Diyas Making: అల్యూమినియం ఫాయిల్‌తో ఇలా దీపాలను చేయండి, అందంగా ఉంటాయి-make diya lamps like this with aluminum foil they are beautiful ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diyas Making: అల్యూమినియం ఫాయిల్‌తో ఇలా దీపాలను చేయండి, అందంగా ఉంటాయి

Diyas Making: అల్యూమినియం ఫాయిల్‌తో ఇలా దీపాలను చేయండి, అందంగా ఉంటాయి

Haritha Chappa HT Telugu
Oct 29, 2024 09:30 AM IST

Diyas Making: దీపావళికి దీపాలను అందంగా తయారుచేస్తున్నారా? ఓసారి అల్యూమినియం ఫాయిల్‌తో దీపాలు చేసి చూడండి. ఇవి చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి.

అల్యూమినియం ఫాయిల్‌తో చేసే దీపాలు
అల్యూమినియం ఫాయిల్‌తో చేసే దీపాలు (shutterstock)

దీపావళి రోజున దీపాలు వెలిగించి ఇల్లు కళకళలాడిపోతుంది. మట్టితో చేసిన ప్రమిదలకు రంగులు వేసి అందంగా అలంకరించి అందంగా దీపాలు పెడతారు. కేవలం కొవ్వొత్తులు, మట్టి ప్రమిదలతోనే కాదు, ఇంట్లో వ్యర్థంగా పడేసే అల్యూమినియం ఫాయిల్ తో కూడా దీపాలను తయారుచేయవచ్చు.

అల్యూమినియం ఫాయిల్ ను ఇళ్లలో చపాతీలు ఉంచడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. అల్యూమినియం ఫాయిల్ మీ ఇంట్లో దొరికితే.. కాబట్టి వాటిని బయటపడేసే బదులు దీపావళికి దీపాలు తయారు చేసుకోవచ్చు. వేస్ట్ అల్యూమినియం ఫాయిల్ నుంచి దీపం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

అల్యూమినియం ఫాయిల్ దీపాలు

- అల్యూమినియం ఫాయిల్స్ త్వరగా కుంచించుకుపోతాయి. అయితే ఈ కుంచించుకుపోయే రేకులతో అందమైన దీపాలను తయారు చేసుకోవచ్చు. వాటిని చతురస్రాకారంగా కట్ చేయండి. అల్యూమినియం ఫాయిల్ మూడు నుండి నాలుగు పొరలను తీసుకోండి. దీనితో దీపం తయారు చేస్తే దృఢంగా మారుతుంది.

- ఇప్పుడు ఈ దీపాన్ని కెచప్ బాటిల్ మూత భాగం వంటి గుండ్రని చిన్న ఉపరితలంపై ఉంచి మీ చేతులతో నొక్కండి. తద్వారా అల్యూమినియం ఫాయిల్ ఆ మూత ఆకారంలోకి మారుతుంది.

- అలా నాలుగైదు అల్యూమినియం ఫాయిళ్లను మూత ఆకారంలో చేయండి. ఒకదానిలో ఒకటి పెడితే అది గట్టిగా ఉంటుంది.

- ఇప్పుడు సీసా మూత నుండి ఫాయిల్ ఆకారాన్ని తీసి బయటపెట్టండి. తరువాత దాన్ని తీసి పై భాగాన్ని కట్ చేసి సమంగా చేయండి. తద్వారా అందంగా కనిపిస్తుంది.

- ఇప్పుడు ఇంట్లో పుట్టిన రోజుకు మిగిలిపోయిన లేదా పాత కొవ్వొత్తులను కరిగించి, వాటిని ఈ చిన్న అల్యూమినియం ఫాయిల్ ప్రమిదల్లో నింపండి.

-దారాన్ని మధ్యలో ఉంచి మైనం గట్టిపడేలా చేసుకోండి. అంతే అందమైన అల్యూమినియం ఫాయిల్ దీపాలు రెడీ అయినట్టే. వీటిని వెలిగిస్తే అవి వెండిలా మెరుస్తూ ఉంటాయి.

పర్యావరణహిత ప్రమిదలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కొబ్బరి చిప్పలను ప్రమిదల్లా వాడవచ్చు. చిన్న కొబ్బరి కాయలను తీసుకుని వాటిని పగులగొట్టి, కొబ్బరిని తీసేయాలి. కొబ్బరి చిప్పల కింద మట్టితో చిన్న పీఠాల్లా చేసుకోవాలి. దీని వల్ల అవి కూర్చుంటాయి. వాటిలో నూనె వేసి ఒత్తులేసి దీపాలు వెలిగించుకోవాలి.

గోధుమ పిండితో కూడా ప్రమిదలు చేసుకోవచ్చు. పిండిని గట్టిగా కలుపుకుని ప్రమిదల్లా చేత్తోనే తయారుచేసుకోవాలి. అందులో కొవ్వొత్తిని కరిగించి వేసి మధ్యలో ఒత్తి పెట్టాలి. నిమ్మ తొక్కలను కూడా ప్రమిదల్లా వాడుకోవచ్చు.

Whats_app_banner