Must Follow Morning Routine: రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఉదయం ఈ పనులు చేయడం అలవాట్లు చేసుకోవాలి!
Must Follow Morning Routine: ఆరోగ్యంగా ఉండటానికి, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అవేంటో తెలుసుకొని అలవాటు చేసుకోండి.
చాలా మందికి రోజంతా బద్దకంగా, నీరసంగా అనిపిస్తుంది. శరీరంలో సోమరితనం, మనసులో ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల వారు సమర్థవంతంగా ఏ పని చేయలేరు, ఆఫీసులో, ఇంట్లో ఏ పని మీద ధ్యాస పెట్టలేరు. రోజంతా వృధా అవుతుంది. మీరు కూడా ఇలాంటి లక్షణాలతోనే ఇబ్బంది పడుతున్నట్లయితే ఇక్కడ మీకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది. వీటి నుంచి బయట పడాలంటే ఉదయాన్నే లేవగానే మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. వీటిని దినచర్యగా మార్చుకుని అనుసరించారంటే మీరు రోజంగా ఉత్సాహంగా ఉంటారు, సమర్థవంతంగా పని చేయగలగుతారు. ఈ అలవాట్లు ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలిగిస్తాయి. అవేంటో తెలుసుకోండి.

ఉదయం త్వరగా లేవడం..
ఉదయం త్వరగా లేవడం అనేది ఎల్లప్పుడూ మంచి అలవాటు. త్వరగా అంటే మీరు కళాశాలకు, ఆఫీసుకు లేదా పనికి వెళ్ళే సమయానికి కనీసం రెండు గంటల ముందే లేవడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు మీ కోసం సరిపడా సమయం లభిస్తుంది.అలాగే మీకు కావాల్సిన అన్ని పనులను సమర్థవంతంగా నిర్వహించవచ్చు.
పడకను సరిచేయడం..
ఉదయం లేవగానే బాత్రూంలోకి పరిగెత్తి స్నానం చేసేయడానికి మందు మొదటగా మీ పడకను సరిచేయడం అలవాటు చేసుకోండి. ఇది మీ మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే దీనికి ధార్మిక ప్రాముఖ్యత కూడా ఉంది. ప్రతిరోజూ ఉదయం పడకను సరిచేయడం, దుప్పట్లను అమర్చడం వల్ల గ్రహాల స్థితి బాగుంటుంది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
స్ట్రెచింగ్ చాలా ముఖ్యం..
పడక నుండి లేచిన తర్వాత శరీరంలో ఒక రకమైన బిగుతు అనిపిస్తుంది. అలాంటి సందర్భంలో ఉదయం దినచర్యలో కొంత స్ట్రెచింగ్‌ను అంటే ఒళ్లును విరుచుకోవడం అలవాటు చేసుకోండి. ఐదు నుండి పది నిమిషాల పాటు శరీరంలోన అన్ని భాగాలకు కాస్త స్ట్రెచ్ చేయడం దినచర్యగా చేసుకున్నారంటే మీ మానసిక స్థితి మెరుగవడమే కాకుండా శరీరంలో కొత్త చైతన్యం, ఉత్తేజం వస్తాయి.
ఫోన్ తీయకండి..
ఉదయం లేవగానే ఫోన్‌ను చూడటం చాలా మందికి అలవాటు. కానీ ఇది మంచిది కాదని తెలుసుకోండి. లేవగానే ఫోన్ చూడటం వల్ల మీరు రోజంతా ఒత్తిడిగా ఫీల్ అవుతారు. పని మీద ధ్యాస పెట్టలేరు.
కొద్దిగా నడవండి..
ఉత్సాహంగా ఉండటానికి ఉదయం లేవగానే చిన్నపాటి నడక చాలా ముఖ్యం. ఉదయాన్ని అలా కాసేపు నడిచి తాజా గాలిని పీల్చుకోవడం వల్ల మానసిక స్థితిని మెరుగుపడుతుంది. బయటకు వెళ్లి నడవడానికి సమయం లేకపోతే, ఇంటి బాల్కనీ లేదా టెర్రస్‌లో అయిన కాసేపే అలా నడవండి.
ధ్యానం చేయండి..
ఉదయాన్నే గంటల తరబడి కాకపోయిన కనీసం రోజూ రెండు నుండి ఐదు నిమిషాలు ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. ఇది మనసులో ఏకాగ్రత స్థాయిని పెంచుతుంది, వ్యాధులను దూరం చేస్తుంది.
స్నానం చేయండి..
ఉదయపు దినచర్యను పూర్తి చేసిన తర్వాత చల్లని లేదా గోరు వెచ్చని నీటితో స్నానం చేయండి. ఇది శరీరాన్ని శుభ్రం చేయడమే కాకుండా మనసును కూడా ఉత్సాహంగా మార్చుతుంది.
ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోండి
మీరు ఉదయాన్నే తినే ఆహారం శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కనుక మీరు తినే అల్పాహారం ఆరోగ్యకరమైనది, ప్రోటీన్-ఫైబర్‌తో సమృద్ధిగా ఉండేలా చూసుకోండి. దీనివల్ల గంటల తరబడి ఆకలిగా ఉండదు, సులభంగా పని చేసుకునేందుకు సహాపడుతుంది.