పచ్చి శనగపప్పు, ఆలూ కాంబినేషన్ లో పూరీలు ఎప్పుడైనా ట్రై చేశారా? కొత్త రుచితో పండగకు కొత్తగా ఏదైనా చేయాలంటే ఈ ఆలూ పూరీలు మంచి ఆప్షన్. తయారీ కూడా చాలా సులభం. కావాల్సిన పదార్థాలేంటో చూడండి.
అరకప్పు శనగ పప్పు
ఒక పెద్ద సైజు బంగాళదుంప
రెండు చెంచాల రవ్వ
అరచెంచాడు ఉప్పు
సన్నగా తరిగిన కొత్తిమీర
ఒక టీస్పూన్ కసూరి మెంతి
ఒక టీస్పూన్ పసుపు
పావు టీస్పూన్ కారం పొడి
అర టీస్పూన్ తెల్ల నువ్వులు
2. బాగా నానబెట్టిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి.. అలాగే పచ్చి బంగాళాదుంపలను తొక్కతీసి శుభ్రంగా కడిగి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు కూడా పప్పుతో పాటూ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి.
3. ఈ ముద్దను ఒక ప్లేట్ లోకి తీసుకుని అందులో కాస్త సన్నం రవ్వ కూడా కలుపుకోండి. అందులోనే కొత్తిమీర తరుగు, కసూరీ మేతీ కూడా వేసుకుని కలుపుకోండి.
4. అందులోనే కారం పొడి, ఉప్పు కూడా వేసి అవసరం అయితే మరి కాస్త రవ్వ కలుపుకుని గట్టి పిండిలాగా కలిపేసుకోండి.
5. ఈ ముద్దతో చిన్న చిన్న పూరీలు ఒత్తుకుని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే చాలు. క్రిస్పీ ఆలూ పూరీ రెడీ అయినట్లే.