Chicken Lollipop: రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలిపాప్‌లను ఇంట్లోనే తయారు చేసుకోండి: ఈజీగా ఎలా చేయాలో ఇక్కడ ఉంది!-make restaurant style chicken lollipops at home here is an easy recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Lollipop: రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలిపాప్‌లను ఇంట్లోనే తయారు చేసుకోండి: ఈజీగా ఎలా చేయాలో ఇక్కడ ఉంది!

Chicken Lollipop: రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలిపాప్‌లను ఇంట్లోనే తయారు చేసుకోండి: ఈజీగా ఎలా చేయాలో ఇక్కడ ఉంది!

Ramya Sri Marka HT Telugu
Jan 26, 2025 07:00 AM IST

Chicken Lollipop: శనివారం, ఆదివారం వచ్చిందంటే మాంసాహార ప్రియుల ఇళ్లలో రకరకాల వంటకాల వాసనలు వస్తాయి. మీరు చికెన్ ప్రియులైతే, ఈవారం లాలిపాప్ రెసిపీని ట్రై చేయండి. ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలిపాప్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలిపాప్‌లను ఇంట్లోనే తయారు చేసుకోండి:
రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలిపాప్‌లను ఇంట్లోనే తయారు చేసుకోండి: (Canva)

శనివారం, ఆదివారం వచ్చిందంటే మాంసాహార ప్రియుల ఇళ్లలో రకరకాల వంటకాల వాసనలు వస్తాయి. మీరు కూడా చికెన్‌ ప్రియులే అయితే, ఈ వారం ఏదైనా ప్రత్యేకమైనది చేయాలనుకుంటే, చికెన్ లాలిపాప్‌ను ట్రై చేయండి. ఇంట్లోనే చాలా సులభంగా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. మసాలా దినుసులతో మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇంట్లోనే చికెన్ లాలిపాప్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

yearly horoscope entry point

చికెన్ లాలిపాప్ రెసిపీ ఇక్కడ ఉంది

కావలసిన పదార్థాలు:

  • చికెన్ (రెక్కలు లేదా కాళ్లు)- 1 కిలో,
  • మిరపకాయల పొడి- 3 టేబుల్ స్పూన్లు,
  • నల్ల మిరియాల పొడి- 1 టేబుల్ స్పూన్,
  • ఉప్పు- రుచికి తగినంత
  • నిమ్మరసం- 1 టేబుల్ స్పూన్,
  • అల్లం-వెల్లుల్లి పేస్ట్- 2 టేబుల్ స్పూన్లు,
  • గరం మసాలా- 1 టేబుల్ స్పూన్,
  • సోయా సాస్- 2 టేబుల్ స్పూన్లు,
  • మైదా పిండి- 1 కప్పు,
  • కార్న్ ఫ్లోర్- 1 కప్పు,
  • నూనె- డీప్ ఫ్రైరి సరిపడా

చికెన్ లాలిపాప్ తయారీ విధానం:

  1. ముందుగా చికెన్‌ను బాగా కడిగి శుభ్రం చేసుకోండి. దుకాణం నుండి చికెన్ తెచ్చేటప్పుడు చికెన్ లాలిపాప్ కోసమే అని చెప్పి కట్ చేయించండి. దానికి అనుగుణంగా ఉండే ఆకారంలో కోసి ఇస్తారు.
  2. తర్వాత ఈ చికెన్‌కు నిమ్మరసం, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల మిరపకాయల పొడి, గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, నల్ల మిరియాల పొడి, సోయా సాస్ కలిపి బాగా కలపాలి.
  3. దీన్ని 10 నుండి 15 నిమిషాలు మూత పెట్టి ఉంచండి.
  4. ఈలోగా మరో పాత్రలో మైదా పిండి, కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మిరపకాయల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కొద్దిగా నీరు కలిపి బాగా కలపాలి.
  5. ఈ మిశ్రమం గట్టిగా కాకుండా చాలా పలుచగా కాకుండా కలపండి. దీన్ని 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేసి ఉంచాలి.
  6. తర్వాత దాంట్లో చికెన్ ముక్కలను వేసి కలపాలి. మళ్ళీ 10 నిమిషాలు పాటు వీటిని మూత పెట్టి ఉంచండి.
  7. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి వేయించడానికి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి.
  8. నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటిగా చికెన్ ముక్కలను వేయించాలి. 5 నుండి 6 నిమిషాలు వేయించాలి.
  9. తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి.
  10. క్రిస్పీగా, రుచికరమైన చికెన్ లాలిపాప్ తినడానికి రెడీ అయినట్టే. ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. దీన్ని టమాటా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది.

Whats_app_banner