ఏ వేడుకైనా నోరు తీపిచేసుకోవాల్సిందే. మార్కెట్లో రసగుల్లాలు అధికంగా దొరుకుతాయి. ఈ రసగుల్లా తింటే చాలు నోట్లో కరిగిపోయేలా ఉంటుంది. వేసవిలో మామిడి పండ్లు అధికంగా దొరుకుతాయి. వాటితో చేసే వంటకాలను ఈ సీజన్లోనే చేసుకుని తినాలి. అలాంటి వాటిల్లో మామిడి రసగుల్లా ఒకటి.
మామిడి రసగుల్లా నోట్లో పెట్టగానే ఎంతో రుచిగా అనిపిస్తుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా రసగుల్లాను అప్పుడప్పుడు కొత్తగా ఇలా మామిడి పండుతో డిఫరెంట్ గా చేసేందుకు ప్రయత్నించండి. మామిడి రసగుల్లా ఎలా తయారు చేసుకోవచ్చు?అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటి? చేసే విధానం ఏమిటి? తెలుసుకోండి
మామిడి పండ్లు - మూడు
పాలు - లీటరు
పంచదార - ఒక కప్పు
నిమ్మరసం -ఒక స్పూను
స్కిమ్డ్ మిల్క్ - 1 కప్పు
యాలకుల పొడి - అర స్పూను
జీడిపప్పులు - గుప్పెడు
2. ఆ ప్యూరీలో అరలీటరు పాలు వేసి బాగా కలుపుకోవాలి. లోపల ముద్దలు లేకుండా బాగా గిలక్కొట్టాలి.
3. ఆ తర్వాత ఆ పాలను మీడియం మంట మీద మరిగించాలి. పాలు విరిగిపోవడం మొదలవుతుంది.
4. తర్వాత అందులో 7 నుంచి 8 చుక్కల నిమ్మరసం కలపాలి.
5. విరిగిన పాల నుండి జున్నును వడకట్టి పక్కన పెట్టుకోవాలి. నీరు లేకుండా బాగా పిండుకకోవాలి.
6. ఈ మిశ్రమాన్ని మెత్తగా అయ్యే వరకు బాగా నలపండి. తర్వాత ఆ మిశ్రమంతో చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకుని పక్కనపెట్టుకోండి.
7. ఇప్పుడు సిరప్ తయారు చేసేందుకు స్టవ్ మీద కళాయి పెట్టి పంచదార, నీరు వేసి బాగా మరిగించండి.
8. చక్కెర నీటిలో పూర్తిగా కరిగే వరకు వేచి ఉండండి. తరువాత ఆ చక్కెర సిరప్లో ఇప్పటికే సిద్ధం చేసిన ఉండలను వేసి, పాన్ మూతను మూసివేసి సుమారు 15 నుండి 20 నిమిషాలు మరిగించాలి.
9. ఇప్పుడు రబ్డీ తయారు చేసేందుకు స్టవ్ మీద కళాయి పెట్టి పాలను వేయాలి.
10. చిన్న మంట మీద పాలు మరిగించిన తరువాత పంచదార వేసి కరిగించుకోవాలి.
11. చిన్న మంట మీద ఎక్కువ సమయం పాటూ ఈ మిశ్రమాన్ని మరగిస్తే అది సగం వరకు అవుతుంది . తర్వాత యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
12. ఈ మిశ్రమం గది ఉష్ణోగ్రతకు చేరుకున్న తర్వాత మామిడి ప్యూరీ అందులో వేసి కలుపుకోవాలి.
13. ఈ రబ్డీని బాగా చల్లారనివ్వాలి. అందులో ముందు సిద్ధం చేసిన రసగుల్లాలను వేసి ఫ్రిజ్ లోపల పెట్టాలి.
14. సన్నగా తరిగిన జీడిపప్పుతో గార్నిష్ చేస్తే రుచికరమైన మామిడి రసగుల్లా రెడీ అయినట్టే.
ఈ మామిడి రసగుల్లా ఎంతో రుచిగా ఉంటుంది. ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఈ మామిడి రసగుల్లా పెడితే వారికి కూడా ఎంతో నచ్చుతుంది.