మాప్ వేసేందుకు ఇంట్లోనే చవకగా ఈ లిక్విడ్ తయారు చేసుకోండి, మరకలు సులువుగా పోతాయి-make this inexpensive mop liquid at home and stains will be removed easily ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మాప్ వేసేందుకు ఇంట్లోనే చవకగా ఈ లిక్విడ్ తయారు చేసుకోండి, మరకలు సులువుగా పోతాయి

మాప్ వేసేందుకు ఇంట్లోనే చవకగా ఈ లిక్విడ్ తయారు చేసుకోండి, మరకలు సులువుగా పోతాయి

Haritha Chappa HT Telugu

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా? అయితే కెమికల్స్ ఉండే లిక్విడ్లతో మాప్ వేయకండి. నేల మీద పడిన ఆహారాన్ని పిల్లలు తెలియక నోట్లో పెడితే వారికి అనారోగ్యం రావచ్చు. కాబట్టి ఇంట్లోనే మాప్ లిక్విడ్ చవకగా తయారు చేయవచ్చు.

మాప్ చేసేందుకు హోమ్ మేడ్ లిక్విడ్ (shutterstock)

రోజూ ఇంట్లోని ఫ్లోర్‌కు మాప్ పెట్టాల్సిందే. ప్రతిరోజూ మాప్ చేయడం వల్ల బ్యాక్టిరియా, వైరస్ వంటివి తొలగిపోతాయి. లేకుంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనం ఫ్లోర్ శుభ్రపరిచే ద్రావణాలు, డిటర్జెంట్లను వాడుతుంటాం. కానీ వీటిలో చాలా రకాల కెమికల్స్ ఉంటాయి. ఇవి శ్వాసకోశానికి హానికరం. మీ ఇంటిని బ్యాక్టీరియా లేకుండా, కెమికల్స్ లేకుండా శుభ్రం చేయాలనుకుంటున్నారా? ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో, పిల్లలు రోజంతా నేలమీద కూర్చుని ఆడుకుంటారు కాబట్టి వాడే లిక్విడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో తయారు చేసే లిక్విడ్ తో మాప్ చేసుకుంటే రసాయనాలు సమస్య ఉండదు. పైగా దీన్ని చాలా తక్కువ ఖర్చుతో తయారుచేయవచ్చు. దీని వల్ల శుభ్రతతో పాటు బ్యాక్టిరియాలు కూడా దూరంగా ఉంటాయి.

ఇంట్లో చవకగా లిక్విడ్ తయారీ

కెమికల్స్ లేని నేల శుభ్రపరిచే ద్రావణాన్ని తయారు చేయాలనుకుంటున్నారా? అయితే తక్కువ ఖర్చుతో ఈ పదార్థాలతో తయారు చేసుకోండి. దానికి కావాల్సిన వస్తువులు బేకింగ్ సోడా, కర్పూరం, వెనిగర్, నీళ్లు, పటిక బెల్లం. దీన్ని తయారుచేయడానికి ఒక బాటిల్ నాలుగు పెద్ద కర్పూరం ముక్కలు, నాలుగు స్పూన్ల బేకింగ్ సోడా, వందగ్రాముల పటిక బెల్లం, నాలుగు స్పూన్ల వెనిగర్ , ఒక గ్లాసు నీరు వేసి బాగా కలపండి. రాత్రంతా దాన్ని అలా వదిలేయండి. నీటిలో అవన్నీ బాగా కరిగిపోతాయి. ఇందులో మనం వాడినవన్నీ చాలా చవకైనవే. ఉదయానికి ఈ లిక్విడ్ వాడడానికి సిద్ధమైనట్టే. ఈ ద్రావణాన్ని నీటిలో కలిపి ఇంట్లో మాప్ పెట్టేందుకు ప్రయత్నించండి. ఇందులోనే మనం కర్పూరం కాబట్టి మంచి సువాసన వేస్తుంది.

మాప్ వేసేందుకు తీసుకున్న ఆ నీటిలో నిమ్మరసం కలిపినా మంచిదే. నిమ్మలో సహజంగానే క్లీనింగ్ లక్షణాలు ఉన్నాయి.దీనిలో మైక్రోబయల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి మాప్ చేసే నీటిలో పైన తయారుచేసిన లిక్విడ్ తో పాటూ నిమ్మరసం కూడా వేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మాప్ చేసే నీటిలో బేకింగ్ సోడా కూడా మంచిదే. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మాప్ చేసే నీటిలో బేకింగ్ సోడా వేసి ఇంటికి మాప్ చేస్తే జిడ్డు త్వరగా పోతుంది. నూనె మరకలు కూడా పోతాయి.ఎసెన్షియల్ ఆయిల్ కలపడం వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం