Soya Kababs: రుచికరమైన సోయా కబాబ్‌లను కేవలం 15 నిమిషాల్లో ఇంట్లోనే ఇలా తయారు చేయండి! ఇదిగో రెసిపీ!-make delicious soya kebabs in just 15 minutes heres the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Soya Kababs: రుచికరమైన సోయా కబాబ్‌లను కేవలం 15 నిమిషాల్లో ఇంట్లోనే ఇలా తయారు చేయండి! ఇదిగో రెసిపీ!

Soya Kababs: రుచికరమైన సోయా కబాబ్‌లను కేవలం 15 నిమిషాల్లో ఇంట్లోనే ఇలా తయారు చేయండి! ఇదిగో రెసిపీ!

Ramya Sri Marka HT Telugu
Jan 24, 2025 03:30 PM IST

Soya Kababs: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సోయాబీన్ లతో చాలా రకాల పదార్థాలను తయారు చేసుకోవచ్చు. మీరు కబాబ్ ప్రియులైతే సోయా కబాబ్ లను త్వరగా, సులువుగా తయారు చేసుకోవచ్చు. ఈ సులభమైన రెసిపీతో ఇంట్లోనే ఇలా తయారు చేయండి.

రుచికరమైన సోయా కబాబ్‌లను కేవలం 15 నిమిషాల్లో ఇలా తయారు చేయండి!
రుచికరమైన సోయా కబాబ్‌లను కేవలం 15 నిమిషాల్లో ఇలా తయారు చేయండి!

సోయా(మీల్‌మేకర్) ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని కూరగాయలతో పాటు పులావ్ వంటి వివిధ రకాల వంటకాల్లో ఉపయోగించవచ్చు. కానీ మీల్‌మేకర్లతో మీరు ఎప్పుడైనా కబాబ్‌లను ప్రయత్నించారా? చేసి ఉండకపోతే ఈ సారి ట్రై చేసి చూడండి. సోయా కబాబ్ లు చాలా రుచికరంగా ఉండటంతో పాటు తయారు చేయడం కూడా చాలా సులువు. లేకపోతే, ఈ రుచికరమైన సోయా కబాబ్‌లను ఇంట్లోనే తయారు చేసుకోండి. ఇంట్లో ఎప్పుడూ ఉండే వస్తువులతో కేవలం 15నిమిషాల్లో సోయా కబాబ్ లను తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం.

yearly horoscope entry point

సోయా కబాబ్‌ల కోసం కావలసిన పదార్థాలు:-

  • 2 కప్పుల సోయా చంక్స్(మీల్‌మేకర్లు)
  • 2 బంగాళాదుంపలు
  • 1 అంగుళం అల్లం
  • 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలు
  • 3 నుండి 4 పచ్చిమిరపకాయలు
  • అర టీస్పూన్ కారంపొడి
  • ఒకటిన్నర టీస్పూన్ ధనియాల పొడి
  • అర టీస్పూన్ జీలకర్ర పొడి
  • అర టీస్పూన్ గరం మసాలా
  • ఒక టీస్పూన్ ఆమ్‌చూర్ పొడి
  • అర టీస్పూన్ పసుపు
  • రుచికి తగినంత ఉప్పు
  • అర కప్పు కొత్తిమీర
  • నెయ్యి

సోయా కబాబ్‌లను ఎలా తయారు చేయాలి

  • రుచికరమైన కబాబ్‌లను తయారు చేయడానికి, ముందుగా ఒక పాత్రలో నీటిని పోసుకుని బాగా మరిగించాలి.
  • మరుగుతున్న నీటిలో సోయా చంక్స్(మీల్‌మేకర్లు) వేసి ఉడికించాలి.
  • ఇవి 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికిన తర్వాత, వడకట్టి వాటిలో నుంచి నీరంతా పోయేలా గట్టిగా పిండికోవాలి.
  • ఇప్పుడు వీటిని మిక్సర్‌లో వేసి దాంట్లోనే అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి మెత్తటి పేస్టులా తయారు చేయాలి.
  • ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని మందుగానే ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలను చిన్నచిన్న ముక్కలుగా చేసి కలపాలి.
  • ఇప్పుడు దీంట్లొ కొత్తిమీర, అన్ని మసాలా దినుసులను వేసి మెత్తటి పిండిలా కలుపుకోవాలి.
  • ఇప్పడు ఈ పిండి మిశ్రమం నుండి చిన్న చిన్న ముక్కలు తీసుకుని కబాబ్‌ల కోసం టిక్కీ ఆకారంలో తయారు చేయాలి.
  • తర్వాత ఒక ఫ్రైయింగ్ పాన్‌ దాంట్లో కొద్దిగా నెయ్యి వేయాలి.
  • నెయ్యి కాస్త వేడిక్కిన తర్వత కబాబ్‌లను వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
  • ఇలా మిగిలిన పిండి మొత్తంతో కబాబ్‌లను సిద్దం చేసుకుని వేయించుకోవాలి.
  • అంతే ఆరోగ్యకరమైన, రుచికరమైన కబాబ్ లు తయారైనట్లు.
  • వీటిని టామాటా పచ్చడి లేదా సాస్ వంటి మీకు నచ్చిన ఏ పచ్చడితో అయినా తినచ్చు. కొన్ని ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకున్నారంటే రుచి అదిరిపోతుంది. మీ ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఇది కచ్చితంగా నచ్చుతుంది.

Whats_app_banner