పిల్లలు అనగానే మనకు గుర్తొచ్చేది అల్లరి. కాస్త వయస్సు తక్కువగా ఉన్న పిల్లల్లో అల్లరితో పాటు ఏడుపు కూడా ఎక్కువగా ఉంటుంది. తరచుగా ఏదో ఒక విషయం గురించి కంప్లైంట్ చేస్తూ ఏడుస్తూనే కనిపిస్తారు. లేదా ఏదైనా కావాలనిపించినా ఏడుస్తూ అడుగుతారు. మనం దానిని వేరేలా భావిస్తాం. వస్తువు సాధించడం కోసం కావాలనే మానిప్యులేటర్ చేస్తున్నారని అనుకుంటాం. కానీ, మీరు ఇది గమనించారా.. చిన్నారులు ఏడవడం అనేది కూడా వాళ్లకు సంబంధించి అదొక ఎక్స్‌ప్రెషన్ అని తెలుసుకోండి.
బాధ కలిగినా, భయం కలిగినా వాళ్లు ఒకే ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతారు. అదే ఏడవడం. చాలా మంది చిన్నారుల్లో జరిగే విషయం ఇదే. అది అర్థం చేసుకోలేక తల్లిదండ్రులు తమ పిల్లలు ఏదో మానిప్యులేషన్ కు ట్రై చేస్తున్నారని పట్టించుకోకుండా, ఇంకా మొండిపిల్లలుగా అయ్యేందుకు కారణమవుతారు.
ముందు మీలో నుంచి పిల్లలు మనల్ని మానిప్యులేటర్ చేస్తున్నారనే ఫీలింగ్ తీసి పక్కకుపెట్టేయండి. దానికి బదులుగా వారి సమస్య ఏంటో తెలుసుకోవడానికి ఇంటరెస్ట్ చూపించండి. అలా చేయడం వల్ల వారి ఏడుపును వెంటనే ఆపిన వారే కాకుండా, మనసుకు దగ్గర కూడా అవుతారు.
పరిస్థితి చేజారిపోయినప్పుడు మనుషులు చేసే పని ఏడవడం అని అర్థం చేసుకోండి. జీవితంలో మనకు అకస్మాత్తుగా ఏదైనా మార్పు జరిగినప్పుడు మనం చూపించే ఎక్స్‌ప్రెషన్ ఏడవడం. అది ఫ్రస్ట్రేషన్ కావొచ్చు, ఎమోషనల్ అవసరాలు కావొచ్చు. ఏవైనా అకస్మాత్తుగా జరిగే మార్పులకు ఏడుపు కామన్ గా వస్తుంది.
పిల్లలు ఏడవడానికి పలు కారణాలుండొచ్చు.
పిల్లలతో సన్నిహితంగా ఉంటూ ఏ పరిస్థితిలో ఏడుస్తున్నారో, ఎందుకు ఏడుస్తున్నారో గమనించండి. ఆ వివరాలన్నీ రాసిపెట్టుకుంటూ ఏయే విషయాల పట్ల వారిలా రియాక్ట్ అవుతున్నారో నమోదు చేసుకోండి.
పిల్లలు స్కూల్లో ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోండి. ఇంట్లో, స్కూల్లో వారు వ్యవహరిస్తున్న తీరులో మార్పులు గమనించండి. మీకేమైనా తేడాగా అనిపిస్తే చిన్నారులను ట్రీట్ చేసే వైద్యుల్ని కలిసి సలహా తీసుకోండి.
సంబంధిత కథనం