రొట్టె, పాలను కలిపి 15 నిమిషాల్లోనే రుచికరమైన మలై కుల్ఫీ తయారు చేసుకోండి! సింపుల్ రెసిపీ మీ కోసం!-make delicious malai kulfi in just 15 minutes using bread and milk this simple recipe is just for you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  రొట్టె, పాలను కలిపి 15 నిమిషాల్లోనే రుచికరమైన మలై కుల్ఫీ తయారు చేసుకోండి! సింపుల్ రెసిపీ మీ కోసం!

రొట్టె, పాలను కలిపి 15 నిమిషాల్లోనే రుచికరమైన మలై కుల్ఫీ తయారు చేసుకోండి! సింపుల్ రెసిపీ మీ కోసం!

Ramya Sri Marka HT Telugu

వేసవిలో రుచికరమైన చల్లని కుల్ఫీ తినాలని ఎవరికి ఉండదు. అది కూడా ఇంట్లోనే తయారుచేసుకుని తింటే ఇంకెంత బాగుంటుందో కదా.! రొట్టె, పాలతో తయారుచేసే ఇన్‌స్టంట్ కుల్ఫీ రెసిపీని రెడీ చేసేయండి.

ఇంట్లోనే ఉండి కుల్ఫీ తయారుచేసుకోవడం ఎలా (Shutterstock)

వేసవిలో మనకు కామన్‌గా తినాలనిపించే చల్లని ఆహారపదార్థాలలో కుల్ఫీ ఒకటి. పెద్దలు కూడా ఆస్వాదించగల ఫుడ్ ఐటెం. ఇంట్లోనే తయారుచేసే మెత్తటి కుల్ఫీలలో ఈ కుల్ఫీ చాలా ప్రత్యేకం. అందుకే, ఈరోజు మీ కోసం చాలా ఆహ్లాదకరమైన కుల్ఫీ రెసిపీని తీసుకొచ్చాం. ఇందులో మీకు పాలు, బ్రెడ్‌తో ఎలా తయారుచేయాలో చూసేయండి. 15 నిమిషాలలో రెడీ అయ్యే ఈ కుల్ఫీతో ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసేయండి.

బ్రెడ్‌తో కుల్ఫీ తయారుచేయడానికి కావలసిన పదార్థాలు

  • సుమారు రొట్టె ముక్కలు - 3
  • పాలు - 1 లీటరు
  • కొన్ని కేసరి పలుకులు
  • చక్కెర - అర కప్పు
  • అంజీర్లు - 4 (చిన్న ముక్కలుగా)
  • తరిగిన బాదం - (2 చెంచాలు)
  • తరిగిన పిస్తా - (2 చెంచాలు)
  • యాలకుల పొడి - (1/4 చెంచా)

బ్రెడ్, పాలతో కుల్ఫీ ఎలా తయారు చేయాలి:

  1. బ్రెడ్, పాలతో రుచికరమైన మెత్తని కుల్ఫీ (ఐస్ క్రీం) తయారు చేయడానికి బ్రెడ్ తీసుకొని వాటి మందపాటి అంచులను కట్ చేసుకోండి.
  2. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోండి.
  3. ఆ తర్వాత గ్యాస్ మీద కడాయి ఉంచి, అందులో పాలు మరిగేలా ఉంచండి.
  4. పాలు మరిగేటప్పుడు, అందులో చక్కెర, కొన్ని కేసరి పలుకులు, తరిగిన అంజీర్లను కలపండి.
  5. ఇప్పుడు పాలను కలుపుతూ సుమారు 5 నిమిషాల పాటు ఉడికించండి.
  6. చక్కెర పాలలో బాగా కలిసే వరకు ఆగి ఆ తర్వాత పాలలో రొట్టె పొడిని కలపండి. పాలను కలుపుతూ ఉడికించండి.
  7. పాలు క్రీంలాగా మారిన తర్వాత, అందులో తరిగిన బాదం, పిస్తా రుచి కోసం చిటికెడు యాలకుల పొడిని కలపండి.
  8. అన్ని పదార్థాలను కలుపుతూ కొంతసేపు ఉడికించండి.
  9. పాలు చాలా చిక్కగా మారే వరకు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కుల్ఫీ పాత్రల్లో పోసి, సుమారు 8 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచండి.
  10. అయితే, మీ రుచికరమైన మెత్తని పాలు, రొట్టె కుల్ఫీ రెడీ అయిపోతుంది.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం