Simple Icecream: ఇంట్లోనే ఈజీగా కస్టర్డ్ పౌడర్‌తో ఇలా ఐస్ క్రీమ్ చేసేయండి, దీన్ని రెసిపీ చాలా సింపుల్-make ice cream easily at home with custard powder this recipe is very simple ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Simple Icecream: ఇంట్లోనే ఈజీగా కస్టర్డ్ పౌడర్‌తో ఇలా ఐస్ క్రీమ్ చేసేయండి, దీన్ని రెసిపీ చాలా సింపుల్

Simple Icecream: ఇంట్లోనే ఈజీగా కస్టర్డ్ పౌడర్‌తో ఇలా ఐస్ క్రీమ్ చేసేయండి, దీన్ని రెసిపీ చాలా సింపుల్

Haritha Chappa HT Telugu

Simple Icecream: మార్కెట్లో కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్లు దొరుకుతాయి. అవి తెచ్చుకుంటే చాలు... మీరు సింపుల్‌గా ఐస్ క్రీమ్ చేసేయొచ్చు. దీన్ని తిన్నారంటే నోరూరిపోతుంది.

ఐస్ క్రీమ్ రెసిపీ (Pixabay)

ఐస్ క్రీమ్ అంటే పిల్లలకు ఎంతో ఇష్టం. ముఖ్యంగా వేసవిలో కచ్చితంగా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. కానీ అది చేయడం కష్టమని తల్లులు వెనకడుగు వేస్తూ ఉంటారు. కేవలం పాలు, పంచదార, కస్టర్డ్ పౌడర్ తో మీరు టేస్టీగా ఐస్ క్రీమ్ చేసేయొచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. పైగా మెత్తగా వస్తుంది. పసుపు రంగులో కనిపిస్తుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. దీన్ని చేయడం ఎలాగో తెలుసుకోండి.

కస్టర్డ్ పౌడర్ ఐస్ క్రీమ్ రెసిపీకి కావలసిన పదార్థాలు

కస్టర్డ్ పౌడర్ - పావు కప్పు

పాలు - ఒకటిన్నర కప్పు

వెనిల్లా ఎసెన్స్ - ఒక స్పూను

పంచదార - ఒక కప్పు

ఫ్రెష్ క్రీమ్ - ఒక కప్పు

కస్టర్డ్ పౌడర్ ఐస్ క్రీమ్ రెసిపీ

1. ఈ ఐస్‌‌క్రీమ్ తయారు చేయడం చాలా సులువు.

2. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక పావుగంట సమయాన్ని కేటాయించడమే.

3. స్టవ్ మీద కళాయి పెట్టి పాలు వేసి మరిగించండి.

4. పాలు మరిగాక అందులో పంచదారను వేసి అది కరిగే వరకు బాగా కలుపుకోండి.

5. తర్వాత కస్టర్డ్ పౌడర్‌ను ఒక కప్పులో వేసి అందులో నీళ్లు లేదా కొంచెం పాలు వేసి ఉండలు కట్టకుండా గిలకొట్టుకోండి.

6. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో వేసి బాగా కలపండి.

7. మంట తగ్గించి ఈ మిశ్రమాన్ని అలా కలుపుతూ ఉండండి.

8. ఇది కాస్త చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి.

9. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ మొత్తం కస్టర్డ్ మిశ్రమాన్ని వేసి ఫ్రిజ్లో పెట్టండి.

10. ఒక ఐదారు గంటల తర్వాత అది కొంచెం మెత్తగా గడ్డ కడుతుంది.

11.ఇప్పుడు దాన్ని తీసి మిక్సీ జార్లో వేయండి.

12. మార్కెట్లో ఫ్రెష్ క్రీము ప్యాకెట్లు దొరుకుతాయి.

13. ఒక ప్యాకెట్ తెచ్చి మిక్సీ జార్లో ఆ ఫ్రెష్ క్రీమ్ ను వేయండి. ఇది మొత్తాన్ని మెత్తగా రుబ్బుకోండి.

14. మళ్లీ ఒక గిన్నెలో ఈ మొత్తం మిశ్రమాన్ని వేసి ఫ్రిజ్లో పెట్టండి.

15. ఒక ఐదు గంటల తర్వాత తీస్తే టేస్టీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది.

కస్టర్డ్ పౌడర్ ఐస్‌క్రీమ్ ఒక్కసారి తిన్నారంటే మర్చిపోలేరు. పైగా దీనిలో వాడే పదార్థాలు కూడా చాలా తక్కువ. కాబట్టి సింపుల్ గా చేసేయవచ్చు. వేసవిలో ఐస్ క్రీమ్‌ను బయటకొనే బదులు ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు చాక్లెట్ ఫ్లేవర్ కావాలనిపిస్తే ఆ పాలల్లోనే చాక్లెట్ మిశ్రమాన్ని కూడా వేసి చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేలా చేసుకోవచ్చు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది. మార్కెట్లో కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్లు దొరుకుతాయి. అవి తెచ్చుకుంటే చాలు మీరు సింపుల్ గా ఐస్ క్రీమ్ చేసేయొచ్చు.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం