ఎండకాలం వస్తే చాలు వడియాలు, ఊరగాయలు, అప్పడాలు, ఆవకాయలు, నిల్వ పచ్చళ్లు పెట్టేందుకు మహిళలు సిద్ధమైపోతారు. అప్పడాల పెట్టడం మాత్రం అందరికీ రాదు. వాటిని చేయడం కూడా కష్టం అనుకుంటారు. మేము చాలా సింపుల్ గా అన్నం, బంగాళాదుంపలతో అప్పటికప్పుడు అప్పడాలు ఎలా చేయాలో తెలుసుకోండి.
ఈ అప్పడాలను రెండు మూడు రోజులు ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్కరోజులోనే అప్పడాలను తయారుచేసి నిల్వ చేసుకోవచ్చు. ఇన్‌స్టంట్ అప్పడాలను తయారుచేసే విధానం గురించి తెలుసుకోండి.
జీలకర్ర - ఒక స్పూను
ఇంగువ - చిటికెడు
వండిన అన్నం - ఒక కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - రెండు కప్పులు
1. అన్నం అప్పడాలు చేసేందుకు ముందుగా 2 కప్పుల నీటిని ఒక పాత్రలో మరిగించండి.
2. ఆ తర్వాత నీటిలో రుచికి తగినంత ఉప్పు, చిటికెడు ఇంగువ, చిన్న చెంచా జీలకర్ర వేసి మరిగించండి.
3. నీరు మరుగుతున్నప్పుడు అందులో ఒక కప్పు వండిన అన్నం వేసి నిరంతరం కలుపుతూ ఉండండి. గడ్డలు ఏర్పడకుండా చూసుకోండి.
4. ఈ మిశ్రమం మందంగా మారే వరకు కలిపి తరువాత స్టవ్ ఆఫ్ చేసేయండి.
5. ఆ మిశ్రమం చల్లారాక చేతులకు కాస్త నీటిని రాసుకుని చిన్న అన్నం ముద్దను తీసుకోంది.
6. చేత్తోలనే ఆ ముద్దను అప్పడాల్లా వత్తుకుని ఒక ప్లాస్టిక్ షీట్ పై పెట్టండి.
7. ఇలా అన్నీ చేశాక ఎండలో లేదా ఫ్యాన్ కింద 8 గంటలు ఎండబెట్టండి.
8. ఎండిపోయిన తర్వాత వాటిని నూనెలో వేయించి తినవచ్చు.
బంగాళాదుంపలు - మూడు
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాల పొడి - అర స్పూను
ఇంగువ - చిటికెడు
నీరు - తగినంత
అరటి పిండి - అర కప్పు
ఇక్కడ మేము చెప్పిన రెండు రకాల అప్పడాలు చేయడం చాలా సులువు. అంతేకాదు ఒకరోజులోనే తినేందుకు సిద్ధమైపోతాయి. కాబట్టి వీటిని ప్రయత్నించి చూడండి.
టాపిక్