Dahi Curry: రెండు నిమిషాల్లో ఇలా దహి కర్రీ చేసేసుకోండి, అన్నం చపాతీల్లోకి అదిరిపోతుంది-make dahi curry in two minutes know the perugu curry recipe in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dahi Curry: రెండు నిమిషాల్లో ఇలా దహి కర్రీ చేసేసుకోండి, అన్నం చపాతీల్లోకి అదిరిపోతుంది

Dahi Curry: రెండు నిమిషాల్లో ఇలా దహి కర్రీ చేసేసుకోండి, అన్నం చపాతీల్లోకి అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu

Dahi Curry: తక్కువ సమయం ఉన్నప్పుడు రెండే నిమిషాల్లో పెరుగు కర్రీ ఎలా చేసుకోవాలో ఇక్కడ ఇచ్చాము. ఇది వేడి వేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది. చపాతీ, రోటీతో కూడా తినవచ్చు.

పెరుగు కర్రీ రెసిపీ

సమయం తక్కువ ఉన్నప్పుడు పెరుగు కర్రీ లేదా దహి కర్రీని రెండు నిమిషాల్లోనే చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆఫీసుకి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్లే వారికి సమయం తక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా దహి కర్రీ చేసుకుంటే సమయం ఎక్కువ ఆదా అవుతుంది. పైగా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగులో చేసిన కర్రీ కదా ... చప్పగా ఉంటుందేమో అనుకోకండి. స్పైసీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. దీన్ని చపాతీ, రోటీతో కూడా తినవచ్చు. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

దహీ కర్రీ రెసిపీకి కావలసిన పదార్థాలు

పెరుగు - ఒక కప్పు

కారం - ఒక స్పూను

ఎండుమిర్చి - మూడు

పసుపు - అర స్పూను

ఉల్లిపాయలు - ఒకటి

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

నీళ్లు - అరకప్పు

నూనె - రెండు స్పూన్లు

గరం స్పూను - అర స్పూను

ఆవాలు - అర స్పూను

జీలకర్ర - అర స్పూను

దహీ కర్రీ రెసిపీ

1. పెరుగు కర్రీ చేసేందుకు ముందుగా పెరుగును ఒక కప్పులో వేసి పెట్టుకోండి.

2. దాంట్లో అరకప్పు నీళ్లు పోసి మరీ చిక్కగా కాకుండా అలానే పలుచగా కాకుండా ఇగురులాగా చేసుకోండి.

3. ఇప్పుడు అందులో పచ్చి ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపండి.

4. స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి నూనె వేయండి.

5. ఆ నూనెలో ఎండుమిర్చిని ఆవాలు జీలకర్ర వేసి వేయించండి.

6. అందులోనే కారం, పసుపు కూడా వేసి కలుపుకోండి.

7. అర స్పూన్ గరం మసాలా కూడా వేసి వేయించండి.

8. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ నూనె తాలింపును మొత్తం తీసుకొచ్చి పెరుగులో వేయండి.

9. అంతే టేస్టీ దహి కర్రీ రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది.

10. వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.

11. కేవలం రెండు నిమిషాల్లోనే అయిపోతుంది. కాబట్టి డిన్నర్ లోనూ, లంచ్ లోను ఓపిక లేనప్పుడు దీన్ని వండి వెంటనే అన్నం తినవచ్చు.

దహీ కర్రీ స్పైసీగా ఉంటుంది కాబట్టి పెద్దలకు ఇది బాగా నచ్చుతుంది. కారం తగ్గిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో దహి కర్రీ చేసి చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం