Poha Dosa: బ్రేక్‌ఫాస్ట్‌లో అటుకులతో మెత్తని స్పాంజి దోశెలు ఇలా చేసేయండి, ఈ రెసిసీ చాలా సులువు
Poha Dosa: బ్రేక్ ఫాస్ట్ కోసం మీరు ఏదైనా కొత్తగా తినాలనుకుంటున్నారా? అయితే మృదువుగా ఉండే స్పాంజి దోశను వండండి. పోహాతో చేసిన ఈ వంటకం చేయడం చాలా సులువు. దీన్ని చాలా త్వరగా వండేయచ్చు.
చాలా మందికి బ్రేక్ ఫాస్ట్ లో దోశ తినడమంటే ఇష్టం. కానీ ప్రతిసారీ క్రిస్పీ దోశ మాత్రేమ తినడం మనకు విసుగు తెప్పిస్తుంది. మహారాష్ట్ర, బెంగళూరులలో ప్రసిద్ధ పోహా దోశను తయారు చేసి తినండి. వీటిని స్పాంజ్ దోశ అని కూడా అంటారు. వీటిని చేయడం చాలా సులువు. ఉదయం పూట టిఫిన్ ఏంచేయాలో తెలియనప్పుడు ఇలా పోహా దోశ చేసి తినేయండి. ఉదయం పూట తక్కువ సమయంలోనే ఈ అల్పాహారాన్ని తినేయవచ్చు. కాబట్టి టేస్టీ అండ్ సాఫ్ట్ స్పాంజి దోశ రెసిపీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
పోహా స్పాంజి దోశ తయారీకి కావలసిన పదార్థాలు
బియ్యం - రెండు కప్పులు
పోహా - అరకప్పు
మెంతి గింజలు - ఒక స్పూను
నెయ్యి - రుచికి సరిపడా
పెరుగు - రెండు కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
పోహా స్పాంజి దోశ తయారీకి రెసిపీ
- ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టాలి.
- రాత్రిపూట బియ్యాన్ని నానబెట్టడం మరచిపోయినట్లయితే, ఉదయాన్నే బియ్యాన్ని గోరువెచ్చని నీటిలో ఒకటి నుండి రెండు గంటలు నానబెట్టండి. అందులో మెంతులు కూడా కలపాలి.
3. ఈ లోపు అటుకును బాగా కడిగి నానబెట్టాలి. అది త్వరగా ఉబ్బుతాయి.
4. రెండు గంటలు నానబెట్టిన తర్వాత బియ్యాన్ని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి.
5. అలాగే మెంతులను కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి చిక్కటి పేస్ట్ లా తయారుచేసుకోవాలి.
6. అందులోనే అటుకులను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి.
7. ఈ మొత్తం పిండిని ఒక గిన్నెలో వేయాలి. రుచికి సరిపడా ఉప్పును వేయాలి.
8. స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి వేయాలి.
9. పెనం వేడెక్కాక పిండిని మందపాటి దోశెలా వేసుకోవాలి. మరీ పలుచగా వేస్తే క్రిస్పీలా వచ్చేస్తాయి.
10. కాబట్టి మందంగా అట్టులా పోశాక పైన నెయ్యిని చల్లాలి. దీన్ని రెండు వైపులా కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి.
టాపిక్