుక్ పూర్తిగా మారుతుంది. బ్యాక్‌గ్రౌండ్ కోసం పచ్చని తీగలతో కలిపి విద్యుద్దీపాలను వేలాడదీయండి.
5. పండుగ తర్వాత:
పండగ పూర్తయ్యాక అలంకరణ కోెసం వాడిన వస్తువులను బయట పడేయకండి. వాటిని మీ ఇంటి అలంకరణకు వాడొచ్చేమో చూడండి. వీటిని ప్రతి సంవత్సరం మీ వేడుకల్లో భాగం చేసుకోవచ్చు. ఈ పర్యావరణ అనుకూల డిజైన్ ఆలోచనల ద్వారా పర్యావరణానికి మేలు చేసినట్లే.