నిమ్మకారం పేరు చెబితేనే ఎంతోమందికి నోరూరిపోతుంది. దీన్ని తిన్నారంటే మీరు మర్చిపోలేరు. ముఖ్యంగా వేడి వేడి అన్నంలో కలుపుకుని నిమ్మకారం తింటే అద్భుతంగా ఉంటుంది. నోరు చప్పగా అనిపించినప్పుడు కూడా ఇలా నిమ్మకారాన్ని చేసి తినేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు నోటికి ఎలాంటి టేస్టు తెలియదు. అలాంటి వారు ఇలా నిమ్మకారాన్ని చేసుకుని తినడం వల్ల ఉపయోగం ఉంటుంది.
ఎండుమిర్చి - రెండు
నిమ్మకాయలు - రెండు
కారం - రెండు స్పూన్లు
ఉప్పు - ఒక స్పూను
ఆవ పిండి - పావు స్పూను
మెంతిపిండు - చిటికెడు
ధనియాల పొడి - పావు స్పూను
జీలకర్ర పొడి - పావు స్పూను
నూనె - రెండు స్పూన్లు
ఆవాలు - అర స్పూను
జీలకర్ర - అర స్పూను
కరివేపాకులు - గుప్పెడు
వెల్లుల్లి రెబ్బలు - ఐదు
ఇంగువ - చిటికెడు
1. ఐదు నిమిషాల్లో నిమ్మకారాన్ని రెడీ చేసేసుకోవచ్చు.
2. ఇందుకోసం మీరు రెండు నిమ్మకాయలను తీసుకొని కట్ చేసి ఒక గిన్నెలో ఆ నిమ్మరసాన్ని పిండండి.
3. ఇప్పుడు ఆ నిమ్మ రసంలో కారం, పసుపు, ఉప్పు వేసి కలపండి.
4. అలాగే మెంతి పొడి, ధనియాల పొడి, ఆవ పొడి కూడా వేసి బాగా కలుపుకోండి.
4. ఇప్పుడు దానికి పోపు పెట్టేందుకు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేయండి.
5. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి వేయించండి.
6. అలాగే రెండు ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకులు కూడా వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని నిమ్మ మిశ్రమంపై వేయండి. దీన్ని బాగా కలపండి.
7. అంతే నిమ్మకారం రెడీ అయినట్టే ఐదు నిమిషాల్లో దీన్ని రెడీ చేసుకోవచ్చు. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
నిమ్మకాయ రెసిపీలు తినడం వల్ల మన శరీరానికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. నిమ్మకాయ మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి నిమ్మకాయ రెసిపీలు అప్పుడప్పుడు ఆహారంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
బరువు తగ్గాలనుకున్న వేరే నిమ్మకాయను గోరువెచ్చని నీటిలో వేసి తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చర్మ రక్షణకు కూడా నిమ్మకాయ ముందుంటుంది. నిమ్మకాయను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లను అడ్డుకోవచ్చు. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఇక్కడ మేము చెప్పిన నిమ్మకాయ కారం రెసిపీ చేయడానికి ఐదు నిమిషాలు నుంచి పది నిమిషాలు మాత్రమే సమయం పడుతుంది. కనుక అప్పుడప్పుడు ఇలా చేసుకుని ఎందుకు ప్రయత్నించండి.
టాపిక్