Brain tumor: ఈ లక్షణాలను ఎక్కువమంది పట్టించుకోరు, కానీ ఇవి బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు-many people ignore these symptoms but these are brain tumor symptoms ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Brain Tumor: ఈ లక్షణాలను ఎక్కువమంది పట్టించుకోరు, కానీ ఇవి బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు

Brain tumor: ఈ లక్షణాలను ఎక్కువమంది పట్టించుకోరు, కానీ ఇవి బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు

Haritha Chappa HT Telugu

World brain tumor day 2024: బ్రెయిన్ ట్యూమర్ ప్రాణాంతక సమస్య. ఇది వచ్చినా కూడా చాలా మంది ప్రాథమిక దశలో గుర్తించలేరు. బ్రెయిన్ ట్యూమర్ కొన్ని రకాల లక్షణాలను చూపిస్తుంది. ఇలాంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.

వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే (Freepik)

బ్రెయిన్ ట్యూమర్ అనేది మెదడులో వచ్చే ప్రధాన సమస్య. మెదడులో కణాలు అసాధారణంగా పెరగడడం వల్ల కణితులు ఏర్పడతాయి. అవి క్యాన్సర్ వల్ల కావచ్చు, కాకపోవచ్చు కూడా. మెదడులో కణితులు ఏర్పడితే అవి దీర్ఘకాలంలో క్యాన్సర్ గా మారే అవకాశం ఉంది. మెదడులో కణితులు ఏర్పడడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఆ కణితులు కొన్ని రకాల లక్షణాలను చూపిస్తాయి.

తలనొప్పి

మెదడులో కణితులు ఏర్పడడం వల్ల సాధారణంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో ఒకటి తలనొప్పి. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి ఉన్న వారిలో దాదాపు సగం మందికి తలనొప్పి వస్తుంది. మూర్ఛలు, చేతులు లేదా కాళ్ళలో తిమ్మిరి, నడుస్తున్నప్పుడు తూగి పడిపోతామన్న అనుభవం, వినికిడి లోపం, ప్రవర్తనలో మార్పు, చూసినవన్నీ రెండుగా కనిపిండం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడులో కణితులు వచ్చే స్థానాన్ని బట్టి బయటికి కనిపించే లక్షణాలు మారవచ్చు.

రుతుస్రావ అసాధారణతలు, అసాధారణ ప్రవర్తన, అవయవాల బలహీనత, వినికిడి సమస్యలు, వంధ్యత్వం ఇవన్నీ మెదడు కణితులతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ లక్షణాలు కొన్నిసార్లు ఆలస్యంగా బయటపడవచ్చు. బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వారిలో కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయి.

బ్రెయిన్ ట్యూమర్ ఉండే కనిపించే లక్షణాలు

1. అసాధారణ ప్రవర్తన: బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వారు నిశ్శబ్దంగా ఉంటారు. వారు ఏ పనీ సరిగా చేయలేరు, చేతులు సహకరించవు, పరిసరాల పట్ల నిరాసక్తత, గందరగోళం వంటివి కనిపిస్తాయి. వారు మానసిక వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితి వస్తుంది. వారు ఎటువంటి రేడియోలాజికల్ పరిశోధన చేయకుండా మందులు ఇవ్వవచ్చు. అటువంటి వాటివల్ల రోగులు తాత్కాలికంగా మెరుగుపడవచ్చు, కానీ తరువాత మళ్లీ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇటువంటి రోగులకు సాధారణంగా ఫ్రంటల్ లోబ్స్ లో కణితులు ఉంటాయి.

2. దృష్టి సమస్యలు: కంటి చూపుపై ఒత్తిడి కారణంగా, వివిధ రకాల దృష్టి సమస్యలు వస్తాయి. పాక్షికంగా దృష్టి తగ్గుతుంది. చాలా మంది రోగులు మెదడు MRI చేయడానికి ముందు దృష్టిని కోల్పోతారు.

3. హార్మోన్ల అవాంతరాలు: హార్మోన్ల అసమతుల్యత కారణంగా రుతుక్రమంలో అసాధారణతలు, సంతానలేమి, గాలటోరియా, ఎదుగుదల మందగించడం, థైరాయిడ్ సంబంధిత సమస్యలు, గిగాంటిసిజం మొదలైన వాటితో బాధపడేవారు వైద్యులను సంప్రదిస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యలతో గైనకాలజిస్ట్ లేదా ఎండోక్రినాలజిస్ట్ దగ్గరికి వెళతారు. వారు బ్రెయిన్ ట్యూమర్ గురించి ఆలోచించకపోవచ్చు. కాబట్టి బ్రెయిన్ ట్యూమర్ చికిత్సలో ఆలస్యం అవుతుంది. ఈలోపు కణితి ప్రమాదకరంగా మారుతుంది.

4. నడక: మెదడు వెనుక భాగంలో కణితి ఏర్పడితే కొంతమంది రోగులు నడుస్తున్నప్పుడు అసమతుల్యత కలిగి ఉండవచ్చు. వారు మద్యం సేవించినట్లు తూగుతూ నడుస్తుంటారు.

5. వినికిడి సమస్యలు: కొంతమంది రోగులు ఒక చెవి నుండి మాత్రమే ఫోన్ కాల్స్ మాట్లాడగలుగుతారు. ఒకవైపు క్రమంగా వినికిడి తగ్గుతుందనే విషయం వారికి తెలియదు. కణితులు ఒక చెవిలో వినికిడి లోపానికి దారితీస్తాయి.

6. ఆకస్మికంగా తలనొప్పి: కొంతమంది రోగులు ముందుగా ఉన్న మెదడు కణితులలో రక్తస్రావం అవుతుంది. దీనివల్ల తలనొప్పి అధికంగా వస్తుంది.

7. భాషా సమస్యలు: బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్లు సరిగా మాట్లాడలేరు. భాషను మరిచిపోతు ఉంటారు.

9. దృష్టి సమస్యలు: మెదడులోకణితులు ఉన్న వారికి ప్రతీ వస్తువు రెండుగా కనిపిస్తుంది.

10. వికారం, వాంతులు: మెదడు కణితులు ఉన్న రోగులలో వికారం, వాంతులు వంటివి కనిపిస్తాయి. అలాగే మూర్ఛలు కూడా కనిపిస్తూ ఉంటాయి.