Fruits For Skin: మెరిసే చర్మం కావాలా? అయితే మీ డైట్లో ఈ పండ్లు తప్పకుండా ఉండేలా చూసుకోండి!-make sure to include these collagen boosting fruits for glowing skin in your diet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fruits For Skin: మెరిసే చర్మం కావాలా? అయితే మీ డైట్లో ఈ పండ్లు తప్పకుండా ఉండేలా చూసుకోండి!

Fruits For Skin: మెరిసే చర్మం కావాలా? అయితే మీ డైట్లో ఈ పండ్లు తప్పకుండా ఉండేలా చూసుకోండి!

Ramya Sri Marka HT Telugu
Jan 19, 2025 01:00 PM IST

Fruits For Skin: కాంతివంతమైన చర్మం మీ లుక్కే మార్చేస్తుంది. ప్రత్యేకంగా మెడిసిన్లు, క్రీములు రాసుకుంటేనే చర్మాన్ని మెరుగుపరుచుకోవచ్చని అనుకోవద్దు. మనం తినే ఆహారంతో కూడా సాధ్యపడుతుందట. కొన్ని పండ్లలో దొరికే కొల్లాజెన్ మీ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. అవేంటో చూద్దామా..

మెరిసే చర్మం కోసం మీ డైట్లో ఈ పండ్లు తప్పక ఉంచండి
మెరిసే చర్మం కోసం మీ డైట్లో ఈ పండ్లు తప్పక ఉంచండి

చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ, దాని కోసం క్రీములు, ప్రత్యేకమైన మెడిసిన్లు వాడటానికి చాలా మంది ఇష్టపడరు. అటువంటి రసాయనాలేమీ లేకుండా కూడా మీ చర్మం కాంతివంతంగా మారుతుందంటే, ట్రై చేయకుండా ఉండగలమా.. రండి కేవలం ఈ పండ్లు తిని చర్మపు కాంతిని మెరుగుపరుచుకోండి. పండ్లలో దొరికే కొల్లాజెన్ అనే ప్రొటీన్ తో చర్మ నిర్మాణాన్ని బలపరుచుకోండి. ఈ ప్రొటీన్ చర్మంలోని స్థితిస్థాపకత సామర్థ్యాన్ని పెంచి కాంతివంతంగా మారుస్తుంది.

yearly horoscope entry point

1) నారింజ: నారింజలో విటమిన్ సి ఉంటుంది, ఇది శరీరానికి నష్టం జరగకుండా కాపాడుతుంది. కాలుష్య కారకాలు, సూర్యరశ్మికి గురికావడం వల్ల చర్మం నిస్తేజంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో, నారింజ ముఖంపై ప్రకాశవంతమైన కాంతిని తీసుకురావడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు నారింజ పండ్లు తినడం వల్ల నల్ల మచ్చలు, మొటిమల వల్ల కలిగిన మచ్చలు తగ్గుతాయి.

తినడమే కాకుండా పండ్లతో ఇలా కూడా చేయొచ్చు: నారింజ రసాన్ని నేరుగా ముఖంపై అప్లై చేసి ఒక 15-20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రపరిచినట్లయితే, చర్మంపై మంచి ప్రకాశం ఉంటుంది.

2) బెర్రీలు: స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్బెర్రీలు, బ్లాక్బెర్రీలు, క్రాన్బెర్రీలు వంటి అన్ని రకాల బెర్రీలు కొల్లాజెన్ అధికంగా ఉండే రుచికరమైన పండ్లు. అన్ని బెర్రీలలో ముఖ్యమైన విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మానికి చాలా ప్రయోజనకరం. ఈ బెర్రీలలో ఎలాజిక్ యాసిడ్ ఉంటుంది, ఇది మీ చర్మాన్ని అతినీల లోహిత కిరణాల వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తుంది.

తినడమే కాకుండా పండ్లతో ఇలా కూడా చేయొచ్చు: బెర్రీల క్విక్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. బెర్రీలను మెష్ చేసి, దీనిని చర్మంపై సున్నితంగా రాసుకుంటే, చర్మం మెత్తగా మారుతుంది.

3) ఉష్ణ మండల పండ్లు: పైనాపిల్, కివీ, ప్యాషన్ ఫ్రూట్, మామిడి, జామ వంటి పండ్లు కొల్లాజెన్‌ను పెంచుతాయి. ఇవి రుచికరమైనవి మాత్రమే కాదు, మీ శరీరానికి అంతర్గతంగా పోషణను కూడా అందిస్తాయి. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అదనంగా, బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసే లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. (ఎక్స్‌ఫోలియేషన్ అంటే చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించే ప్రక్రియ)

తినడమే కాకుండా పండ్లతో ఇలా కూడా చేయొచ్చు: పైనాపిల్ మాస్క్ చర్మం పై చల్లదనం మరియు తేమను ఇచ్చేలా ఉంటుంది.

4) ద్రాక్షపండు: ద్రాక్షపండులో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉంటాయి. ఇది చర్మం వాతావరణ పరిస్థితులకు తట్టుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ద్రాక్షపండు తినడం వల్ల హై అల్యూరోనిక్ యాసిడ్‌ను భర్తీ చేయడంలో సహాయపడుతుంది, తద్వారా మీరు ఎక్కువ కొల్లాజెన్‌ను పెంచుకోవచ్చు.

తినడమే కాకుండా పండ్లతో ఇలా కూడా చేయొచ్చు: ద్రాక్ష రసాన్ని ముఖంపై అప్లై చేసి 15 నిమిషాల పాటు ఉంచడం ద్వారా మీరు కాంతివంతమైన చర్మం పొందవచ్చు.

5) అవకాడో: ఈ పండు రుచికరమైనదే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. అవకాడో తినడం వల్ల చర్మం వాతావరణ పరిస్థితులకు తట్టుకోగల సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. అంతేకాకుండా చర్మం మృదువుగా మారుతుంది. ఇందులో విటమిన్ E, విటమిన్ C వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కొల్లాజెన్‌ను పెంచడంలో సహాయపడతాయి.

తినడమే కాకుండా పండ్లతో ఇలా కూడా చేయొచ్చు: అవకాడో మాస్క్‌ను తయారుచేసుకుని, దాన్ని ముఖంపై ఒక 20-30 నిమిషాలపాటు ఉంచితే, చర్మం ఉత్సాహభరితంగా మారుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం