Veg Keema Recipe: పిల్లల కోసం పంజాబీ స్టైల్ వెజ్ కీమా చేసి పెట్టండి, ఇది నాన్‌వెజ్ కీమా కన్నా రుచిగా ఉంటుంది!
Veg Keema Recipe: కీమా అంటే కేవలం నాన్‌వెజ్‌తో మాత్రమే చేస్తారు అనుకుంటే మీరు పొరపడ్డట్టే. వెజ్‌తో కూడా రుచికరమైన కీమా తయారు చేసుకోవచ్చు. నాన్ వెజ్ కి దూరంగా ఉంటూ ఈ రేంజ్ ఫుడ్ ను ఎంజాయ్ చేయాలనుకుంటే మీకు ఈ పంజాబీ స్టైల్ వెజ్ కీమా చాలా బాగా పనికొస్తుంది. ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకొవచ్చు.

కీమా అంటే మటన్ గుర్తుకు వస్తుంది. అలాగని కేవలం నాన్‌వెజ్‌తో మాత్రమే కీమా తయారు చేస్తారనుకోకండి. వెజ్‌తో కూడా అద్భుమైన, అమోఘమైన కీమా కర్రీని తయారు చేసుకోవచ్చు. నాన్‌వెజ్ తినీ తినీ బోర్ కొట్టిన వారికైనా, కాస్త బ్రేక్ ఇచ్చి వెజ్‌తోనే మంచి రుచిని కోరుకునే వారికి ఈ వెజ్ కీమా బెస్ట్ ఆప్షన్. పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా కూడా తింటారు. చేసుకోవచ్చు. రకరకాల కూరగాయలతో తయారు చేసే వెజ్ కీమా రుచికే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది. అంతేకాదు.. మటన్ కీమా, చికెన్ కీమా కంటే వెజ్ కీమా రెట్టింపు పోషకాలను అందిస్తుంది. పంజాబీ స్టైల్ స్పెషల్ కీమా రెసిపీని ఇంట్లోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. అన్నం, రోటీ, చపాతీలు అన్నింటికీ ఇది మంచి కాంబినేషన్. వెజ్ కీమాను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి.
వెజ్ కీమా తయారీకి కావాల్సిన పదార్థాలు:
- క్యారెట్ తురుము - అరకప్పు,
- క్యాప్సికం- అర కప్పు,
- టొమాటో - 3,
- బఠాణీలు - అరకప్పు,
- కొత్తిమీర తరుగు - అరకప్పు,
- జీలకర్రపొడి - అరకప్పు,
- కసూరి మెంతి - 1 టీస్పూన్,
- ఉప్పు - రుచికి తగినంత,
- వెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్లు,
- నూనె - తగినంత,
- నెయ్యి - 2 టీస్పూన్లు,
- నీరు - తగినంత
వెజ్ కీమా తయారు చేసే విధానం:
వెజ్ కీమా తయారీ కోసం ముందుగా టామోటో, క్యాప్సికం లను తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. మీకు కావాలంటే నచ్చిన ఇతర కూరగయాలను కూడా వేసుకోవచ్చు.
తర్వాత ఈ రెండింటినీ మిక్సీ గిన్నెలో వేసి చిక్కటి పేస్టులా తయారు చేసి పక్కన పెట్టండి.
ఇప్పుడు ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టి దాంట్లో నూనె, నెయ్యి వేసి వేయించండి.
నూనె కాస్త వేడెక్కిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చీ, జీలకర్ర, వేసి వేయించండి.
ఇవి కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి. ఉల్లిముక్కలు రంగు మారేంత వరకు వేయించండి.
ఉల్లిపాయ ముక్కలు బంగారు రంగులోకి మారిన తర్వాత దాంట్లో కారంపొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపండి.
ఇవి కాసేపు నూనెలో వేగిన తర్వాత దీంట్లో ముందుగా మనం మిక్సీలో వేసి తయారు చేసుకున్న క్యాప్సికం, టమాటో పేస్టును వేసి కలపండి.
ఈ మిశ్రమం కాసేపు నూనెలో వేగిన తర్వాత దీంట్లోనే పచ్చి బఠానీలు వేసి వుయించండి.
బఠాణీలను కాసేపు వేయించిన తర్వాత దీంట్లోనే కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి నూనె తేలేంత వరకూ ఉడికించండి. చిన్న మంట మీద మాత్రమే ఉడికించాలి.
నూనె పైకి తేలిన తర్వాత దీంట్లో కసూరి మెంతులు, కొత్తిమీర, ధనియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి.
అంతే రుచికరమైన వెజ్ కీమా రెడీ అయినట్టే. అన్నం, రోటీ, చపాతీలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.ఈ వెజ్ కీమా ట్రై చేయండి. మీకు ఇది తప్పకుండా నచ్చుతుంది.
వెజ్ కీమా మసాలాలో ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలు ఎన్నో ఉన్నాయి.ఇవి శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తాయి.టమోటా, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అద్భుతమైన రుచి కలిగిన ఈ వెజ్ కీమా ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.
సంబంధిత కథనం