Self talk: ప్రతిరోజూ కాసేపు మీతో మీరు మాట్లాడుకోవడం వల్ల ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు-many health benefits of talking to yourself every day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Self Talk: ప్రతిరోజూ కాసేపు మీతో మీరు మాట్లాడుకోవడం వల్ల ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు

Self talk: ప్రతిరోజూ కాసేపు మీతో మీరు మాట్లాడుకోవడం వల్ల ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు

Haritha Chappa HT Telugu
Jan 31, 2025 07:30 AM IST

Self talk: చిన్న కష్టం అనిపించినా పక్కవారితో బాధను చెప్పుకునే కన్నా మొదట మీతో మీరు చెప్పుకోవడానికి ప్రయత్నించండి. అద్దం ముందు నిల్చుని మాట్లాడుకోండి. ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

మీతో మీరు మాట్లాడుకోవడం వల్ల ఎన్ని లాభాలో
మీతో మీరు మాట్లాడుకోవడం వల్ల ఎన్ని లాభాలో (shutterstock)

మనతో మనం మాట్లాడుకోవడం చూస్తే ఎవరైనా ఏమనుకుంటారనే భయం ఎక్కువ మందిలో ఉంటుంది. అలాగే కొంతమంది అలా సెల్ఫ్ టాక్ చేసే వారిని చూసి మతి భ్రమించిందని కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ రోజులో ఒక పావుగంటా లేదా అరగంట పాటూ మీ బాధలు, కష్టాలు, ఇబ్బందులు మీకు మీరే చెప్పుకుంటే ఎంతో మానసిక ప్రశాంతత దక్కుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అద్దం ముందు నిల్చుని మాట్లాడడం వల్ల క్లారిటీగా కూడా అనిపిస్తుంది.

yearly horoscope entry point

మీలో మీరే కాసేపు మాట్లాడుకునే అలవాటు ఉంటే అది మీ మానసిక ఆరోగ్యానికి మంచిది. మీతో మీరు మాట్లాడుకున్నప్పుడు సానుకూలంగా మాట్లాడేందుకే ప్రయత్నించాలి. మీతో మీరు క్లిష్ట పరిస్థితిలో మీతో మీరే మాట్లాడి సలహా తీసుకోవాలనుకుంటే, అది మంచి అలవాటు. సెల్ఫ్ టాక్ వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి.

స్వీయ సంభాషణ వల్ల మీ మనస్సు ఎంతో ప్రభావితమవుతుంది. ఇలా చేయడం వల్ల మీకు జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరికేందుకు సహాయపడుతుంది. సెల్ఫ్ టాక్ పాజిటివ్ గా, నెగిటివ్ గా కూడా ఉంటుంది. మీరు పాజిటివ్ గా మాత్రమే ఆలోచించాలి. ఇది మీ గురించి ఎన్నో మంచి విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి.

సానుకూలంగా చేసే సెల్ఫ్ టాక్ వల్ల ప్రయోజనాలు

స్వీయ-చర్చ లేదా సెల్ఫ్ టాక్ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇది మీ జీవితంలో సంతృప్తిని ఇస్తుంది. మీరు మానసికంగా ఎంతో తేలిక పడతారు.

సానుకూల స్వీయ-చర్చ రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తుంది.

మనసు పొరల్లో ఉన్న నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి స్వీయచర్చ అనేది ఎంతో సహాయపడుతుంది.

ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

పాజిటివ్ సెల్ఫ్ టాక్ మానసిక నైపుణ్యాలను పెంచుతుంది. ఇది సమస్యలను మరింత సులభంగా పరిష్కరించడానికి సహాయపడుతుంది. స్వీయ-సంభాషణ ప్రజలు భిన్నంగా ఆలోచించేందుకు సహాయపడుతుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీతో మీరు మాట్లాడుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గే అవకాశం ఎక్కువ.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner