Idli Recipe: ఓట్స్‌తో పింక్ ఇడ్లీ, పిల్లలు ఇష్టంగా తినే హెల్తీ రెసిపీ-make this simple beetroot pink oats idli recipe for breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Idli Recipe: ఓట్స్‌తో పింక్ ఇడ్లీ, పిల్లలు ఇష్టంగా తినే హెల్తీ రెసిపీ

Idli Recipe: ఓట్స్‌తో పింక్ ఇడ్లీ, పిల్లలు ఇష్టంగా తినే హెల్తీ రెసిపీ

Idli Recipe: బీట్‌రూట్, ఓట్స్ కలిపి చేసే బెస్ట్ ఇడ్లీ రెసిపీ ఇది. అల్పాహారంలోకి హెల్తీగా ఏదైనా తినాలనుకుంటే తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ఈ రెసిపీ తయారీ ఎలాగో, కావాల్సిన పదార్థాలేంటో చూడండి.

బీట్‌రూట్ ఓట్స్ ఇడ్లీ

అల్పాహారం రుచిగా, హెల్తీగానూ ఉండాలి అనుకుంటే ఈ బీట్‌రూట్ ఓట్స్ ఇడ్లీ ట్రై చేయండి. పిండి పులియ బెట్టాల్సిన పనిలేకుండా చాలా సింపుల్‌గా తయారు చేయొచ్చు వీటిని. దీన్ని తయారు చేయడానికి ఎక్కువ సమయం లేదా ఎక్కువ శ్రమ కూడా అక్కర్లేదు. రుచిలో కూడా అద్భుతంగా ఉంటాయి. దీన్ని ఎలా తయారు చేయాలో చూసేయండి.

బీట్ రూట్ ఓట్స్ ఇడ్లీ తయారీకి కావాల్సినవి:
ఓట్స్ పౌడర్ - 1 కప్పు

బీట్‌రూట్స్ 2

సగం కప్పు పెరుగు

ఫ్రూట్ సాల్ట్ లేదా ఈనో సగం టీస్పూన్

అర చెంచాడు ఉప్పు

బీట్ రూట్ ఓట్స్ ఇడ్లీ తయారీ విధానం:

  1. ముందుగా బీట్ రూట్ కూడా తురుముకుని పక్కన పెట్టుకోవాలి.
  2. ఈ పింక్ ఇడ్లీలు తయారు చేయడానికి ఇన్స్టంట్ ఓట్స్ మిక్సీలో పొడి చేసి పెట్టుకోవాలి.
  3. తర్వతా ఈ ఓట్స్ పొడిలోనే ఉప్పు, రవ్వ వేసి మరోసారి మెత్తగా మిక్సీ పట్టేయాలి.
  4. ఈ పొడిని ఒక వెడల్పాటి బౌల్ లోకి తీసుకోవాలి. అందులో ఫ్రూట్ సాల్ట్, పెరుగు, బీట్ రూట్ తురుము కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి.
  5. అన్నీ కలిపాక ఈ మిశ్రమాన్ని ఒక పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి. దాంతో పిండి మొత్తం బాగా నానిపోతుంది.
  6. ఇప్పుడు నీళ్లు పోసి ఇడ్లీ స్టాండ్ పెట్టుకుని ట్రేలకు నూనె రాసుకుని ఇడ్లీలు ఆవిరి మీద ఉడికించుకోవాలి.
  7. తయారైన ఇడ్లీలను కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి.