Malai Lassi | మసాల విందు మంటను, పసందైన లస్సీతో చల్లబరచండి!-malai lassi to keep your stomach cool after your spicy meal ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Malai Lassi | మసాల విందు మంటను, పసందైన లస్సీతో చల్లబరచండి!

Malai Lassi | మసాల విందు మంటను, పసందైన లస్సీతో చల్లబరచండి!

HT Telugu Desk HT Telugu
May 08, 2022 01:32 PM IST

మాంసం లేదా మసాలా ఎక్కువ ఉండే ఆహారం తిన్నప్పుడు కడుపులో ఒక రకమైన మంట మొదలవుతుంది. తిన్నది తేలికగా జీర్ణమవ్వాలంటే ఈ ఎండాకాలంలో లస్సీ ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. చెఫ్ స్పెషల్ లస్సీని ఇలా తయారు చేసుకోండి..

<p>Lassi&nbsp;</p>
Lassi (Unsplash)

చల్లగా ఏదైనా తీసుకుంటే అది అప్పటికప్పుడు మన మనస్సును కూడా చల్లబరుస్తుందని చెప్తారు. అసలే ఎండాకాలం, ఈ వేడి వాతావరణంలో అందరికీ నచ్చే ఏదైనా ఫేవరెట్ డ్రింక్ ఉందీ అంటే అది లస్సీ అని చెప్పవచ్చు. లస్సీ.. దీని పేరు వింటేనే ఒక పులకింతలా ఉంటుంది. మసాలా కలిగిన ఆహారం ఎక్కువ తినేసి ఉంటే ఆ మంటను చల్లార్చటానికి లస్సీ ఒక అద్భుతంలా పనిచేస్తుంది. లస్సీ అందరికీ చేసుకోవడం వచ్చు, అయినప్పటికీ మరికాస్త రుచిగా చేసుకునేందుకు చెఫ్ సరాన్ష్ అందించిన ఒక సింపుల్, స్పెషల్ రెసిపీ ఇక్కడ మీకు తెలియపరుస్తున్నాం. మీరూ ఇలా ప్రయత్నించండి.

మలాయ్ లస్సీకి కావాల్సినవి

  • కప్పు పెరుగు
  • మలాయ్ - 2 టేబుల్ స్పూన్లు
  • పంచదార - 2 టీస్పూన్లు
  • రోజ్ వాటర్- రెండు, మూడు చుక్కలు
  • ఐస్ క్యూబ్స్ - కొన్ని

తయారీ విధానం

  • బ్లెండర్‌లో అన్ని పదార్థాలను వేయండి, ద్రావణం మృదువైనంత వరకు కలపండి.
  • అంతే! ఒక గ్లాస్ తీసుకొని అందులో పైనుంచి కొంచెం మలాయ్ వేసుకోండి.
  • గార్నిషింగ్ కోసం పుదీనా, కుంకుమ పువ్వు, గులాబీ రెమ్మలు కూడా వేసుకోవచ్చు.
  • చల్లచల్లగా మీ మది పరవశించేలా తాగండి.

అరోగ్య ప్రయోజనాలు

జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది: పెరుగులో 'లాక్టోబాసిల్లస్' ఉంటుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణమయ్యేలా ద్రవరూపంలా మారుస్తుంది. దీంతో ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. కడుపులో మంట తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: లస్సీలోని పోషకాలను పరిగణలోకి తీసుకుంటే ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముకలు ఇంకా దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: వేసవిలో వేడి, ఎండ చర్మంపై పలు రకాల ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. లస్సీ తాగడం ద్వారా శరీరానికి లాక్టిక్ యాసిడ్, ఆల్ఫా హైడ్రాక్సీ అందుతుంది. ఇవి చర్మంలోని మృత కణాలను తొలగించి, పోషణ కల్పిస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం