Viagra Tablet In alcohol : మందులో వయాగ్రా టాబ్లెట్స్.. తర్వాత ఏమైందంటే?-man pops two viagra tablets with alcohol found dead a day later details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Man Pops Two Viagra Tablets With Alcohol Found Dead A Day Later Details Inside

Viagra Tablet In alcohol : మందులో వయాగ్రా టాబ్లెట్స్.. తర్వాత ఏమైందంటే?

HT Telugu Desk HT Telugu
Mar 07, 2023 02:52 PM IST

Viagra Tablet In alcohol : అంగస్తంభన కోసం వయాగ్రా టాబ్లెట్స్ ఉపయోగిస్తుంటారు. అయితే వాటిని ఓ వ్యక్తి మందులో వేసుకుని తాగాడు. ఆ తర్వాత దారుణం జరిగింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

మద్యంతో పాటు ఓ వ్యక్తి వయాగ్రా(Viagra)ను ఉపయోగించాడు. ఈ కారణంగా 41 ఏళ్ల ఆ వ్యక్తి మృతి చెందాడు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఓ వ్యక్తి మద్యంతో పాటు అంగస్తంభన కోసం వయాగ్రా రెండు మాత్రలను తీసుకున్నాడు. అతని మెదడు(Mind)లో తీవ్రమైన రక్తస్రావంతో ఒక రోజు తర్వాత మృతిచెందాడు.

న్యూఢిల్లీలోని ఆల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన ఆరుగురు పరిశోధకుల బృందం పీర్-రివ్యూడ్ జర్నల్ ఆఫ్ ఫోరెన్సిక్ అండ్ లీగల్ మెడిసిన్‌కు సమర్పించిన కేసు నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో పరిశోధకులు తమ పరిశోధనలను సమర్పించారు. ఈ వారం ప్రారంభంలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచబడిన వారి కేసు నివేదిక ప్రస్తుతం ప్రీ-ప్రూఫ్ దశలో ఉంది. అంటే ఇది ప్రచురణ కోసం ఆమోదించబడింది. అయితే ఇది జర్నల్‌లో ముద్రణలో ప్రచురించబడటానికి ముందు కొన్ని మార్పులను చేసే అవకాశం ఉంది.

ఈ కేసు నివేదికలో 41 ఏళ్ల వ్యక్తికి గతంలో ఆరోగ్య సమస్యలు(Health Problems), శస్త్రచికిత్సలు జరిగిన చరిత్ర లేదని తెలిసింది. ఒక మహిళా స్నేహితురాలితో అతడు హోటల్‌లో ఉన్నాడని పరిశోధకులు గమనించారు. అక్కడ అతను వయాగ్రా టాబ్లెట్స్(Viagra Tablets) రెండు.. 50 మిల్లీగ్రాముల మాత్రలను తీసుకున్నాడు. మందులో వాటిని కలుపుకొని తాగాడు.

మరుసటి రోజు ఆ వ్యక్తి అసౌకర్యానికి గురయ్యాడు. ఆసుపత్రికి వెళ్లాడు. ఆ తర్వాత అక్కడే చనిపోయాడు. మెదడులో అధిక రక్తస్రావం కారణంగా మనిషి చనిపోయాడని తరువాత వైద్య పరీక్షల్లో తెలిసింది. అతని శవపరీక్షలో మెదడులో 300 గ్రాముల గడ్డకట్టిన రక్తం ఉన్నట్లు వెల్లడైంది. గుండె(Heart) గోడలు గట్టిపడటం, అతని కాలేయం, మూత్రపిండాలు కొంత దెబ్బతిన్నాయని కూడా వెల్లడైంది. వైద్య పర్యవేక్షణ లేకుండా వయాగ్రా వాడకం వల్ల కలిగే ప్రభావం గురించి ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. వయాగ్రా మీ లైంగిక కార్యకలాపాలను మాత్రమే పెంచుతుంది, లైంగిక సంతృప్తిని కాదు.

వయాగ్రా గురించి వైద్యుడు సిఫార్సు చేసిన విధంగానే తీసుకోవాలి. కానీ ఒక వ్యక్తి వయాగ్రాను ఎక్కువగా తీసుకుంటే, అతను అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. సాధారణ మోతాదు కంటే.. ఎక్కువగా తీసుకుంటే.. ప్రియాపిజం వైపు దారి తీస్తుంది. దీంతో ఎప్పుడూ అంగస్తంభన జరిగే ఉంటుంది.

వయాగ్రా పురుషాంగం మరియు శరీరంలోని ఇతర భాగాలను ప్రభావితం చేస్తుంది. అయితే ప్రియాపిజం వస్తే మాత్రం.. దాచుకునేందుకే కాదు.. ఆరోగ్య సమస్యలు కూడా అధికంగా వస్తాయి. సుదీర్ఘమైన అంగస్తంభన పురుషాంగం కణజాలాలకు శాశ్వత నష్టానికి దారితీస్తుంది. వయాగ్రా సూచించిన మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటే మీ రక్తపోటు గణనీయంగా తగ్గుతుంది. గుండెపోటు వంటి గుండె సమస్యలకు కూడా దారి తీస్తుంది.

WhatsApp channel