Sankranti Recipe: చెరుకు రసంతో తీపి జంతికలు సంక్రాంతి స్పెషల్ గా చేసేయండి, రెసిపీ ఇదిగో
Sankranti Recipe: సంక్రాంతికి స్పెషల్‌గా తీపి వంటకాలను చేస్తారు.ఎప్పుడూ ఒకేలాంటివి కాకుండా ఈసారి తీపి జంతికలు ప్రయత్నించండి.
సంక్రాంతి పేరు చెబితే గుర్తొచ్చేవి జంతికలు, అరిసెలు, సున్నుండలు, సకినాలు వంటివి. ఇక్కడ మేము ప్రత్యేకంగా తీపి జంతికల రెసిపీ ఇచ్చాము. వీటిని తీపి మురుకులు అని కూడా పిలుస్తారు. ఈ తీపి మురుకులు చేయడం చాలా సులువు. చెరుకు రసంతో చేసే ఈ మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కూడా ఇవి బాగా నచ్చుతాయి. కారం జంతికలు నచ్చని వారికి ఇలా తీపి జంతికలు పెట్టి చూడండి. కొత్తగా టేస్టీగా ఉంటాయి. సంక్రాంతికి అతిథులకు వడ్డించేందుకు ఇవి బెస్ట్ స్వీట్ అని చెప్పుకోవచ్చు.
తీపి జంతికలు రెసిపీకి కావలసిన పదార్థాలు
బియ్యప్పిండి - ఒక కప్పు
నువ్వులు - ఒక స్పూను
ఉప్పు - ఒక స్పూను
అరకప్పు - నూనె
డీప్ - ఫ్రై చేయడానికి సరిపడా
బటర్ - రెండు స్పూన్లు
తీపి జంతికలు రెసిపీ
1. తీపి జంతికలు చేసే ముందు ఒక గిన్నెలో బియ్యప్పిండి వేయండి.
2. అందులోనే నువ్వులు, ఉప్పు, బటర్ వేసి బాగా కలపండి.
3. తర్వాత అందులో చెరుకు రసాన్ని కొద్దికొద్దిగా వేస్తూ చపాతీ పిండి కలుపుకున్నట్టుగా కలపండి.
4. ఇది మరీ పలుచగా రాకూడదు, అలాగని మందంగా కూడా రాకూడదు.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయండి.
6. ఇప్పుడు జంతికల గొట్టాన్ని తీసుకొని లోపల కలుపుకున్న పిండిని పెట్టండి.
7. నూనెలో మురుకులు లేదా జంతికల్లా వేసుకోండి.
8. రెండు వైపులా రంగు మారేవరకు డీప్ ఫ్రై చేసుకోండి.
9. తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అంతే టేస్టీ మురుకులు లేదా చెరుకు జంతికలు రెడీ అయినట్టే. ఇవి కొత్తగా ఉంటాయి. అందరికీ నచ్చుతాయి. పిల్లలు ఇష్టంగా తింటారు.
దీనిలో మనం ముఖ్యంగా చెరుకు రసము, బియ్యప్పిండి వాడాము. ఈ రెండూ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవి. తీపి జంతికల కోసం ఎంతోమంది పంచదార పాకాన్ని కూడా కలుపుతూ ఉంటారు. పంచదార పాకంతో పోలిస్తే చెరుకు రసమే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పైగా సహజమైన రుచిని అందిస్తుంది. ఒక్కసారి మీరు ఈ చెరుకు రసంతో మురుకులు తయారు చేసి చూడండి. మీకు ఎంతో నచ్చడం ఖాయం.
సంబంధిత కథనం