Tomato Chutney: కాల్చిన వంకాయ టమోటాలతో స్పైసీ చట్నీ ఇలా చేసేయండి, అన్నం ఇడ్లీ దోశలతో తినేయచ్చు
Tomato Chutney: వంకాయ, టమోటాలతో రుచికరంగా ఉండే స్పైసీ చట్నీ చేసేయవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీన్ని అన్నంలో ఇడ్లీలో దోశెల్లో తినవచ్చు. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
తెలుగిళ్లల్లో పచ్చళ్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. స్పైసీ చట్నీ ఉంటే కూరలు కూడా అవసరం లేదు. ఓసారి వంకాయ టమోటా పచ్చడి కూడా చేసుకుని చూడండి రుచి అదిరిపోతుంది. ఇక్కడ మేము వంకాయ, టమోటాలను కాల్చి పచ్చడి ఎలా చేయాలో ఇచ్చాము. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోనే కాదు దోశలు, ఇడ్లీల్లో కూడా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంతో తింటే రుచి బాగుంటుంది. దీన్ని చేయడం చాలా సులభం.
వంకాయ టమోటా పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
వంకాయలు - నాలుగు
టమోటాలు - రెండు
ఉల్లిపాయ - ఒకటి
నూనె - రెండు స్పూన్లు
మెంతులు - చిటికెడు
మినపప్పు - ఒక స్పూను
పచ్చిమిర్చి - రెండు
మిరియాల పొడి - పావు స్పూను
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
ఆవాలు - ఒక స్పూను
ఇంగువ - చిటికెడు
ఎండు మిర్చి - రెండు
పచ్చి శెనగపప్పు - ఒక స్పూను
వంకాయ టమోటో పచ్చడి రెసిపీ
- వంకాయ, టొమాటోలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- గ్యాస్ బర్నర్ చిన్న మంట పెట్టి గ్రిల్ పెట్టి పైన వంకాయలు, టమోటాలను వేసి అన్ని వైపులా కాల్చుకోవాలి.
3. చల్లారిన తర్వాత వంకాయలు, టమోటాలపై ఉన్న నల్లని తొక్కలను తొలగించి ఒక గిన్నెలో వేయాలి.
4. వంకాయలను వేరేగా, టమోటాలను వేరేగా చేత్తోనే మెత్తగా పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి.
6. నూనె వేడి అయ్యాక మెంతులు, మినప్పప్పు వేసి ఆవాలు వేసి వేయించాలి.
7. తర్వాత అందులో పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత ఇంగువ వేయాలి.
8. తర్వాత అందులో నల్ల మిరియాలపొడి వేసి వేయించాలి.
9. ఈ మొత్తం పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
10. అదే మిశ్రమంలో టమోటాలు వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
11. కళాయిలో మిగిలిన నూనెలో ఆవాలు, పచ్చిశెగనపప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత వంకాయ, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.
12. తర్వాత టొమాటో మిశ్రమం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వేసి 5 నిమిషాలు ఉడికించాలి.
13. పైన కొత్తిమీర చల్లితే వేయించిన వంకాయ టమోటాలు చట్నీ రెడీ అయినట్టే.
14. వేడివేడి అన్నంతో తింటే రుచిగా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ తినేలా ఉంటుంది .
వంకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి వారానికి కనీసం రెండు సార్లు వంకాయ తినడం అవసరం. టమోటాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే లైకోపీన్ మన శరీరానికి చాలా అవసరం. ఇది అనేక రకాల క్యాన్సర్లను కూడా నివారిస్తుంది. పోషకాలను కూడా అందిస్తుంది. వంకాయ టమోటా మిశ్రమం పోషకాలను రెట్టింపు చేస్తుంది. మీకు ఈ పచ్చడి స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ పచ్చిమిర్చిని వేయండి. వంకాయ టమాటో పచ్చడి వేడివేడి అన్నంలో కలుపుకుంటే తప్పకుండా నచ్చుతుంది. అంతే కాదు ఇడ్లీ, దోశ, చపాతీలతో తింటే చాలా బాగుంటుంది.