కారప్పూసను సింపుల్‌గా గోధుమపిండితో చేసేయండి, క్రంచిగా క్రిస్పీగా వస్తుంది
కారప్పూస పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది బియ్యప్పిండితో చేసేవి లేదా శెనగపిండితో చేసేదే. ఇక్కడ మేము గోధుమపిండితో క్రంచీగా ఎలా చేయాలో చెప్పాము.
ప్రతి స్వీట్ షాపులో కారప్పూస ఖచ్చితంగా ఉంటుంది. సన్నగా ఉండే ఈ కారప్పూస అందరికీ నచ్చుతుంది. కారప్పూసలను అధికంగా శెనగపిండితో చేస్తారు, లేదా బియ్యప్పిండితో చేస్తారు. ఇక్కడ మేము గోధుమ పిండితో సింపుల్‌గా ఎలా చేయాలో చెప్పాము. ఈ గోధుమపిండి కారప్పూస రుచిగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. మేము చెప్పిన పద్ధతిలో చేస్తే టేస్టీ కారప్పూస రెడీ అయిపోతుంది.

గోధుమ పిండితో కారప్పూస రెసిపీకి కావలసిన పదార్థాలు
గోధుమపిండి - రెండు కప్పులు
బియ్యప్పిండి - అర కప్పు
కారం - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
గోధుమపిండి కారప్పూస రెసిపీ
1. గోధుమ పిండితో కారప్పూస చేసేందుకు ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి వేడి నీళ్లు వేసి బాగా వేడి చేయండి.
2. ఇప్పుడు ఒక స్ట్రైనర్ లేదా ప్లేటు తీసుకుని దానిపై ఒక కర్చీఫ్ వేయండి.
3. ఆ కర్చీఫ్‌లో ఈ గోధుమ పిండి బియ్యం పిండి కలిపి వేయండి. ఇప్పుడు ఈ కర్చీఫ్ ను పూర్తిగా కప్పేయండి.
4. ఇప్పుడు ఆ ప్లేటును మరుగుతున్న గిన్నెపైనా ఉంచండి. అంటే ఈ పిండిని ఆవిరికి గురి చేయడం అన్న మాట.
5. అలా ఆవిరి మీద ఉంచాక ఒక పావుగంట తర్వాత తీసేయండి.
6. ఆ పిండిని చేతితోనే గట్టిగా నలిపి ఒకసారి జల్లెడ పట్టండి.
7. జల్లెడ పట్టిన పిండిని ఒక ప్లేట్లో వేయండి. ఆ ప్లేట్లో ఉప్పు, కారం రెండు స్పూన్ల నూనె వేసి బాగా కలపండి.
8. ఇప్పుడు గట్టిగా చపాతీ పిండిలా కలుపుకోవడానికి కాస్త నీళ్లు వేసి బాగా కలుపుకోండి.
9. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేసి వేడెక్కించండి.
10. ఈలోపు కారప్పూస చేసేందుకు తీసుకొని ఈ గోధుమ పిండి మిశ్రమాన్ని అందులో వేసి సన్నని రంధ్రాలు కల చక్రాన్ని పెట్టండి.
11. రెండువైపులా కాలిన తరువాత తీసి పక్కన పెట్టుకోండి.
12. చేతితోనే ఆ జంతికను నలిపేసి కారప్పూసలా చేసుకోండి.
13. ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఇప్పుడు ఒకేలా కాకుండా ఈ కారపూసలు ఇలా కొత్త పద్ధతిలో చేస్తే రుచి కూడా కొత్తగా అనిపిస్తుంది.
పండగల్లో ఇంటికి వచ్చిన అతిథులకు ఇచ్చేందుకు, పిల్లలకు సాయంత్రం పూట స్నాక్ లా అందించేందుకు ఈ కారప్పూస అద్భుతంగా ఉంటుంది. మేము చెప్పిన పద్ధతిలో కారప్పూస చేసి తింటే రుచి మాములుగా ఉండదు. ఇవి ఒకసారి చేసుకుంటే మూడు వారాలు పాటు తాజాగా ఉంటాయి. ఒకసారి ప్రయత్నించి చూడండి.
టాపిక్