అన్ని సీజన్లలోనూ అధిక డిమాండ్ ఉండే కూరగాయల్లో క్యారెట్ కూడా ఒకటి. క్యారెట్లలో యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, ఫైబర్, విటమిన్ -కె, ు పోస్టియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, కంటి ఆరోగ్యం, జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యం, గుండె ఆరోగ్యం, శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి పనిచేస్తాయి. అందుకే ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో క్యారెట్ ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు.
క్యారెట్లను అనేక విధాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. కూర చేసుకోవచ్చు, స్పెషల్ రైస్ తయారీకి ఉయోగించుకోవచ్చు. హల్వా లాంటి తీపి పదార్థాలను తయారు చేసుకోవచ్చు. కాని చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో క్యారెట్ జ్యూస్ తాగడానికి ఇష్టపడతారు. ఇది సులభంగా తయారవడమే కాకుండా ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది.
అయితే ఇంట్లో జ్యూసర్ మెషీన్, మిక్సీ ఉంటే జ్యూస్ తయారు చేయడం నిమిషాల్లో పని. కానీ చాలా మంది ఇళ్లలో జ్యూసర్ ఉండకపోవచ్చు, ఉన్న మిక్సీ కూడా పాడైపోయిన సందర్భాలు కూడా రావచ్చు. అలాంటప్పుడు కూడా క్యారెట్ జ్యూస్ మిస్ అవకుండా ఉండాలంటే మీకు సులభమైన మార్గాలున్నాయి. ఈ ట్రిక్స్ తో మిక్సర్ జ్యూసర్ లేకుండానే ఈజీగా క్యారెట్ జ్యూస్ తయారు చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం రండి.
మీ ఇంట్లో మిక్సర్ గ్రైండర్ ఉండి జ్యూసర్ లేకపోతే మిక్సర్ సహాయంతో త్వరగా హెల్తీ అండ్ టేస్టీ క్యారెట్ జ్యూస్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం క్యారెట్లను బాగా కడిగి తొక్క తీయాలి. ఇప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేయాలి. అందులో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇది మంచి పేస్ట్‌గా మారిన తర్వాత పెద్ద జల్లెడలో వేసి చెంచాతో నొక్కి రసం తీయాలి. ఈ విధంగా మీరు క్యారెట్ జ్యూస్‌ను నిమిషాల్లో తయారు చేస్తారు అది కూడా జ్యూసర్ లేకుండా.