Saturday Motivation: ఉద్యోగంలోనే కాదు ఎక్కడైనా స్పష్టంగా మాట్లాడడం అలవాటు చేసుకోండి, అప్పుడే మీరు ప్రపంచానికి తెలిసేది
Saturday Motivation: మన ఉనికిని చాటేది మన పనులే. ఎంత బాగా చదివినా కూడా కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్ లేక గుర్తింపు పొందలేరు. ఎక్కడైనా మీరు మాట్లాడే తీరే మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది.
Saturday Motivation: పని ప్రదేశంలో, మీ కుటుంబంలో, వేడుకల్లో... సందర్భం ఏదైనా సరే మీ కమ్యూనికేషన్ అనేది మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది. మెరుగ్గా కమ్యూనికేట్ చేయడం అనేది ఉద్యోగ ప్రదేశంలోనే కాదు జీవితంలోని అడుగడుగునా అవసరం. అదే మిమ్మల్ని ప్రభావవంతమైన మనుషుల్లో ఒకరిగా మారుస్తుంది. సమర్థమైన కమ్యూనికేషన్ లేక ఎంతోమంది సరైన గుర్తింపు లేక విజయం సాధించలేక మరుగున పడిపోయారు. విజయం సాధించేందుకు మీరు అనుకున్నది అనుకున్నట్టు కమ్యూనికేట్ చేయడం చాలా అవసరం. అప్పుడే ఉన్నతాధికారులకు లేదా కుటుంబంలోని పెద్దవారికి మీరేంటో అర్థం అవుతుంది. నిశ్శబ్దంగా కూర్చోవడం వల్ల ఉపయోగం ఉండదు. అవసరమైనప్పుడు నోరు విప్పి స్పష్టంగా మాట్లాడండి. మీ భావాలను వ్యక్తపరచండి. ఇది వృత్తిగతంగా, వ్యక్తిగతంగా రెండు రకాలుగానూ మీకు ఉపయోగపడుతుంది.

మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడం మాత్రమే కాదు, ఎదుటివారు చెబుతున్నది సహనంగా వినడం కూడా చాలా అవసరం. సమర్థవంతమైన కమ్యూనికేషన్లో వినడం కూడా కీలకమే. మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఎదుటివారు చెబుతున్న ఆలోచనలను, విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఎదుటివారితో ఐ కాంటాక్ట్ ఉండడం చాలా అవసరం. కొంతమంది ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు వారి కళ్ళల్లోకి చూడరు. చుట్టుపక్కల చూస్తూ ఉంటారు. ఇది మీలో స్పష్టతను తెలియజేస్తుంది.
మీరు వాడే భాష చాలా ముఖ్యమైనది. అపార్థాలకు తావివ్వకుండా, ప్రతీ విషయాన్ని ఎదుటివారికి కమ్యూనికేషన్ చేసే సామర్థ్యం మీలో ఉండాలి. మీరు చెప్పే విషయాలను ఎదుటివారు అర్థం చేసుకునేటట్టు చెప్పాలి. అలాగే వారు చెప్పేవి మీరు త్వరగా అర్థం చేసుకునేటట్టు ఉండాలి. ఎదుటివారిని గందరగోళానికి గురి చేసేలా మాట్లాడకూడదు. ఏం చెప్పాలన్న తక్కువ మాటల్లోనే... ఎక్కువగా చెప్పడమే కమ్యూనికేషన్ గొప్పతనం.
ఏ పని చేయాలన్నా చురుకుగా ఉండడం చాలా ముఖ్యం. సహ ఉద్యోగుల అభిప్రాయాలను అర్థం చేసుకోవాలి. మీకు ఎదురవుతున్న సవాళ్లే కాదు మీ సహ ఉద్యోగులకు ఎదురవుతున్న సవాళ్ల గురించి కూడా మీరు మాట్లాడగలగాలి. వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి. ఆందోళనలను గుర్తించాలి. అవసరమైనప్పుడు వారికి మద్దతుని ఇవ్వాలి. ఆ మద్దతు ముఖ్యంగా మాటల రూపంలోనే కాదు, చేతల రూపంలోనూ చూపించాలి. దీనివల్ల పనిచేసే చోట సహోద్యోగులతో మీ బంధం బలపడుతుంది. అలాగే ఉత్పాదకత కూడా పెరుగుతుంది.
కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంచుకోవడానికి నిరంతర సాధన అవసరం. కమ్యూనికేషన్‌కు ఒక హద్దు ఉండదు. ఎంత నేర్చుకుంటే అంతగా ఇమిడిపోతూ ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే దాన్ని తీసుకుని శక్తి కూడా మీరు అలవర్చుకోవాలి. మీలో సానుకూల మార్పులకు ఎప్పుడైనా చోటివ్వాలి. దీనివల్ల మీరు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా విజయం సాధించడం సులభం అవుతుంది.